E-Paper
Advertisement

Nikhil Maliyakkal: సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ నిఖిల్..ఫోటోలు వైరల్!

Nikhil Maliyakkal: సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ నిఖిల్..ఫోటోలు వైరల్!
Advertisement

Nikhil Maliyakkal: నిఖిల్ మలియక్కళ్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా సొంతం చేసుకున్న నిఖిల్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్నప్పటికీ పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అలాగే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న నిఖిల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

సొంత ఇంటికల నెరవేర్చుకున్న నిఖిల్..

తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. సొంత ఇంటి కల నెరవేరిందని ఈయన తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా నిఖిల్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హౌస్ ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు కూడా పాల్గొన్నారని స్పష్టమవుతుంది.

బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్..

Advertisement

ఇక నిఖిల్ విషయానికి వస్తే ఈయన కర్ణాటకలోని మైసూర్ కు చెందిన వ్యక్తి మనయే మంత్రాలయ అనే సీరియల్స్ ద్వారా నటుడిగా ఈయన తన కెరియర్ ప్రారంభించారు. అయితే తెలుగులో గోరింటాకు అనే సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సీరియల్ మంచి సక్సెస్ కావడంతో తెలుగులో ఊర్వశివో రాక్షసివో కలిసి ఉంటే కలదు సుఖం, స్రవంతి వంటి తదితర సీరియల్స్ లో నటించిన ఈయన బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని కూడా అందుకున్నారు.

Advertisement

ఇలా సీజన్ 8 కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన నిఖిల్ ఈ కార్యక్రమంలో విజేతగా బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ తర్వాత బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్నారని చెప్పాలి. కేవలం బుల్లితెర కార్యక్రమాలతోపాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక నిఖిల్ మరొక సీరియల్ నటి కావ్య శ్రీతో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు కానీ వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారని స్పష్టం అవుతుంది. ఇలా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడంతో వీరి అభిమానులు కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. బ్రేకప్ అనంతరం వీరిద్దరూ కెరియర్ పరంగా దృష్టి సారించి ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Vijay Rashmika wedding: ముగిసిన విజయ్ రష్మిక పెళ్లి.. మీడియాకు స్పెషల్ గిఫ్ట్స్!

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×