Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తనకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ వస్తుంటాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు ఇష్టమైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన గిఫ్ట్ లు ఇస్తూ ఫ్యాన్స్ అభిమానానికి ఫిదా అవుతుంటారు. ఇక విజయ్ దేవరకొండకు సందీప్ రెడ్డి వంగాకు మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ అర్జున్ రెడ్డి సినిమా నుంచి బాగా క్లోజ్ అయిన విషయం తెలిసిందే.. రీసెంట్ గా ‘రోమాంచికం’ సినిమా ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగపై ఉన్న అభిమానాన్ని విజయ్ బయటపెట్టి హైలెట్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. విజయ్ డైరెక్టర్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన ఎపిక్ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నువ్వు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ వచ్చారు.. అంతేకాదు ఇదే ఈవెంట్ కి క్రేజీ డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ కూడా గెస్ట్ గా వచ్చారు. సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన అభిమాన డైరెక్టర్కు ఒక ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఇచ్చిన వాచ్ ని సందీప్ రెడ్డి వంగ వెంటనే పెట్టుకోవడం చూసి వీళ్ళిద్దరికి ఒకరి ఉంటే ఒకరు ఎంత ఇష్టమో అని ఆ వీడియోని చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.. మా కొండన్న మనసు బంగారం అంటూ విజయ్ అభిమానులు కామెంట్లతో హీరో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
విజయ్ దేవరకొండ గత కొన్ని ఏళ్లుగా సక్సెస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. గీత గోవిందం తర్వాత వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. రీసెంట్ గా బిజీ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ హీరో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్ధన్ మూవీ భారీ యాక్షన్ కధతో రాబోతుంది. ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా జనాలు అనే విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక దీంతోపాటుగా రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. పిల్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కనిపించబోతున్న సినిమా కావడంతో జనాలు ఈ సినిమాను చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే విజయ్ దేవరకొండ ఖాతాలో మళ్ళీ బిగ్గెస్ట్ హిట్ సినిమాలు పడినట్లే.. అంతేకాదు విజయ్ ట్రాక్ రికార్డు కూడా మారిపోతుంది. ఈ సినిమాలు అతని ట్రాక్ రికార్డుని మారుస్తాయేమో చూడాలి..
?stkn=dzFsNDRhbXg1Z25j
Also Read :మమిత బైజు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఆ లిస్ట్ లోకి చేరినట్లే..!