Madanapalle Elections: ఏపీలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విదిలో ఉన్న ఓ సహాయ ఎన్నికల అధికారి పై టీడిపి అధ్యర్ధి దాడి చేసినట్టు అక్కడి అధికారుల తెలిపారు. దీంతో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
10వ వార్డులో నామినేషన్ల పరిశీలనపై ఇద్దరి మధ్య ఈ వివాదం తలెత్తింది. టీడీపీ అభ్యర్థి రామినేని సహదేవ నాయుడి దాడి చేసినట్టు అధికారి ఆరోపణలు చేసారు. ఎన్నికల అధికారి బూరయ్య అనే వ్యక్తి పై భౌతిక దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనుచరులు, ఓ న్యాయవాది సమక్షంలో అందరూ కలిసి అధికారి చొక్కా చించివేసినట్లు ఆ అధికారులు ఫిర్యాదు చేసారు.
అయితే తాను చెప్పినట్లుగా ఇతరుల నామినేషన్లు తిరస్కరించలేదని ఆగ్రహంతో టీడీపీ వ్యక్తి పరిశీలన కేంద్రంలోకి అభ్యర్థి, ప్రపోజర్‌కు మాత్రమే అనుమతిచ్చారు. దీంతో పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నామినేషర్ కేధ్రం లోపలికి రావడంతో దాడి జరిగిందని అధికారి తెలిపారు. ఈ ఘటనపై సహాయ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన బూరయ్య. ఈ అంశంపై పోలీసులు ఏలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పడు చూడాలి.
Also read: బంగాళాదుంపలతో కాదు.. అవకాడోతో ఇలా ఫ్రైస్ చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది!