E-Paper
Advertisement

Big TV Kissik Talks: నవ్వుతూ నవ్వించే దమ్ము శ్రీజ కన్నీటి కష్టాలు!

Big TV Kissik Talks: నవ్వుతూ నవ్వించే దమ్ము శ్రీజ కన్నీటి కష్టాలు!
Advertisement

Big TV Kissik Talks: ఈ మధ్యకాలంలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ సెలబ్రిటీ టాక్ షో లను నిర్వహిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ కూడా వినూత్న ప్రయోగం చేస్తూ ఒక సెలబ్రిటీ టాక్ షోను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 47 ఎపిసోడ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. 48వ ఎపిసోడ్ కూడా పూర్తయిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా తన సత్తాచాటి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దమ్ము శ్రీజ (Dammu Srija) వచ్చింది. తన కెరీర్ లో జరిగిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్న తమ కుటుంబ కష్టాలను కూడా పంచుకుంది. ఇక ఆ మాటలు విన్న తర్వాత బయటకు కనిపించే శ్రీజ మనసులో ఇంత కష్టం ఉందా? అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు..

బిగ్ బాస్ హౌస్ లో ఎదుర్కొన్న ట్రోల్స్ కారణంగా నీకు ఎలా అనిపించింది? అని ప్రశ్నించగా.. “చిన్నప్పటి నుంచి ఇలాంటి అగ్నిపరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నాను. పైగా నవ్వు పెట్టేది ఏంటి? ఎన్ని ట్రోల్స్ చేసుకుంటావో చేసుకో అని లైట్ తీసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ చిన్నప్పటి నుంచి ఎన్ని అగ్ని పరీక్షలు భరించావు అని మళ్లీ తిరిగి వర్షా ప్రశ్నించగా.. “ఎవరూ ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మేము లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మాకు సొంత ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉంటున్నాము. నానమ్మ తాతయ్య వాళ్ళు ఇచ్చిన ఇల్లు అయితే ఉంది కానీ ఇప్పుడు మేము అద్దె ఇంట్లోనే ఉంటున్నాము”. అంటూ శ్రీజ చెప్పుకొచ్చింది.

Advertisement

ALSO READ:Anil Ravipudi: హీరోగా సక్సెస్ డైరెక్టర్.. అనిల్ ఏమన్నారంటే?

సింపతి పొందడం నాకు ఇష్టం లేదు..

ఇక హార్ట్ బ్రేక్ అయ్యేంత ఇన్సిడెంట్ నీ జీవితంలో ఏం జరిగింది? అని మళ్లీ వర్షా ప్రశ్నించగా.. ఎవరింట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు.. అలాగే మా ఇంట్లో కూడా ఉన్నాయి అని తెలిపింది. అదే మీ ఇంట్లో సమస్యలు అంటున్నావ్ కదా.. అది ఏ రకంగా అని మళ్ళీ వర్ష ప్రశ్నించగా.. ఇప్పుడు నేను నా సమస్యలు చెప్పుకున్నాను అనుకోండి.. మీరు అయ్యో అంటూ బాధపడడం నాకు అస్సలు నచ్చదు. అందుకే నేను నా సమస్యలను బయటకు చెప్పుకోను అంటూ తన సమస్యలను బయటకు చెప్పకుండానే చాలా చిల్ గా కనిపించింది. ప్రస్తుతం శ్రీజ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారడంతో అందరినీ నవ్వించే శ్రీజ హృదయంలో ఇంత బాధ ఉందా? అందుకే ఆమె వాటిని దాచుకుంటూ బయట సింపతీ పొందడం ఇష్టం లేక ఇలా నవ్వుతూ కనిపిస్తోందా? ఈమె ఆలోచనలకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మొత్తానికైతే శ్రీజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×