Trump: ఇరాన్ యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? సిచ్యువేషన్ చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది..అప్పుడే యుద్ధం అక్కర్లేదంటారు.. అప్పుడే రెండు మూడు వారాల్లో ముగిస్తానంటారు.. ఇరాన్ పని అయిపోయిందంటారు.. అప్పుడే అమెరికాను అంతం చేసే పంతంతో ఇరాన్ ఉందంటారు.. ఈ లెక్కలేంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
తాజాగా ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ స్పీచ్ పై ప్రపంచం చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసింది. ఏం చెప్తారా అని చూశారు. యుద్ధం ముగింపుపై క్లారిటీ ఇస్తారనుకున్నారు. ట్రంప్ ఎంతో మాట్లాడారు. కానీ కొత్తగా ఏమీ చెప్పలేదు. సీన్ కట్ చేస్తే ట్రంప్ ఏం చెప్పారో ఓసారి చూడండి.. రైట్ చూశారుగా ట్రంప్ వార్నింగ్. రాబోయే రెండు, మూడు వారాల్లో ఇరాన్ పై భీకర దాడులు చేస్తామన్నారు. ఇరాన్ కీలక నాయకత్వం అంతమైందని, ఆ దేశ నేవీ, ఎయిర్‌ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయాయన్నారు. ఇరాన్ తమతో డీల్ కు రావాలని.. లేకపోతే ఆ దేశాన్ని రాతియుగానికి తీసుకెళ్తామని ఘాటుగా హెచ్చరించారు. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందన్నారు.
ఇరాన్‌పై తాము అనుకున్న అన్ని టార్గెట్స్ ను పూర్తి చేసే దిశగా ముందుకుసాగుతున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయిందని, వారి సైనిక సామర్థ్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. ఇరాన్ లోని కీలక లీడర్ షిప్ ను అంతం చేశామన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు వీల్లేదన్నారు. ఇరాన్ చమురును లక్ష్యంగా చేసుకొని ఇప్పటివరకు తాము దాడి చేయలేదని, కానీ అవసరమైతే తాము వాటిని కూడా టార్గెట్ చేస్తామన్నారు. అమెరికా సేఫ్టీ కోసమే ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించామని చెప్పుకొచ్చారు.
ట్రంప్ ప్రసంగంలో ఓ కొత్త మాట మాత్రం చెప్పారు. ఇరాన్ ను రాతియుగం దాకా తీసుకెళ్లి వదిలేస్తామన్నారు. అంటే అణ్వాయుధ దాడి చేస్తారా అన్న డౌట్లు కూడా కొందరిలో పెరుగుతున్నాయ్. ఇరాన్ ఆర్థిక మూలాలను, మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయడం కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఇరాన్ ను హార్డ్ హిట్ చేస్తామని చెప్పడం ద్వారా విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఆ దేశాన్ని కొన్ని దశాబ్దాల వెనక్కి నెడుతామని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.
ఒకసారి ఇరాన్ పని అయిపోయింది ముగించేస్తాం అని చెప్పడం, ఇంకోవైపు ఇరాన్ పై దాడులు కొనసాగుతాయని చెప్పడం ఇలా మిక్స్ డ్ సిగ్నల్స్ తో ట్రంప్ గందరగోళానికి గురవుతున్నారు. అందరినీ అదే కండీషన్ లో ఉంచుతున్నారన్న డౌట్లు పెరుగుతున్నాయ్. ఎందుకంటే అనిశ్చితిని మార్కెట్లు కోరుకోవు. అందుకే ఒక రోజు భారీ లాభాలు.. మరో రోజు భారీ నష్టాలతో ముగింపు.. ఇదే సీన్ రోజూ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి ఇదే. వస్తే పది లక్షల కోట్లు.. పోతే పది లక్షల కోట్లు అన్నట్లుగా సీన్ ఉంది. సో తాజా స్పీచ్ లో మార్కెట్లకూ ఓ మంచి కబురు చెప్పలేకపోయారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గేలా కన్పించకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 106 డాలర్లు దాటింది.
ఇరాన్ లోని 400 కేజీల యురేనియం తీసుకొస్తామంటారు. అప్పుడే ఇరానియన్ చమురు కథ తేలుస్తామంటారు. అప్పుడే తమ దగ్గరే దండిగా చమురు ఉందంటారు. అమెరికాలో పెరిగే ఫ్యూయెల్ రేట్లను లైట్ తీసుకుంటారు. గల్ఫ్ దేశాలను కాపాడుతామంటారు. సీన్ కట్ చేస్తే ఇరాన్ దాడులు ఆగడం లేదు. అమెరికా అడ్డుకోవడం అంతకంటే లేదు. అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ధ్వంసమయ్యాయి. 15కు పైగా అమెరికన్ విమానాలు కూడా నేలకూలాయి. ఇక గల్ఫ్ దేశాలు కూడా ప్రతిదాడులు చేయట్లేదు. సిచ్యువేషన్ చూస్తున్నాయంతే. అన్ని దేశాలు కలిస్తే యుద్ధం పెద్దదవుతుంది. పైగా యుద్ధంలో పాల్గొనే దేశాల్లో సప్లై చైన్ దెబ్బతింటుంది. ధరలు పెరుగుతాయ్. అంతా అస్తవ్యస్తం. పరిస్థితి బాగవడానికి చాలా టైం పడుతుంది. అందుకే అటు నాటో దేశాలు, ఇటు గల్ఫ్ దేశాలు దూరం పాటిస్తున్నాయి. ట్రంప్ ఎంత గేమ్ నడిపించినా అవేవీ ముందుకు రావట్లేదు. పైగా తమ సైనిక బేస్ లను వాడుకునేందుకు ఇతర దేశాలేవీ అమెరికాకు ఛాన్స్ ఇవ్వడం లేదు. శ్రీలంక దగ్గర్నుంచి ఇటలీ దాకా ఇదే సీన్. అమెరికాకు నో యాక్సెస్ అంటున్నాయి. బేస్ లు వాడుకునేందుకు అవకాశం ఇస్తే కథ మొత్తం మారిపోతోందనుకుంటున్నాయి. అందుకే ట్రంప్ వలలో పడేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపట్లేదు.
ఇప్పుడు కీలక జలసంధి అయిన హర్ముజ్ గురుంచి ట్రంప్ ఏమన్నారో చూద్దాం. నిజానికి ఈ హర్ముజ్.. ఇంధనం, ఇతర కీలక సరుకుల రవాణాకు చాలా కీలకం. యుద్ధ ప్రభావంతో ఇక్కడ నౌకలు ఆగిపోయాయి. దీన్ని ఇరాన్ కంట్రోల్ లోకి తీసుకుంది. అమెరికా సహా ఆ మిత్ర దేశాల నౌకలు వెళ్లేందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు. పైగా ఇప్పుడు టోల్ ట్యాక్స్ కూడా పెడుతామంటోంది. హర్ముజ్ దగ్గర చమురు నౌకలు బ్లాక్ అవడంతో చాలా దేశాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ హర్ముజ్ పైనా రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు ట్రంప్. ఆ జలసంధి నుంచి వచ్చే చమురుపై యూఎస్ ఆధారపడటం లేదని.. భవిష్యత్ లో కూడా దాని అవసరం తమకు ఉండదన్నారు. దీనిపై ఆధారపడ్డ దేశాలే.. ధైర్యంతో హర్ముజ్ ను డీల్ చేసుకోవాలన్నారు. అంతకు ముందేమో.. ఇరాన్ వినకపోతే బాంబులు వేస్తామన్నారు. మొత్తం తమ కంట్రోల్ లోకి తీసుకుంటామన్నారు. హర్ముజ్‌లో నౌకల రవాణా స్వేచ్ఛగా ఉన్నప్పుడే కాల్పుల విరమణ సాధ్యమవుతుందని ఒక దశలో ట్రూత్ సోషల్ లో రాసుకొచ్చారు. ఇలా పూటకో మాట. ఇదే ట్రంప్ ఆట.
ఓవైపు ఇరాన్ తో అమెరికా ఈ స్థాయిలో యుద్ధం చేస్తుంటే.. మిత్ర దేశాలు ఒక్కటంటే ఒక్కటి కూడా సపోర్ట్ గా మాట్లాడలేదు. మీ వెనుక మేమున్నాం అని చెప్పలేదు. అంటే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా ఊ కొట్టే దేశాలు ఏవీ లేవు. యుద్ధం ఊబిలోకి దిగేందుకు రెడీగా లేవు. అయితే ఇరాన్‌తో యుద్ధంలో తమకు మిత్రదేశాల నుంచి సపోర్ట్ దక్కకపోవడంపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. నాటోను కాగితపు పులిగా చెప్పుకొచ్చారు. ఒక దశలో నాటో నుంచి తాము తప్పుకునే దిశగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కూడా ట్రంప్ అన్నారు. బ్రిటన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ కెపాసిటీని టీజ్ చేస్తూ వస్తున్నారు ట్రంప్.
వీటికి బ్రిటన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం తమది కాదని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కౌంటర్ ఇచ్చారు. అందులో తాము పాల్గొనబోమని క్లారిటీ ఇచ్చారు. తమకు బ్రిటన్ ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ మొఖం మీదే చెప్పేశారు. హర్ముజ్ జలసంధిని తెరిచే మార్గాలపై చర్చించేందుకు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తామన్నారు. హర్ముజ్‌లో భద్రతను బలోపేతం చేయడంతో పాటు నిత్యావసర వస్తువుల రవాణాను పునరుద్ధరించే విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు 35 దేశాలు ముందుకొచ్చాయని చెప్పారు.
లేటెస్ట్ గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై అమెరికా సెనెట్‌లో విపక్ష డెమొక్రాట్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ ఫాలో అవుతున్న విధానాలు చారిత్రక తప్పిదాలంటూ కౌంటర్ ఇస్తున్నారు. సెనెట్ లీడర్ షూమర్ ట్రంప్ ప్రసంగాన్ని అసందర్భం, బలహీనం, దయనీయం అని కొట్టిపారేశారు. ఇరాన్ యుద్ధంలో స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం, మిత్రదేశాలను దూరం చేసుకోవడం వంటి చర్యలు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద పాలసీ బ్లండర్స్ లో ఒకటిగా నిలిచిపోతాయని హెచ్చరిస్తున్న పరిస్థితి.
ఇరాన్‌ను రాతియుగం వైపు తీసుకెళ్తాం అని ట్రంప్ చేసిన హెచ్చరికపై డెమొక్రాట్లు ఫైర్ అయ్యారు. ట్రంప్ స్పీచ్ విన్న తర్వాత ఎవరికైనా యుద్ధం ముగుస్తుందా లేదా మరింత ముదురుతుందా అనే దానిపై కనీస అవగాహన లేకుండా పోయిందంటున్నారు. ట్రంప్ మాటలు ఆయన ఊహా ప్రపంచానికి సంబంధించినవని, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని కౌంటర్ ఇస్తున్నారు. యుద్ధం కారణంగా అమెరికాలో గ్యాస్, డీజిల్, ఎరువులు, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, ట్రంప్ వాటిని పరిష్కరించే మార్గాలను పక్కన పెట్టి కేవలం యుద్ధంపైనే దృష్టి పెట్టడం ఏంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు. అమెరికాలో చమురు రేట్లు తాత్కాలికమే అని ట్రంప్ కొట్టి పారేస్తున్నా.. చాలా మంది సఫర్ అవుతున్నారు. అమెరికా ప్రజలు అడుగుతున్న ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని డెమొక్రాట్లు మండిపడుతున్నారు.
నాటో మిత్రదేశాలను విమర్శించడం, హర్ముజ్ జలసంధి బాధ్యతలను వారిపైనే తోసేయడం వంటివి అమెరికా దౌత్య సంబంధాలను దెబ్బతీసే బ్లండర్స్ అని విపక్షం భావిస్తోంది. ఇంత పెద్ద యుద్ధం చేస్తూ.. చమురు రవాణా మార్గాలను పునరుద్ధరించలేకపోవడం ట్రంప్ వైఫల్యం కాకపోతే మరేంటని క్వశ్చన్ చేస్తున్న వారూ ఉన్నారు. అంటే ఇరాన్ దారిలోకి రానట్లే కదా అని ప్రశ్నిస్తున్నారు. విపక్షాలే కాకుండా, రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు కూడా ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానాన్ని వదిలేసి యుద్ధానికే ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేయడం కీలకంగా మారుతోంది. ట్రంప్ ప్రసంగం వల్ల మార్కెట్లలో అనిశ్చితి పెరగడం విపక్షాల విమర్శలకు మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. అమెరికా ఫస్ట్ అంటే ట్రంప్ ఏ పని చేసినా అమెరికన్లకు మేలు జరగాలి. ఇదీ కాన్సెప్ట్. కానీ మేలు సంగతి దేవుడెరుగు. రోజురోజుకూ గ్యాసోలీన్ రేట్లు పెరుగుతున్నాయి. సమస్యలు పెరుగుతున్నాయి. అమెరికన్లకు ఖర్చుల భారం పెరుగుతోంది. అంతా అసంతృప్తే ఉంది.
Also Read:అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరి.. ధర్మాన వ్యాఖ్యలతో బయటపడ్డ అసలు రంగు!
Story by: Anup, Big Tv