E-Paper
Advertisement

Prabhas Fauji: ప్రభాస్ ‘ఫౌజి’ అప్డేట్ అదిరింది.. రిలీజ్ ప్లాన్ ఎప్పుడంటే?

Prabhas Fauji: ప్రభాస్ ‘ఫౌజి’ అప్డేట్ అదిరింది.. రిలీజ్ ప్లాన్ ఎప్పుడంటే?
Advertisement

Prabhas Fauji: ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్‌డేట్ వచ్చేసింది! ‘కల్కి 2898 AD’ వంటి భారీ విజయం తర్వాత రెబల్ స్టార్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫౌజి’ . హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి వచ్చిన ఆశక్తికరమైన వార్తతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటిలోనూ ‘ఫౌజి’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి ప్రధాన కారణం దర్శకుడు హను రాఘవపూడి ఎంచుకున్న పీరియాడిక్ వార్ డ్రామా నేపథ్యం. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read also-Big TV Kissik Talks: నవ్వుతూ నవ్వించే దమ్ము శ్రీజ కన్నీటి కష్టాలు!

టాకీ పార్ట్ పూర్తి..

Advertisement

లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించి ప్రధానమైన టాకీ పార్ట్ (డైలాగ్ సీన్స్) దాదాపుగా పూర్తయింది. నటీనటుల మధ్య సాగే కీలక సన్నివేశాలను దర్శకుడు ఇప్పటికే చిత్రీకరించారు. ఇక ఇప్పుడు అసలైన సవాల్ మొదలైంది. అదే సినిమాలోని యాక్షన్ పార్ట్. ఈ చిత్రం చారిత్రక యుద్ధ నేపథ్యం (1940ల కాలం) లో సాగుతుంది కాబట్టి, భారీ ఎత్తున యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని భారీ వార్ ఎపిసోడ్స్ కోసం ఏకంగా 100 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. సినిమాలోని యుద్ధ సన్నివేశాలు అత్యంత సహజంగా, గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉండబోతున్నాయట. దీని కోసం భారీ సెట్స్ వేయడమే కాకుండా, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో యాక్షన్ కొరియోగ్రఫీ జరుగుతోంది. ఈ 100 రోజుల పాటు ప్రభాస్ యుద్ధ భూమిలో శత్రువులతో పోరాడే వీరుడిగా కనిపించనున్నారు.

Read also-BB Jodi season 2 Promo : అనిల్ రావిపూడి ఎంట్రీ అదుర్స్.. భాను vs నేహా ఫైట్.. డైరెక్టర్ గా ఇమ్మూ..

దసరా టార్గెట్!

Advertisement

సాధారణంగా భారీ చిత్రాలకు సమయం చాలా పడుతుంది. కానీ, చిత్ర యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసేందుకు దర్శకుడు హను రాఘవపూడి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. అదే ‘సెకండ్ యూనిట్’ను రంగంలోకి దింపడం. ప్రధాన యూనిట్ ఒకవైపు కీలక సన్నివేశాలను తీస్తుంటే, సెకండ్ యూనిట్ సమాంతరంగా ఇతర యాక్షన్ పార్ట్స్ లేదా అనుబంధ దృశ్యాలను చిత్రీకరిస్తుంది. దీనివల్ల ప్రొడక్షన్ వేగం పెరగడమే కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా తగినంత సమయం లభిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ కాలం నాటి ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే విడుదలైన కొన్ని లీక్డ్ పిక్స్ చూస్తుంటే ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. ‘సీతారామం’ వంటి క్లాసిక్ ఇచ్చిన హను రాఘవపూడి, ప్రభాస్ లాంటి మాస్ హీరోని ఎలా చూపిస్తారో అన్న కుతూహలం అందరిలోనూ ఉంది.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×