E-Paper
Advertisement

అడవిలో కొడుకు శవం… పాతికేళ్ళుగా అంతుచిక్కని మిస్టరీ… ఉత్కంఠ పెంచే ప్రతి మలుపు

అడవిలో  కొడుకు శవం… పాతికేళ్ళుగా అంతుచిక్కని మిస్టరీ… ఉత్కంఠ పెంచే ప్రతి మలుపు
Advertisement

Mystery horror thriller : హాలీవుడ్ నుంచి వచ్చే హారర్ థ్రిల్లర్ సినిమాలలో భయపెట్టే సీన్స్ బాగానే ఉంటాయి. సస్పెన్స్ ను మైన్టైన్ చేస్తూ వీళ్ళు గుండెల్లో గుబులు పుట్టిస్తుంటారు. ఈ నేపథ్యంలో మనం ఇలాంటి ఒక హారర్ సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమా సుమారు 1 గంట 58 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. దీనిని ఒక ఒక గంభీరమైన సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా చాలా నిదానంగా సాగుతూ, అడవిలోని ఒక రకమైన భయంకరమైన వాతావరణంతో మనల్ని కథలోకి లాక్కుంటుంది. విభిన్నమైన హారర్ సినిమాని చూడాలనుకునే వాళ్ళకి ఇది కచ్చితంగా నచ్చుతుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2024లో వచ్చిన ఈ బ్రిటిష్ మిస్టరీ హారర్ మూవీ పేరు ‘ది మూర్’ (The Moor). దీనికి క్రిస్ క్రోనిన్ దర్శకత్వం వహించారు. ఇందులో సోఫియా లా పోర్టా: క్లేయర్ పాత్రలో, డేవిడ్ ఎడ్వర్డ్-రాబర్ట్‌సన్: బిల్ తండ్రి పాత్రలో, ఎలిజబెత్ డోర్మెర్-ఫిలిప్స్: ఎలియనోర్ పాత్రలో నటించారు. ఇది 2023లో జరిగిన FrightFest లో ప్రదర్శించబడింది. అక్కడ ఈ సినిమాకు అత్యంత భయంకరమైన సినిమా కేటగిరీలో ‘Best Scare’ అవార్డు లభించింది. దర్శకుడు క్రిస్ క్రోనిన్ ‘Best Director’ కేటగిరీలో నామినేట్ అయ్యారు. ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ నటించిన చివరి సినిమాల్లో ఇది ఒకటి. ఈయన గతంలో ‘టైటానిక్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం prime videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ 1996లో మొదలవుతుంది. క్లేయర్ అనే ఒక చిన్న పిల్ల తన స్నేహితుడు డానీతో కలిసి ఒక షాపులో చాక్లెట్లు దొంగిలించడానికి వెళ్తుంది. ఆ గందరగోళంలో క్లేయర్ బయటకు వచ్చేస్తుంది కానీ, డానీ లోపలే ఉండిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక సీరియల్ కిల్లర్ డానీని ఎత్తుకెళ్లిపోయి చంపేస్తాడు. తన వల్లే స్నేహితుడు చనిపోయాడనే బాధ క్లేయర్‌ను 25 ఏళ్లపాటు వెంటాడుతూనే ఉంటుంది. పాతికేళ్ల తర్వాత ఆ కిల్లర్ జైలు నుండి విడుదలయ్యే సమయం వస్తుంది. వాడు బయటకు రాకుండా అడ్డుకోవాలంటే డానీ మృతదేహం దొరకాలి. అందుకే డానీ తండ్రి బిల్, క్లేయర్ కలిసి ఆ మృతదేహం కోసం వెతకడం ప్రారంభిస్తారు.

వీళ్ళకి సహాయంగా ఎలియనోర్ అనే ఒక అతీంద్రియ శక్తి ఉన్న అమ్మాయిని కూడా తీసుకుని, ఆ భయంకరమైన అడవి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు డానీ ఆత్మ కోసం వెతుకుతుంటే, వాళ్ళకి అంతకంటే భయంకరమైన విషయాలు ఎదురవుతాయి. ఆ భూమి అడుగున కొన్ని వందల ఏళ్ల నాటి ఒక భయంకరమైన దుష్ట శక్తి దాగి ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇక కథ కూడా మరింత భయపెట్టేలా ఉంటుంది. చివరికి వాళ్ళు ఆ అడవిలో ఎదుర్కొన్న వింత సంఘటనలు ఏమిటి ? డానీ ఆచూకీ కనిపెట్టారా ? అసలు వీళ్ళు అక్కడినుంచి ప్రాణాలతో బయట పడ్డారా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : దెయ్యం పట్టిన బిడ్డ కోసం తల్లి ఆరాటం… దెయ్యాల దెబ్బకు దద్దరిల్లే స్టోరీ… ఒంటరిగా చూస్తే గుండె గల్లంతే

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×