E-Paper
Advertisement

మిస్టికల్ థ్రిల్లర్ గా పోచమ్మ.. స్ట్రీమింగ్ డేట్ లాక్!

మిస్టికల్ థ్రిల్లర్ గా పోచమ్మ.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
Advertisement

Pochamma OTT:కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఆదరణ భారీగా పెరిగిపోయింది. అటు ఓటీటీలు కూడా ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టుగా భిన్నమైన జానర్లలో సినిమాలను తీసుకొస్తూ మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలు ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధిస్తూ రికార్డు కూడా సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని చిత్రాలు థియేటర్లలో విడుదలై ఆ తర్వాత ఓటీటీలోకి వస్తే.. మరికొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ మాత్రం ఒరిజినల్ సిరీస్ లను నిర్మిస్తూ ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో ఒరిజినల్ సిరీస్ తో మన ముందుకు రాబోతోంది.

పోచమ్మ సిరీస్ డేట్ లాక్..

గ్రామ దేవత పోచమ్మ టైటిల్ తో సరికొత్త మిస్టికల్ థ్రిల్లర్ ఆహా ఒరిజినల్ ద్వారా స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యింది . ఈ మేరకు తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేయగా.. ఇది అధ్యంతం ఆకట్టుకుంటుంది.. తాజాగా ఈ పోచమ్మ సీరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను ఆహా మేకర్స్ విడుదల చేస్తూ “రహస్యాలతో నిండిన భవనం.. న్యాయం కోరుతున్న దేవత.. ఒక్కసారి శాపం తగలడం మొదలైతే ఇక తప్పించుకునే మార్గమే లేదు” అంటూ క్యాప్షన్ జోడించింది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ మిస్టికల్ థ్రిల్లర్ పోచమ్మ సిరీస్ ట్రైలర్ అభిమానులలో క్యూరియాసిటీని పెంచేస్తోంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఏప్రిల్ 17వ తేదీన సమ్మర్ స్పెషల్ గా తెలుగు, తమిళంలో ఈ వెబ్ సిరీస్ ని విడుదల చేయనున్నారు. ఇక తాజాగా ఆహా మేకర్స్ విడుదల చేసిన ఈ వీడియో అటు వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా పెంచేసింది. మరి స్ట్రీమింగ్ కి వచ్చిన తర్వాత ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

ALSO READ:ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్.. వరలక్ష్మి ‘సరస్వతి’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆకట్టుకున్న పోచమ్మ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి టైటిల్ గ్లింప్స్ గతంలోనే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. పాతతరంలో ఉన్నట్లు ఒక భవనం వెనుక ఉన్న ఒక చిన్న పోచమ్మ ఆలయాన్ని చూపించారు. మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మ్యూజిక్ బీజీఎమ్ క్యూరియాసిటీని పెంచేసింది. ఇక అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రహస్యాలు ఎప్పటికీ దాగి ఉండవు. వాటిని ఎవరు చూడాలో అవే ఎంచుకుంటాయి అంటూ కూడా రాసుకొచ్చారు. దీంతో గ్రామంలో పోచమ్మ వారి ఆలయం చుట్టు దాగి ఉన్న రహస్యం, ముఖ్యంగా ఆ ఊరిలోని మిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచినట్లు అర్థమవుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ టచ్ తో రాబోతున్న ఈ మిస్టికల్ థ్రిల్లర్ ఆహా ఒరిజినల్స్ లో ఎలాంటి రేటింగ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇకపోతే ఇందులో అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శృతి నాయుడు చిత్ర బ్యానర్ పై శృతి నాయుడు ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.. రమేష్ ఇంద్ర ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×