E-Paper
Advertisement

Demon Pawan – Ritu: బీబీ జోడిగా రీతూ, పవన్… ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోనే చించేసారుగా?

Demon Pawan – Ritu: బీబీ జోడిగా రీతూ, పవన్… ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోనే చించేసారుగా?
Advertisement

Demon Pawan – Ritu: బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రియాలిటీ షో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తెలుగులో ఇటీవల సీజన్ 9 కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రీతు చౌదరి (Ritu Chaudary)ఒకరు. అలాగే ఈ కార్యక్రమంలో కామన్ మ్యాన్ క్యాటగిరీలో పాల్గొనే టాప్ త్రీ వరకు చేరుకున్న డెమోన్ పవన్ (Demon Pawan) కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు.

బీబీ జోడిలో రీతు పవన్..

ఇలా బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ జంట పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. వీరిద్దరు హౌస్ లో చాలా క్లోజ్ గా ఉన్న నేపథ్యంలో ఇద్దరు మధ్య లవ్ ట్రాక్ జరుగుతోందంటూ వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరూ బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే ఈ జంట తాజాగా బీబీ జోడిలో జంటగా సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు.

Advertisement

ఈసారి కప్పు మాదే..

ఈ ప్రోమోలో భాగంగా పవన్ రీతు ఈ కార్యక్రమంలో అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తోంది. ఇక పవన్ మాట్లాడుతూ బిగ్ బాస్ కార్యక్రమం అయిపోతుందని తెలియగానే చాలా బాగా పడ్డాను కానీ ఇలా బీబీ జోడీలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని, కచ్చితంగా ఈ షోలో కప్పు గెలుచుకొని బయటకు వెళ్తాను అంటూ పవన్ తెలియజేశారు. ఇక మొదటి ఎపిసోడ్ లోనే వీరిద్దరూ తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టారని చెప్పాలి. ఇలా వీరిద్దరూ చేసిన ఈ డాన్స్ పర్ఫామెన్స్ లో కెమిస్ట్రీ అద్భుతంగా వర్క్ అవుట్ అవ్వడంతో వీరిద్దరి పర్ఫామెన్స్ పై జడ్జెస్ కూడా ప్రసంశలు కురిపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరి పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుంది? పవన్ అక్కడ మిస్ చేసుకున్న కప్ ఇక్కడ గెలుచుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ తో పాటు సినీ నటి సదా, నటి శ్రీదేవి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శని , ఆదివారం స్టార్ మాలో ప్రసారమవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి రీతూ పవన్ జంటగా రావడంతో వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Also Read: Maruthi: రాజా సాబ్‌ మూవీని రెండో సారి చూడండి… అభిమానులకు డైరెక్టర్ మారుతి సూచన

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×