E-Paper
Advertisement

Mahidhar: ఆంధ్ర వర్సెస్ తెలంగాణ.. ‘ఇడుపు కాయితం’ రచ్చపై నోరుజారి క్లారిటీ ఇచ్చిన మహిధర్!

Mahidhar: ఆంధ్ర వర్సెస్ తెలంగాణ.. ‘ఇడుపు కాయితం’ రచ్చపై నోరుజారి క్లారిటీ ఇచ్చిన మహిధర్!
Advertisement

Mahidhar: వంశీరెడ్డి దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతూ.. ప్రియదర్శి కథానాయకుడిగా , ప్రముఖ జానపద గాయని నాగదుర్గ హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఇడుపు కాయితం. బన్నీ వాస్ సుకుమార్.. సుకుమారు రైటింగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ అర్థం ఏమిటంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పెద్దలు జారీ చేసే సాంప్రదాయ విడాకుల లేఖ. అయితే ఈ సినిమా టైటిల్ ప్రకటించగానే ఆంధ్రతో పాటు హైదరాబాదులో నివసిస్తున్న చాలామందికి దీని అర్థం తెలియక దీని అర్థం ఏంటో చెప్పాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. పైగా ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా అని ఫన్నీ పోస్టులు పెట్టడంతో తెలంగాణకు చెందిన నెటిజన్స్ ఫైర్ అయ్యారు.

ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై మహిధర్ కామెంట్..

ఈ సినిమా టైటిల్ గురించి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ రేంజ్ లో సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రముఖ యూట్యూబర్ మహిధర్ హైదరాబాదులో ఆంధ్రా వాళ్ళు తమ ఆస్తులను అమ్మితే తెలంగాణ వాళ్లు కొనగలరా? అంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దీంతో ఆయనపై తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పిన మహిధర్.. హైదరాబాదులో ఆంధ్రా వాళ్ళు ఉండకూడదంటే తెలంగాణ హైకోర్టు నుండి నోటీస్ తీసుకురండి అంటూ మరో వీడియో రిలీజ్ చేశారు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నా మాట వెనక్కి తీసుకుంటున్నా – మహిధర్

Advertisement

తాజాగా మహీధర్ తన కొత్త వీడియోలో వివరణ ఇస్తూ.. “నేను చేసిన ఆ కామెంట్లు కేవలం కొందరిని ఉద్దేశించి చెప్పినవి మాత్రమే. తెలంగాణలో ఉన్న అందరిని ఉద్దేశించి కాదు. ఆంధ్ర – తెలంగాణ వివాదాలు తలెత్తినప్పుడు కొందరు ఆంధ్రావాళ్లను ఆంధ్రకు వెళ్లిపోవాలని చెప్పడం సరికాదు. అలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉద్దేశించి నేను స్పందించాను. నా మాటలు తప్పని కొంతమంది నాతో చెప్పడం వల్లే నేను ఆ మాటలను అంగీకరించి వెనక్కి తీసుకుంటున్నాను.

also read:సమంత జీవితాంతం ఆ నరకం అనుభవించాల్సిందేనా.. నిజాలు బయటపెట్టిన నందిని రెడ్డి!

హైకోర్టు నుండి నోటీస్ తీసుకురండి – మహిధర్

Advertisement

ఇక హైదరాబాదులో ఆంధ్రా వాళ్ళు ఎక్కువగా ఉన్నారని, వారు హైదరాబాద్ ని విడిచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లయితే.. సోషల్ మీడియాలోకి వచ్చి కామెంట్లు చేయకుండా నేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి, హైదరాబాదులో తెలంగాణ వాళ్లు మాత్రమే ఉండాలని, ఇతరులు ఉండొద్దని భావిస్తే న్యాయస్థానం ద్వారా నోటీసులు తీసుకొని చర్యలు తీసుకోవాలని మహిధర్ తెలిపారు. ముఖ్యంగా కొందరు చేసిన తప్పులను మొత్తం రాష్ట్రానికి ఆపాదించడం సరికాదు అంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అసలు తన ఉద్దేశం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా తనపై విమర్శలు గుప్పించడం కూడా సరికాదు అంటూ కామెంట్ చేశారు మహిధర్. ఇక ప్రస్తుతం మహిధర్ పై వస్తున్న విమర్శల వేళ స్పందిస్తూ ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు.

చిన్న టైటిల్.. రెండు రాష్ట్రాల మధ్య వార్..

అంతేకాదు ఇడుపు కాయితం టైటిల్ నుంచి మొదలైన వార్.. సోషల్ మీడియాలో ఏకంగా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పెరిగేలా చేస్తోందని మహిధర్ హెచ్చరించారు. అటు నటుడు నరేష్ వంటి వ్యక్తులు కూడా దీనిపై స్పందించి గొడవను సర్దుమణిగేలా ప్రయత్నం చేసినా.. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రగిలించాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ఇడుపు కాయితం టైటిల్ పై మొదలైన వార్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వార్ గా పీక్స్ కి చేరుకుంది. ఇక ఈ వార్ ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

Related News

సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!

సంక్రాంతికి స్టార్ హీరోల జాతర.. థియేటర్లు సరిపోతాయా గురూ?

‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’…. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ థ్రిల్లర్!

రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఫ్యాన్స్‌కు పండగే!

ఆగస్టు 15 వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. నిహారిక, లావణ్య స్పెషల్ అట్రాక్షన్

ఎర్ర కండువా.. చేతిలో తుపాకీ.. శ్రీ విష్ణు మాస్ లుక్ అదిరిపోయిందే!

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. ‘సెయాన్’ అప్డేట్ వచ్చేసింది..

Big Stories

Advertisement
×