Vijay -Rashmika:రష్మిక మందన్న (Rashmika mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమాయణం సాగించి.. అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ.. నేడు ఉదయపూర్ ప్యాలెస్ సాక్షిగా హిందూ సాంప్రదాయం ప్రకారం మూడు ముళ్ళు ఏడడుగులతో ఒక్కటయ్యారు. ఇకపోతే అభిమానులతో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. అటు రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ లకు ఈ విషయం తెలుసన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ రెండు ఫ్యామిలీలు కూడా ఎక్కడ ఈ విషయంపై ప్రస్తావించలేదు.
ముఖ్యంగా రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్ అయినా సరే అటెండ్ అవుతూ ఆ కుటుంబ సభ్యులకు మరింత దగ్గరయ్యింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్లలో కూడా రష్మిక మందన్న మాట్లాడుతూ.. “నువ్వు నా ఫ్యామిలీ రా “అంటూ చేసిన కామెంట్లు కూడా అభిమానులకు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాయి. పైగా విజయ్ దేవరకొండ తల్లి మాధవి (Madhavi) తో రష్మిక చాలా చనువుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమెతో కలిసి సినిమాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అలాంటి ఈమె తన అత్తపై ఏ విధంగా అయితే ప్రేమను పెంచుకుందో.. అటు అత్త మాధవి కూడా రష్మికపై అంతే ప్రేమను పెంచుకుందని తాజాగా ఆమె చేసిన కామెంట్లు వింటే అర్థమవుతుంది.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఘనంగా జరుగుతున్నాయి . నేడు ఉదయం హిందూ సాంప్రదాయంలో రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్ళు వేయగా.. సంగీత్ వేడుకలో విజయ్ తల్లి మాధవి రష్మికను..”నా డార్లింగ్ రుషి” అంటూ ఆప్యాయంగా పిలిచి ఆమె భావోద్వేగానికి గురైంది. ఈ సన్నివేశం చూసిన అతిధులు, సన్నిహితులు సైతం ఎమోషనల్ అయ్యారు .మొత్తానికి అయితే తన కొత్త కోడల్ని రుషి అని పిలవడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:Rashmika Mandanna: విజయ్ తో పెళ్లి వేళ.. మాతృభాషలో రష్మిక వీడియో రిలీజ్!
ఇకపోతే ఈరోజు ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఇక సాయంత్రం నాలుగున్నర గంటలకు రష్మిక మందన్న మత సాంప్రదాయ ఆచారాల ప్రకారం కొడవ పద్ధతిలో వివాహం జరగనుంది.
ఇకపోతే ఈ వివాహానికి అతిధుల కోసం పసందైన వంటకాలు సిద్ధమయ్యాయి. అందులో తెలంగాణ స్టయిల్ మటన్ బిర్యానీ ,నాటుకోడి పులుసు, గారెలు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలతో పాటు కర్ణాటక స్పెషల్ బిసిబిలే బాత్, ఫోర్క్ కర్రీ , మైసూర్ పాక్ వంటి వెరైటీలు మెనూలో చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే కొడవ సాంప్రదాయమైన పందికూర తింటానని గతంలో రష్మిక చెప్పిన విషయం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.