E-Paper
Advertisement

Best Mileage Cars Diesel: టాటా To హ్యుందాయ్.. క్రేజీ మైలేజ్ ఇచ్చే డీజిల్ కార్లు ఇవే!

Best Mileage Cars Diesel: టాటా To హ్యుందాయ్.. క్రేజీ మైలేజ్ ఇచ్చే డీజిల్ కార్లు ఇవే!
Advertisement

Best Mileage Diesel Cars 2024: అద్భుమైన ఫీచర్లతో పాటు మంచి మైలేజ్ ఇచ్చే బోలెడు కార్లు ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఏవి? లీటర్ డీజిల్ తో ఎంత దూరం ప్రయాణించవచ్చు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హ్యుందాయ్ అల్కాజార్ డీజిల్

హ్యుందాయ్ లైనప్‌ లో అల్కాజార్ మాత్రమే 7-సీటర్ SUV. అంతేకాదు, అత్యుత్తమ మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటి. చాలా హ్యుందాయ్ కార్ల మాదిరిగానే అల్కాజార్ కూడా సౌకర్యం, సౌలభ్యంతో పాటు మంచి ఫీచర్లను కలిగి ఉంది. మరీ ముఖ్యంగా మైలేజ్ పరంగా అగ్రస్థానంలో ఉంది. ఈ కారు లీటర్ డీజిల్ తో ఏకంగా 24.5 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ సంఖ్య మాన్యువల్ వేరియంట్‌కు ఎక్కువ. ఆటోమేటిక్ వేరియంట్‌కు తక్కువ. అల్కాజార్ అధిక మైలేజ్‌తో కూడా మంచి పని తీరును కనబరుస్తుంది. ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. కేవలం 11 సెకన్లలో ఈ కారు 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ AT ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది.  6 ఎయిర్ బ్యాగులను కలిగి ఉంటుంది.

⦿ హ్యుందాయ్ వెన్యూ డీజిల్

Advertisement

హ్యుందాయ్ కి చెందిన అత్యుత్తమ మైలేజ్ కార్లలో ఒకటైన వెన్యూ.. గత 5 సంవత్సరాలుగా భారతీయ మార్కెట్ లో సత్తా చాటుతోంది. కాంపాక్ట్ SUV విభాగంగా ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇది మంచి లుక్ ను కలిగి ఉంటుంది. ట్రిమ్‌లలో పలు వేరియంట్స్ ను కలిగి ఉంటుంది. శక్తివంతమైన పవర్‌ ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఈ కారు క్యాబిన్‌ లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందింది. వెన్యూ 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అద్భుతమైన పని తీరును కనబరుస్తుంది. లీటర్ కు ఏకంగా 24.10 కిలో మీటర్ల మైలేజీ అందిస్తుంది. ఈ ఇంజిన్ 12 సెకన్లలోపు 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది 6 ఎయిర్ బ్యాగులను కలిగి ఉంటుంది.  5 సీట్ల సామర్థ్యంతో ఉంది.

⦿ టాటా నెక్సాన్ డీజిల్

మరొక కాంపాక్ట్ SUV టాటా నెక్సాన్ డీజిల్ మార్కెట్ లో  వెన్యూకి గట్టి పోటీని ఇస్తుంది. రీసెంట్ గా ఈ కారు ఓ కీలక అప్‌గ్రేడ్‌ను పొందింది.  దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో ఈ కారు టాప్ లో నిలిచింది.  చక్కటి డిజైన్, ఫీచర్ అప్‌ గ్రేడ్ నెక్సాన్‌ కు ప్లస్ పాయింట్ గా మారింది. ఈ కారు ఏకంగా లీటర్ డీజిల్ కు 24.08 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. 1.5 లీటర్ ఇంజిన్ ఈ విభాగంలో అత్యంత వేగవంతమైనది.  ఈ కారు 6 స్పీడ్ MT,  6 స్పీడ్ AT ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగులతో వసతుంది. సీటింగ్ సామర్థ్యం 5. మొత్తంగా ఈ మూడు కార్లు డీజిల్ వెర్షన్ లో మంచి మైలేజీని అందిస్తున్నాయి.

Advertisement

Read Also: గంటకు 500 కిలో మీటర్లు.. రికార్డులు బద్దలు కొట్టిన ఎలక్ట్రిక్ కారు!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×