E-Paper
Advertisement

7వ వారం నామినేషన్ లో నిలిచింది ఎవరంటే?

7వ వారం నామినేషన్ లో నిలిచింది ఎవరంటే?
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ 6వ వారం ఎలిమినేషన్ లో భాగంగా షాలిని (Shalini)నీ ఎలిమినేట్ చేస్తున్నట్లు మొదట ప్రకటించి, ఆ తరువాత ఆమెను సర్ప్రైజ్ చేశారు హోస్ట్ నాగార్జున (Nagarjuna). షాలినినీ ఇంటికి పంపించకుండా సీక్రెట్ రూమ్ లో పెట్టారు. మరోవైపు సోమవారం రావడంతో ఎప్పటిలాగే నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ఒకరికొకరు విమర్శలు గుప్పిస్తూ.. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ నామినేషన్ ను వేడెక్కించారు. ఇక సోమవారం నాటి ఎపిసోడ్ కి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలలో జరిగిన నామినేషన్లను బట్టి చూస్తే ఈ వారం నామినేషన్ లోకి వచ్చిన వారి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ముగిసిన నామినేషన్ ప్రక్రియ..

ఇకపోతే సోమవారం ఎపిసోడ్ కి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియలో నీతూ వర్సెస్ వర్షిణి, శివ వర్సెస్ రోహిత్ మధ్య రచ్చ ప్రోమోలలో ప్రధానంగా కనిపించింది. ఈరోజు ఉదయం విడుదల చేసిన మొదటి ప్రోమోలో షాలిని కాళ్లు పట్టుకోవడం తనకు నచ్చలేదని ఝాన్సీ ఆర్కే రామకృష్ణను నామినేట్ చేసింది. అసలు ఇది పాయింటే కాదు.. కాళ్లు పట్టుకోవడంలో తప్పే లేదని ఆర్కే వాదించాడు. ఝాన్సీ కూడా సింపతి కోసం ట్రై చేస్తోందని.. ఆమెలా నటించి మరీ చూపించాడు . ఇక మరొకవైపు వర్షిణి టాస్కులు ఆడడం లేదని నీతూ ఫైర్ అయ్యింది. ముఖేష్ ని అడ్డుపెట్టుకొని హౌస్ లో సర్వైవ్ అవుతోంది అంటూ సంచలన కామెంట్లు చేసింది. అటు వర్షిణి కూడా దమ్ముంటే నాతో తలపడు అంటూ నీతూపై మండిపడింది.

ఈవారం నామినేషన్ లోకి వచ్చింది ఎవరంటే?

Advertisement

ఇక మరో ప్రోమో రోహిత్ సుధీర్ మధ్య వాదులాట, ఆ తర్వాత శివ – రోహిత్ మధ్య గొడవ, షాలిని కోసం రోహిత్ , త్రిగుణ్ మధ్య వాగ్వాదం అన్నీ కూడా బాగానే హీట్ పుట్టించాయి. అయితే ఈ గొడవలన్నింటినీ కూడా మరోవైపు సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన షాలిని ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత షాలిని తిరిగి మళ్ళీ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం .. ఈ ఏడవ వారానికి గానూ.. రోహిత్, త్రిగుణ్, వర్షిణి, అమన్, వంశీ, నీతూ, దక్షి , రామకృష్ణ ఇలా మొత్తం ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి స్టార్ మా అధికారికంగా ప్రకటించే వరకు ఈ లిస్టు ఫైనల్ చేయలేం.

also read:టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు.. ఏకంగా ముగ్గురు అరెస్ట్!

వర్షిణి ఈసారి కూడా తప్పించుకుంటుందా?

Advertisement

ఇకపోతే గత ఆరు వారాలుగా ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటూ వస్తున్న వర్షిణి.. ఈ వారం కచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది అంటూ అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా షాలినీని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. అయితే షాలిని లాంటి కంటెస్టెంట్ హౌస్ నుండి పంపించకుండా సీక్రెట్ రూమ్ కి పంపించి మళ్లీ ఆమెను హౌస్ లోకి పంపి, కంటెస్టెంట్ కి షాక్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్. మరి ఆరు వారాలుగా ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటూ వస్తున్న వర్షిని ఈ వారం కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఈ వారమైన ఆమెను ఎలిమినేట్ చేస్తారా లేక మళ్ళీ ఆమెను హౌస్ లోనే ఉంచుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

త్రివిక్రమ్ కమెడియన్ సునీల్ మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపడ్డాయా?

షాలిని చెల్లా.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి రోహిత్?

పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..వరుడు ఎవరంటే..?

ముఖేష్ ను అడ్డుపెట్టుకొని వర్షిని సర్వైవ్ అవుతోందా? నీతూ షాకింగ్ కామెంట్స్!

Karthika Deepam2 : వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విలన్ అవుట్..

దీపిక ఒక్క ఈవెంట్ కు ఇంత తీసుకుంటుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇంత మోసమా..? బాలు ఇరుక్కుంటాడా..? నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Big Stories

Advertisement
×