E-Paper
Advertisement

ప్రియుడిని పెళ్లి చేసుకున్న శోభాశెట్టి.. ఇలా మోసం చేయొద్దంటూ నెటిజన్స్ ట్రోలింగ్!

ప్రియుడిని పెళ్లి చేసుకున్న శోభాశెట్టి.. ఇలా మోసం చేయొద్దంటూ నెటిజన్స్ ట్రోలింగ్!
Advertisement

Shobha Shetty: బుల్లితెర సీరియల్ నటి శోభా శెట్టి (Shobha Shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఎక్కువగా విలన్ పాత్రలు పోషిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. పేరుకే కన్నడ నటి.. కానీ తెలుగు ఆడియన్స్ కి ఫేవరెట్ సెలబ్రిటీ అనే చెప్పాలి. అగ్నిసాక్షి సీరియల్ తో తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. కార్తీకదీపం సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కు మరింత దగ్గర అయింది. ఇందులో మోనిత పాత్రలో విలనిజంతో ఊహించని క్రెడిట్ సొంతం చేసుకుంది. ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మరింత గుర్తింపు దక్కించుకుంది శోభా శెట్టి . అంతేకాదు కన్నడ బిగ్ బాస్ 11లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేక బయటకు వచ్చేసింది.

ప్రియుడుతో పెళ్లి పీటలెక్కిన శోభాశెట్టి..

అలా బిగ్ బాస్ తెలుగు, కన్నడ షోలలో సందడి చేసిన ఈమె.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీవీ షోలు, ప్రోగ్రాములు చేస్తూ బిజీగా మారింది. అంతేకాదు డిజైనర్ స్టూడియోని కూడా స్థాపించి వ్యాపారంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కార్తీకదీపం సీరియల్ లో సహనటుడు అయిన యశ్వంత్ రెడ్డితో ఈ ప్రేమలో ఉన్నట్లు బిగ్ బాస్ వేదికగా ప్రకటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. 2024 ఏప్రిల్ లో వీరి నిశ్చితార్థం జరగగా.. 2025లో ఎంగేజ్మెంట్ యానివర్సరీ ని కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకపోతే ఈ ఏడాదికి వీరి నిశ్చితార్థం జరిగి మూడు సంవత్సరాలు. కనీసం ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఆశగా ఎదురు చూడగా.. సడన్గా పెళ్లి పీటలెక్కి అందరిని ఆశ్చర్యపరిచింది శోభా శెట్టి. ఎట్టకేలకు తన ప్రియుడు యశ్వంత్ రెడ్డితో పెళ్లి చేసుకుని అందరిని సర్ప్రైజ్ చేసింది.

Advertisement

ALSO READ:మిస్టికల్ థ్రిల్లర్ గా పోచమ్మ.. స్ట్రీమింగ్ డేట్ లాక్!

మండిపడుతున్న నెటిజన్లు..

ఇక దీంతో అభిమానులు సంతోషపడే లోపే .. ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు కారణం తెలిసి అందరూ మండిపడుతున్నారు. నెటిజన్ లు అయితే ఈమెపై ఏకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం కోసం పెళ్లిని నాటకంలా చేయొద్దు అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక జువెలరీ యాడ్ కోసం శోభా శెట్టి తన ప్రియుడు యశ్వంత్ రెడ్డితో పెళ్లి పీటలెక్కినట్లు యాడ్ షూట్ చేయడం జరిగింది .ఈ యాడ్ ను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇకపోతే ఇది చూడడానికి బాగానే ఉన్నా.. ఆదాయం కోసం నిజమైన పెళ్లిని ఇలా నాటకీయంగా మార్చడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి చేయడం మానుకొని త్వరగా పెళ్లి పీటలెక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా శోభా శెట్టి పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అటు వైరల్ గా మారడమే కాకుండా ఇటు భారీ ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటుంది.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×