E-Paper
Advertisement

నడిరోడ్డుపై బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు.. ఆకతాయి అసభ్యకర ప్రవర్తన.. వీడియో వైరల్!

నడిరోడ్డుపై బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు.. ఆకతాయి అసభ్యకర ప్రవర్తన.. వీడియో వైరల్!
Advertisement

Film industry:సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్.. వీరిని కలవాలని, కరచాలనం చేయాలని, ఆఖరికి వీరితో ఒక సెల్ఫీ అయినా దిగాలని కోరుకునే అభిమానులు ఒక ఎత్తైతే.. వీరితో దురుసుగా ప్రవర్తిస్తూ.. వీరిని వేధింపులకు గురి చేసే బ్యాచ్ మరో ఎత్తు. కొంతమంది అమ్మాయిలను బహిరంగంగా నడిరోడ్డుపై వేధిస్తూ వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఒక బిగ్ బాస్ బ్యూటీకి నడి రోడ్డుపై వేధింపులు ఎదురవడం , అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు సదరు ఆకతాయి అసభ్యకర ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆ బిగ్ బాస్ బ్యూటీ ఒక వీడియోని ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది.

నడిరోడ్డుపై నటికి వేధింపులు..

ఆమె ఎవరో కాదు గత ఏడాది అక్టోబర్లో బెంగళూరులో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఒకరిగా నిలిచిన బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ కన్నడ సీరియల్ నటి దివ్య సురేష్(Divya Suresh). బెంగళూరులో ఆదివారం రాత్రి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. తన కజిన్ తో కలిసి కారు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి తమను వెంబడిస్తూ చాలా అసభ్యకరంగా నడిరోడ్డుపై ప్రవర్తించాడని దివ్య ఆరోపించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే కాకుండా తాను తీసిన వీడియోని కూడా ఇన్స్టా లో షేర్ చేసింది. దివ్య సురేష్ షేర్ చేసిన వీడియో కథనం ప్రకారం..” ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో ఒక వ్యక్తి మమ్మల్ని అనుసరిస్తూ బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే వెంటనే మేము అతడిని ప్రశ్నించినప్పటికీ అతడు తన ప్రవర్తనను మార్చుకోలేదు. మేము కారులోకి ఎక్కే వరకు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాడు” అంటూ తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని పంచుకుంది.

Advertisement

also read:Mahidhar: ఆంధ్ర వర్సెస్ తెలంగాణ.. ‘ఇడుపు కాయితం’ రచ్చపై నోరుజారి క్లారిటీ ఇచ్చిన మహిధర్!

మహిళలకు భద్రత ఎక్కడ.. ప్రశ్నించిన దివ్య..

అలాగే ఆమె పోలీసులను కూడా ప్రశ్నిస్తూ.. రాత్రిపూట రోడ్డుపై నడిచింది అనే కారణంతో ఏ ఒక్క మహిళ ఇలాంటి వేధింపులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.అంటూ తీపింది. అలాగే బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ మహిళలకు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. మరి ఆ భద్రత ఎక్కడ? అంటూ ప్రశ్నించింది దివ్య సురేష్. ఇక ప్రస్తుతం దివ్య తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇలా ఇన్స్టాలో పంచుకోవడంతో సదరు అభిమానులు , నెటిజన్లు అతడి ప్రవర్తన పై మండిపడుతున్నారు. ముఖ్యంగా అతడు ఎవరో ఐడెంటిఫై చేసి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

దివ్య సురేష్ కెరియర్..

Advertisement

2017లో మిస్ ఇండియా సౌత్ టైటిల్ గెలుచుకున్న దివ్య సురేష్ ప్రస్తుత వయసు 33 సంవత్సరాలు. తర్వాత #9, హిల్టర్ క్రాస్, కెంపు హలడి హసిరు, హిరణ్య, రౌడీ బేబీ తదితర చిత్రాలలో నటించిన ఈమె.. 2021 లో కలర్స్ టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 8 లో పాల్గొనింది. ఇక అంతేకాదు నన్ను హేండ్తి ఎంబిబిఎస్, జోడి హక్కి వంటి సీరియల్స్ లో కూడా నటించింది.

Related News

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Big Stories

Advertisement
×