Bigg Boss Host Remuneration::బిగ్ బాస్ షో బుల్లితెర ఆడియన్స్ ని ఎంతలా ఎంటర్ టైన్ చేస్తుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇక వీరిలో కంటెస్టెంట్ లు ఎంత ముఖ్యమో వారానికి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చి వారిని ఆర్డర్ లో పెడుతూ,అవసరమైతే క్లాస్ పీకుతూ ఎంగేజ్ చేసే హోస్ట్ కూడా అంతే ముఖ్యం.
అయితే వారానికి రెండు సార్లు మాత్రమే బిగ్ బాస్ లోకి వచ్చినప్పటికీ వీరికిచ్చే పారితోషికం మాత్రం భారీగా ఉంటుందన్న టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మరి తమదైన హోస్టింగ్ తో షోని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళే ఈ హోస్ట్ ల పారితోషికాలు ఎంతెంత ఉన్నాయో, వీరిలో ఎవరికి ఎక్కువ పారితోషికం దక్కుతుందో ఒకసారి చూసేద్దాం.
బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్న వారిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హోస్ట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది.అవును హిందీ బిగ్ బాస్ సీజన్ లో సల్లూ భాయ్ ఒక వీకెండ్ ఎపిసోడ్ కి హోస్టింగ్ చేసినందుకు గాను ఏకంగా దాదాపు 17 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక మొత్తం బిగ్ బాస్ సీజన్ కి హోస్టింగ్ చేసినందుకు గాను సల్మాన్ ఖాన్ కి దాదాపు 130 కోట్ల వరకు ముడుతుందన్న టాక్ వినిపిస్తుంది.
ఇక సల్లూ భాయ్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హోస్ట్ గా తమిళ బిగ్‌బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి పేరు వినిపిస్తుంది.అవును ..మక్కల్ సెల్వన్ గా పేరు తమిళ ఆడియన్స్ లో మంచి క్రేజ్ కొట్టేసిన విజయ్ సేతుపతికి బిగ్‌బాస్ హోస్టింగ్ కోసం దాదాపు రూ.80 కోట్ల నుంచి రూ.95 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఇక తెలుగు బిగ్‌బాస్ విషయానికి వస్తే కింగ్ అక్కినేని నాగార్జున సీజన్‌కు సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.45 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ఇక మలయాళ బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తున్న సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కి సీజన్‌కు దాదాపు రూ.35 కోట్ల వరకు పారితోషికం ముడుతున్నట్టు సమాచారం.కన్నడ బిగ్‌బాస్ విషయానికి వస్తే గత కొన్ని సీజన్ లు గా హోస్టింగ్ చేస్తున్న కిచ్చా సుదీప్ కి సీజన్ మొత్తానికి దాదాపు 20 కోట్ల వరకు ఇస్తున్నారని వినిపిస్తుంది.
ఇక సినిమా తారల్ని కాకుండా ఈసారి బెంగాలీ బిగ్ బాస్ కి సరికొత్తగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హోస్టింగ్ చేస్తుండటం విశేషం. దాదాకి ఇలా ఒక్క సీజన్ కి కాకుండా నాలుగేళ్ల కాలానికి దాదాపు రూ.130 కోట్ల వరకు ముడుతుందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ .
ALSO READ:బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!
అయితే హోస్ట్ లు కేవలం వారానికి రెండు సార్లు వచ్చి పోవడం మాత్రమే కాకుండా షోకి ముందు ప్రిపరేషన్, అలాగే ప్రమోషన్స్ వంటివాటన్నింటిలో కూడా పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టే అంతంత పారితోషికాలని ముట్టజెబుతుంటారట మేకర్స్.ఇక బిగ్ బాస్ షో కి ఉన్న పాపులారిటీ కారణంగా trp రైట్స్ అలాగే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా భారీగానే పలుకుతుంటాయి. అందుకే ఎక్కడా తగ్గకుండా స్టార్స్ కి కోట్లలో ఇస్తుంటారు నిర్వాహకులు.