E-Paper
Advertisement

జోగి రమేష్ కోడలికి రోడ్డు ప్రమాదం.. ఘటనపై అనుమానాలు.. పోలీసులకు మేఘన తండ్రి ఫిర్యాదు!

జోగి రమేష్ కోడలికి రోడ్డు ప్రమాదం.. ఘటనపై అనుమానాలు.. పోలీసులకు మేఘన తండ్రి ఫిర్యాదు!
Advertisement

Jogi Meghana: మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘన ప్రయాణిస్తున్న కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం కేవలం యాక్సిడెంట్ కాదని, దీని వెనుక కుట్ర ఉండొచ్చంటూ మేఘన తండ్రి పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది.

అసలేం జరిగింది?

ఈ నెల 15వ తేదీన జోగి మేఘన, ఆమె తండ్రి కృష్ణ విజయవాడ నుంచి కోదాడ వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో మార్గమధ్యలో వారి కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం తీవ్రంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

జోగి రమేష్‌పై అనుమానాలు!

Advertisement

ఈ ఘటనపై మేఘన తండ్రి కృష్ణ వెంటనే అప్రమత్తమై మరుసటి రోజు (అక్టోబర్ 16న) ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణహాని ఉందని, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన పోలీసులను కోరారు. ముఖ్యంగా ఈ ఘటన వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉండొచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన రోడ్డు ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకం కాదని ప్రాథమిక విచారణలో పోలీసులు భావిస్తున్నారు.

మునుపటి వివాదాలు, వేధింపు ఆరోపణలు

కొంతకాలంగా జోగి రమేష్ కోడలు మేఘన తన భర్త రాజీవ్, మామ జోగి రమేష్‌తో పాటు మరికొందరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని, అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధించారని ఆమె గతంలో ఆరోపించారు. అంతేకాకుండా తనపై హత్యాయత్నం కూడా జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల క్రితం తన ప్రాణాలకు ముప్పు ఉందని మేఘన స్వయంగా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ మేరకు అప్పట్లోనే కేసు నమోదైంది.

Advertisement

Also Read: ట్రంప్ అల్లుడిపై సంచలన ఆరోపణలు.. యావత్ ప్రపంచమే షాక్.. ఈయన మామూలోడు కాదు!

మాజీ మంత్రి మౌనం!

ప్రస్తుతం జరిగిన కారు ప్రమాదం కూడా పాత వివాదాలకు కొనసాగింపేనని, తమ అంతుచూసేందుకే ఈ ప్రమాదం సృష్టించారనే అనుమానాలను మేఘన కుటుంబీకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిణామాలపై మాజీ మంత్రి జోగి రమేష్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ వస్తే ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ యాక్సిడెంట్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: పులివెందులలో హైటెన్షన్.. ఎంపీ అవినాష్ రెడ్డికి పోలీసుల నోటీసులు!

Tags

Related News

పులివెందులలో హైటెన్షన్.. ఎంపీ అవినాష్ రెడ్డికి పోలీసుల నోటీసులు!

బిగ్ బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వాయిదా!

సీఈసీ నియామక మార్పులపై జగన్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

విజయవాడ పడమట డొంక సెంటర్‌లో యువకుడు హత్య.. నిందితులు అరెస్ట్!

విజయనగరంలో కోలాహలంగా పైడితల్లి అమ్మవారి జాతర!

ఏపీ 22వ SIPB సమావేశంలో.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు?

చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది, పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×