Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ , 7 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో ఈ షో మరింత రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే ఆరువారాలకు గాను 6 మంది ఎలిమినేట్ అయ్యారు. మధ్యలో మూడవ వారం , ఆరవ వారం ఎలిమినేషన్ తప్పించిన విషయం తెలిసిందే. ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ నిర్వహించగా అపూర్వ, చరణ్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారం వర్షిణి, షాలిని ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. షాలిని ఎలిమినేట్ అయింది. కానీ అనూహ్యంగా ఆమెను సీక్రెట్ రూమ్ కి పంపించారు.
ఇక ఏడవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగా సాగుతోంది. కంటెస్టెంట్స్ , వైల్డ్ కార్డ్స్ మధ్య పోటాపోటీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొంతమంది సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చేస్తే.. మరి కొంత మంది ఊహించని విధంగా నామినేట్ చేస్తున్నారు. సోమవారం నామినేషన్ లో భాగంగా విడుదల చేసిన ప్రోమోలలో శివ వర్సెస్ రోహిత్, త్రిగుణ్ వర్సెస్ రోహిత్, వర్షిని వర్సెస్ నీతూ అంటూ కంటెస్టెంట్స్ మధ్య గొడవ బాగానే జరుగుతోంది. ఇకపోతే తాజాగా 43వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మూడవ ప్రోమోలో ముఖేష్ నోరు జారడంతో నీతూ కన్నీళ్లు పెట్టుకుంది.
ప్రముఖ డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, టెలివిజన్ పర్సనాలిటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది నీతూ నటరాజ్ . గుజరాత్ కి చెందిన వారైనా.. ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ ను వివాహం చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోయింది. అయితే గతంలో నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ లో సందడి చేయగా.. ఇప్పుడు ఈమె సీజన్ 10 లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇక కంటెస్టెంట్స్ తప్పొప్పులను బయటపెడుతూ.. అబ్బాయిలతో సమానంగా టాస్క్‌లలో పోటీ పడుతూ అందరిని ఆకట్టుకుంటుంది.. ఇకపోతే వర్షిని సరిగ్గా ఆడడం లేదు అని ముఖేష్ వల్లే హౌస్ లో సర్వైవ్ అవుతుంది అంటూ నామినేట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు వంశీ నామినేషన్ లో ముఖేష్ ఆమెను ఇన్సల్ట్ చేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. వంశీ తన నామినేషన్ లో భాగంగానే తాను నామినేట్ చేయాలనుకున్న వారిని పిలిచారు. కానీ అక్కడ వినే ఆడియన్స్ కి కూడా నీతు గారు అని పిలిచినట్లే ఉంది పాపం తన తప్పేం లేదు నీతూ కూడా తన పేరే పిలిచారు అనుకుని అక్కడికి వచ్చి చెప్పండి అని చెప్పి అడిగింది. అయితే అంతలో ముకేష్ వెటకారంగా నవ్వేశాడు. నీతూ మాట్లాడుతూ.. నాకు తెలియక లేచాను. అలా హేళన చేసి నవ్వుతారా ఎవరైనా అడిగింది. అయితే ముఖేష్ నాకు నవ్వొచ్చింది అంటూ మళ్ళీ వెటకారంగా సమాధానం చెప్పాడు. ఇక రోహిత్ ఫైర్ అవుతూ.. మినిమం బేసిక్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అంటూ మాట్లాడుతుండగా ముఖేష్ ఇందాక బయట విషయం వచ్చి నీకు చెప్పింది కదా అంటూ చెబుతుండగా.. రోహిత్ ఫైర్ అవుతూ ఫైల్స్ వేసుకొని ప్రతిసారి ఇలా నడుస్తూ మాట్లాడడం కాదు అంటూ బాడీ షేమింగ్ చేశాడు రోహిత్.
also read:కాఫీ విత్ కరణ్ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్!
ఇక తర్వాత వంశీ టాస్క్ లో భాగంగా నీతూ తో మాట్లాడుతూ గట్టిగా అరిచాడు. నీతూ గట్టిగా అరవకు అంటూ చెప్పింది. అయితే వంశీ అక్కడితో ఆగకుండా బయట నటించి వచ్చారా లేక ఇక్కడ నటిస్తున్నారా అంటూ మాట్లాడాడు. ఇక తర్వాత నీతూ తరఫున రోహిత్ మాట్లాడగా ..ముఖేష్ మాటలు తూలుతూ నీతూ మీకు డాన్స్ చేయడం రాదు అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఒక కొరియోగ్రాఫర్ ను పట్టుకొని తనకు డాన్స్ రాదు అంటూ మాట్లాడడం అవమానంగా ఫీల్ అయిన నీతూ అక్కడే ఏడ్చేసింది.