E-Paper
Advertisement

Anil Ravipudi: హీరోగా సక్సెస్ డైరెక్టర్.. అనిల్ ఏమన్నారంటే?

Anil Ravipudi: హీరోగా సక్సెస్ డైరెక్టర్.. అనిల్ ఏమన్నారంటే?
Advertisement

Anil Ravipudi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అతి కొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని.. కామెడీ జోనర్ ను నమ్ముకొని వరుస సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న హీరోలతో సినిమాలు చేసి, వారికంటూ ఒక మంచి విజయాన్ని వారి ఖాతాలో చేరుస్తున్నారు. అలా ఎంతోమంది ఫెయిల్యూర్ హీరోస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి.. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్ ను టార్గెట్ గా చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు.

వెంకటేష్ తో కొత్త మూవీ.. స్క్రిప్ట్ పనుల్లో బిజీ..

అలా 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి.. 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేసి మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.అలా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈయన.. ఈ రెండు సంక్రాంతులకు వరుసగా 300 కోట్లకు పైగా వసూలు సాధించి తెలుగు సినీ ఇండస్ట్రీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

Advertisement

ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మళ్లీ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్2 , ఎఫ్3 , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్న ఈయన.. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.

హీరోగా నటించిన పై అనిల్ రావిపూడి క్లారిటీ..

ఇలా ప్రస్తుతం ఒకవైపు ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగానే దర్శకుడిగా తనదైన మార్పు చూపిస్తున్న ఈయన హీరోగా ఎప్పుడు నటిస్తారంటూ తరచూ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడితో “దర్శకుడిగా కాకుండా నటుడిగా అవకాశం వస్తే హీరోగా చేస్తారా? విలన్ గా చేస్తారా? అనే ప్రశ్న ఎదురవగా.. అనిల్ రావిపూడి మాట్లాడుతూ..” హీరోగా నటించడం కంటే విలన్ పాత్రలు చేయడమే నాకు ఇష్టం” అంటూ ఊహించని కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Advertisement

ALSO READ:Sivaji: దిగొచ్చిన శివాజీ.. ప్రభావం గట్టిగానే పడిందే!

అలాంటి పాత్రను డిజైన్ చేసే డైరెక్టర్ ఎవరు?

ఒకవేళ నటుడిగా అనిల్ రావిపూడికి అవకాశం వస్తే ఆయన హీరోగా కాకుండా విలన్ గా అలరించబోతారని చెప్పవచ్చు ముఖ్యంగా పవర్ఫుల్ నెగిటివ్ షేడ్ చేయాలని తనకి ఎప్పటినుంచో కోరిక ఉందని, అయితే ప్రస్తుతానికి దర్శకత్వంపై ఫోకస్ పెట్టానని, యాక్టింగ్ పై ఎలాంటి ప్లాన్ చేయలేదని చెప్పిన అనిల్ రావిపూడికి.. ఆయనకు తగ్గట్టుగా ఏ డైరెక్టర్ పవర్ ఫుల్ పాత్ర డిజైన్ చేస్తారో చూడాలి. ఏది ఏమైనా ఆయన కల నెరవేరాలని, అటు దర్శకుడుగానే కాకుండా ఇటు విలక్షణ నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×