E-Paper
Advertisement

నరేష్ కి బిగ్ బాస్ అన్యాయం.. ఆ ముగ్గురే విజేతలు!

నరేష్ కి బిగ్ బాస్ అన్యాయం.. ఆ ముగ్గురే విజేతలు!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ పదవ సీజన్లో ఇప్పటికే ఆరు వారాలు పూర్తయ్యాయి. అయితే తాజాగా ఏడవ వారంలో గోట్ అవ్వడానికి నిర్వహించిన టాస్క్ లో కనివిని ఎరుగని రీతిలో కంటెస్టెంట్స్ లో ఉన్న పదింతల ఎమోషన్ బయటికి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది..ముఖ్యంగా బిగ్ బాస్ చివరి క్షణంలో ప్లేటు తిప్పేయడంతో తనకు అన్యాయం జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. సుమారుగా మూడు గంటల పాటు టాస్క్ లో పోటీపడినప్పటికీ.. బిగ్ బాస్ తనను పక్కన పెట్టేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు నరేష్. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న నరేష్ లో ఇంత బాధ అభిమానులను కంటతడి పెట్టించింది.

బిగ్ బాస్ అన్యాయం చేశాడు అంటూ నరేష్ కన్నీళ్లు..

అసలు విషయంలోకి వెళ్తే.. 47వ రోజుకు సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో తనకు అన్యాయం జరిగింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నరేష్. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగింది? అనే విషయానికి వస్తే.. హౌస్ లో ఉన్న 17 మందిని మూడు లెవెల్స్ గా డివైడ్ చేశారు బిగ్ బాస్. రెడ్ , ఎల్లో, గ్రీన్.. అయితే రెడ్ లెవెల్ లో ఉన్న వారికి గోట్ అయ్యే అవకాశం లేదని చెప్పేసాడు . దాంతో ఎల్లో లెవెల్లో ఉన్నవాళ్లకి ఇచ్చే టాస్క్ పూర్తి చేసి గ్రీన్ లెవెల్ కి వెళ్ళాలి. అలా వెళ్ళిన వాళ్ళు గోట్ అని చెప్పాడు. అంతేకాదు గోట్ అయిన వాళ్లకు స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పాడు బిగ్ బాస్.

టాస్క్ లో గెలిచిన నరేష్..

Advertisement

ఎల్లో లెవెల్ లో ఉన్న వారు భుజం మీద కర్ర పెట్టుకొని తిరుగుతూ ఉండాలి. బిగ్ బాస్ చెప్పినప్పుడల్లా ఆ కర్రకు సంచాలక్ చెప్పిన వాళ్ళు బరువులు వేయాలి. మోయలేక పడిపోయిన వాళ్ళు ఇందులో నుంచి ఎలిమినేట్ అవుతారు. రెండు మూడు కేజీల బరువు ఉన్న సంచులు ఉన్నాయి. ఎన్ని సంచులు వేయాలి అని బిగ్ బాస్ చెబుతాడు. గట్టిగానే పోటీపడ్డారు . చివరికి చాలామంది బరువులు మోయలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఆఖరికి పడిపోయారు. ఇక చివరిగా మిగిలింది రాంప్రసాద్, అమన్, ముఖేష్, నరేష్, దేబ్జాని నీతు.. ఆఖరి వరకు అమన్, నరేష్ గట్టిగానే పోరాడారు. ఇక అమన్ కి బరువు పెరగడంతో అమన్ వదిలేసాడు. చివరికి నరేష్ గెలిచాడు.

తనకు ఎవరూ లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అమన్ ..

శివ తో జరిగిన గొడవ తర్వాత అమన్ తనకు ఇంట్లో ఎవరూ లేరని , ఎవరు హెల్ప్ చేయలేదని ఏడ్చేసాడు.. శివ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేబ్జాని ఇంటికి వెళ్లి పోతానని ఏడ్చేసింది . చివరికి నరేష్ విన్నర్ గోట్ అవుతాడు అనుకుంటే.. నరేష్ గెలిచినా.. ఎక్కువసేపు నిలబడి మోసినప్పటికీ.. వెయిట్స్ ఎక్కువగా లేవని పక్కకు తప్పించి, రూల్ మార్చేసి ఎక్కువ వెయిట్స్ ఎక్కువ సేపు మోసినందుకు అమన్ ను గోట్ గా ప్రకటించారు. ఇక అమ్మాయిలలో నీతూ , దెబ్జానీ కూడా ఎక్కువసేపు బరువులు మోయడంతో వాళ్లని గోట్ గా ప్రకటించాడు.

గోట్స్ కి స్పెషల్ బెనిఫిట్స్ ఇవే..

Advertisement

అయితే గోట్ గా మిగిలిన దేబ్జాని , అమన్, నీతులను రెండు వారాలపాటు ఎలిమినేషన్ నుంచి తప్పించి వారికి బెన్ఫిట్స్ కలిగించాడు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నరేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు గెలవలేదు.. నేను గెలవలేదు.. ఒకవేళ ఇలా చేస్తారని చెప్పి ఉంటే నేను ముందే టాస్క్ నుంచి తప్పుకునే వాడిని కదా.. మూడు గంటలకు కష్టపడ్డా ఫలితం లేదు అంటూ రామ్ ప్రసాద్ తో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు . ఇక ఆ తర్వాత మళ్లీ తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు నరేష్ . మొత్తానికైతే నిన్నంతా కంటతడితో కన్నీళ్ళ మయమైన హౌస్ నేడు నవ్వుల పువ్వులు పూసింది.

 

Related News

Podarillu : కన్నా తల్లి నిజం చెప్తుందా..? ఇలాంటి ట్విస్ట్ నెవ్వర్ బిఫోర్..

Illu Illaalu Pillalu : సీరియల్లో మరో ట్విస్ట్.. ఆ క్యారక్టర్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు మైండ్ బ్లాక్.. మీనా పై ప్రశంసలు.. కన్నీళ్లు తెప్పించాడు భయ్యా..

Podarillu Today Episode : కన్నాకు మహా వార్నింగ్.. మహా నిజం చెప్తుందా..? మాధవ్ కన్నీళ్లు..

Karthika Deepam 2 Serial Today Episode October 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తనను కిడ్నాప్ చేశారని జ్యోత్స్న ఎవరిని చూపిస్తుంది  

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. చందు మాటతో వల్లి కన్నీళ్లు.. భాగ్యం కు మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలుస్తుందా..? కమల్ లైఫ్ లోకి కొత్త అమ్మాయి.. అసలు ట్విస్ట్ ఇదే..

Big Stories

Advertisement
×