E-Paper
Advertisement

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
Advertisement

Psychological Sci-Fi Thriller:  జైలంటే చుట్టూ ఎత్తైన గోడలు, ఇనుప ఊచలు, కఠినమైన నిబంధనలు గుర్తొస్తాయి. కానీ ఖైదీలకు ఎలాంటి గోడలు లేకుండా విలాసవంతమైన జీవితం అందించే ఓ జైలు ఉంటే ? అక్కడ స్వేచ్ఛగా తిరగొచ్చు, నచ్చిన ఆహారం తినొచ్చు. కానీ అందుకు బదులుగా మన భావోద్వేగాలనే ప్రయోగాలకు అప్పగించాల్సి వస్తే ? ప్రేమ, భయం, నవ్వు, మాటలు… అన్నింటినీ ఓ వ్యక్తి రిమోట్‌ తో కంట్రోల్ చేయగలిగితే ? చివరికి ఆ ప్రయోగాల అసలు లక్ష్యం ఏంటో తెలిసిన ఓ ఖైదీ తిరుగుబాటు చేస్తే ? ఇదే కాన్సెప్ట్‌ తో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ Spiderhead. మరి ఈ థ్రిల్లర్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

భవిష్యత్తులో సముద్రం మధ్యలో ఉన్నట్టుగా కనిపించే ఓ ఆధునిక రీహాబిలిటేషన్ సెంటర్‌ లో ఖైదీలను ఉంచుతారు. అదే స్పైడర్ హెడ్. సాధారణ జైళ్లలో ఉండే కఠినమైన వాతావరణం ఇక్కడ ఉండదు. ఖైదీలు స్వేచ్ఛగా తిరుగుతూ, మంచి సౌకర్యాలతో జీవిస్తుంటారు. అయితే ఆ స్వేచ్ఛ వెనుక ఓ ప్రమాదకరమైన షరతు ఉంటుంది. తమ శరీరాల్లో అమర్చిన ప్రత్యేక పరికరాల ద్వారా కొత్త డ్రగ్స్‌ ను ప్రయోగించేందుకు వారు అంగీకరించాలి.

Advertisement

ఈ ఫెసిలిటీని తెలివైన సైంటిస్ట్ స్టీవ్ అబ్నెస్టి నడుపుతుంటాడు. అతను వివిధ రకాల డ్రగ్స్ ద్వారా ఖైదీల భావోద్వేగాలను మార్చే ప్రయోగాలు చేస్తుంటాడు. ఓ డ్రగ్ ప్రేమను పెంచుతుంది, మరొకటి విపరీతంగా మాట్లాడేలా చేస్తుంది, ఇంకొకటి నవ్విస్తుంది. మరో డ్రగ్ మాత్రం భయాన్ని అత్యంత తీవ్ర స్థాయికి తీసుకెళ్తుంది. ఇవన్నీ స్టీవ్ కంట్రోల్‌ లోనే జరుగుతుంటాయి.

అక్కడ ఉన్న ఖైదీల్లో జెఫ్ తన గతం తాలూకు అపరాధ భావనతో బాధ పడుతుంటాడు. గతంలో జరిగిన కారు ప్రమాదంలో తన స్నేహితుడు, ప్రియురాలు చనిపోవడానికి తానే కారణమని అతను భావిస్తుంటాడు. అదే సమయంలో లిజ్జీ అనే మరో ఖైదీతో జెఫ్‌ కు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. కానీ ఆ ప్రేమ కూడా సహజమైనదేనా ? లేక డ్రగ్స్ ప్రభావమా ? అనే అనుమానం అతడిలో మొదలవుతుంది.

Advertisement

క్రమంగా స్టీవ్ చేస్తున్న ప్రయోగాల అసలు ఉద్దేశం జెఫ్‌ కు అర్థమవుతుంది. మనుషుల స్వేచ్ఛా సంకల్పాన్ని పూర్తిగా నియంత్రించి, వారు చెప్పిన మాటకు గుడ్డిగా లొంగిపోయేలా చేసే ప్రమాదకరమైన డ్రగ్‌ పై స్టీవ్ ప్రయోగాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. చివరకు లిజ్జీపై తీవ్రమైన ప్రయోగం చేయమని స్టీవ్ ఆదేశించడంతో జెఫ్ తిరుగుబాటు చేస్తాడు. కంట్రోల్ రూమ్‌ ను తన ఆధీనంలోకి తీసుకుని స్టీవ్‌ పైనే అతని డ్రగ్స్ ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత జెఫ్, లిజ్జీ ఆ నరకం నుంచి బయటపడతారా ? స్టీవ్ పరిస్థితి ఏంటి ? అనేదే క్లైమాక్స్.

తెలుగులో ఉందా ?

2022లో వచ్చిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘స్పైడర్ హెడ్’. Joseph Kosinski దర్శకత్వం వహించిన ఈ సినిమాలో Chris Hemsworth, Miles Teller, Jurnee Smollett ప్రధాన పాత్రల్లో నటించారు. George Saunders రాసిన Escape from Spiderhead అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా Netflixలో ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ ఆడియోలతో అందుబాటులో ఉంది. సైన్స్ ఫిక్షన్, మైండ్ గేమ్స్, డార్క్ కాన్సెప్ట్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ఈ మూవీని పొరపాటున కూడా మిస్ అవ్వొద్దు.

Read Also: అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

Tags

Related News

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

Big Stories

Advertisement
×