Dishti Dosham: చిన్న పిల్లలైనా, పెద్దవాళ్లైనా ఒక్కోసారి అకస్మాత్తుగా నీరసంగా ఉండటం, ఆకలి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో మన పెద్దలు దిష్టి తగిలిందేమోనని భావిస్తుంటారు. దిష్టి లేదా దృష్టి దోషం అనేది మన సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం. అందుకే ఉప్పు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ, కర్పూరంతో దిష్టి తీసే ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మరి మన ఇంట్లోనే లభించే వస్తువులతో పెద్దలు పాటించే దిష్టి తీసే పద్ధతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..
దిష్టి తగిలితే ఇంట్లోనే సులభంగా తగ్గించుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిలో నూనె ఒత్తులు లేదా ఎండుమిరపకాయల ప్రయోగం చాలా తొందరగా పనిచేస్తుంది. ఒక కప్పులో నీళ్లు పోసి అందులో కాస్త పసుపు, కుంకుమ కలిపి బాధితుల చుట్టూ మూడు సార్లు తిప్పి పారేయడం వల్ల ఆ చెడు శక్తి తొలగిపోతుంది. అలాగే ఉప్పు, ఆవాలు కలిపి దిష్టి తీసి నిప్పుల మీద వేస్తే టటటమంటూ కాలిపోతాయి. ఇలా చేస్తే శరీరంలో ఉన్న చెడు ప్రభావం క్షణాల్లో తొలగిపోయి మనిషి తేలికగా అవుతాడు.
Also Read: చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!
అలాగే కర్పూరం ఉపయోగించి దిష్టి తీయడం చాలా పాత పద్ధతి. ఒక వెడల్పు ఉన్న పళ్లెంలో లేదా అరటి ఆకులో కర్పూరం బిళ్లలు పెట్టి వెలిగించి, దృష్టి తగిలిన వ్యక్తి తల నుండి కాళ్ల వరకు మూడు సార్లు కిందికి పైకి తిప్పాలి. ఆ తర్వాత ఆ కర్పూరాన్ని ఇంటి బయట లేదా బాత్రూమ్ కాలువలో పడేయాలి. ఈ విధానం వల్ల గాలిలో ఉండే బ్యాక్టీరియా కూడా నశించడమే కాకుండా.. మనిషికి తగిలిన నైగెటివ్ ఎనర్జీ వెంటనే మాయమైపోతుంది. ఇది చాలా వేగంగా ఫలితం ఇస్తుంది.
మరో సులభమైన పద్ధతి ఏమిటంటే.. బాగా పండిన ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కొద్దిగా కుంకుమ రాసి, బాధితుడి తల చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజ్, మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిశలో తిప్పాలి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని చోట లేదా నాలుగు దారులు కలిసే కూడలిలో కోసి పడేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి తీవ్రమైన దిష్టి అయినా ఇట్టే తొలగిపోతుంది.
ఇంటి పెద్దలు ఎప్పుడూ చెప్పే మరో మంచి ఉపాయం ఉప్పు దిష్టి. ఒక పిడికెడు కల్లు ఉప్పును తీసుకుని ఎవరికైతే దిష్టి తగిలిందో వారి తలపై మూడు సార్లు కుడి నుంచి ఎడమకు తిప్పి, ఆ ఉప్పును బాత్ రూమ్ సింక్ లో వేసి నీళ్లు పడేయాలి. ఉప్పుకి చెడు శక్తిని పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. అందుకే ఉప్పుతో దిష్టి తీస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇవన్నీ మన ఇళ్లలో దొరికే వస్తువులతోనే చేసుకోవచ్చు కాబట్టి ఎవరికీ ఎలాంటి భయం ఉండదు.
Also Read: రాత్రి చక్కగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటుందా? అయితే మీ బాడీలో ఈ 5 లోపాలున్నట్టే!