Bigg Boss Telugu 10 Remuneration:తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ షో ఎట్టకేలకి మొదలైపోయింది.ఎప్పటిలాగే నాగ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలోకి మొత్తం 16 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.ఇక ఈ కంటెస్టెంట్ లలో సెలెబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా ఉండటం విశేషం.
అయితే ఈసారి పాల్గొనే ఈ కంటెస్టెంట్ లలో వారానికి ఎవరు ఎంత పారితోషికం తీసుకుంటున్నారా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు బిగ్ బాస్ లవర్స్ .మరి వీరిలో వారానికి ఎవరు ఎంత తీసుకుంటున్నారో ఒకసారి చూసేద్దాం.
ముందుగా బిగ్ బాస్ లో హయ్యెస్ట్ పారితోషికం తీసుకుంటున్న వారి విషయానికి వస్తే ఈ సీజన్ లో జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్ కి అత్యధికంగా వారానికి దాదాపు 5 లక్షల దాకా పారితోషికం తీసుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తుంది.ఆటో రామ్ ప్రసాద్ కి జబర్దస్త్ లో ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు.తనదైన పంచులతో జబర్దస్త్ ని ఫుల్ ఎంటర్ టైనింగ్ గా మార్చిన రామ్ ప్రసాద్ బిగ్ బాస్ షోతో ఆడియన్స్ ని ఇంకెంత ఎంటర్ టైన్ చేస్తాడో చూడాలి.
ఇక రామ్ ప్రసాద్ ప్రసాద్ తర్వాత ఈ సీజన్ లో వారానికి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా యాంకర్ వర్షిణి పేరు వినిపిస్తుంది.ఈమెకి వారానికి ఎవరూ ఊహించని విధంగా దాదాపు 4 లక్షల దాకా ముట్టజెబుతున్నట్టు సమాచారం.ముఖ్యంగా ఈ స్థాయి పారితోషికం అందించడానికి వర్షిణికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే కారణం అని తెలుస్తుంది.మరి ఇంస్టాగ్రామ్ లో సాలిడ్ ఫాలోవర్స్ ఉన్న ఆ భామ సీజన్ లో ఎలాంటి ఫెర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి.
ఇక వీళ్ళ తర్వాత ఉన్న వారిలో ముఖేష్ గౌడకు వారానికి దాదాపు 3.50లక్షల వరకు అందుతున్నట్టు తెలుస్తుంది. బుల్లితెరపై తనదైన సీరియల్స్ తో సాలిడ్ ఫ్యాన్స్ బేస్ ని సొంతం చేసుకున్న ముఖేష్ క్రేజ్ ఈ బిగ్ బాస్ సీజన్ లో ఎంతవరకు పనికివస్తుందో చూడాలి.
ఇక కథ, లైన్ మెన్, 24 కిస్సెస్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న త్రిగుణ్ అలియాస్ ఆదిత్ అరుణ్ కి ఈ సీజన్ లో వారానికి గాను దాదాపు 3 లక్షల రూపాయల వరకు అందుతున్నట్టు వినిపిస్తుంది.ఇక ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ సీరియల్స్ తో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన దేబ్జానీ మోదక్ కి వారానికి సుమారు రూ.2.80 లక్షల వరకు ముడుతున్నట్టు నెట్టింట వినిపిస్తుంది. చూడాలి ఈ కలకత్తా కుర్రది సీజన్ లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో !
ఇక ఈ లిస్టు లో తర్వాతి స్థానం కొట్టేశాడు జబర్దస్త్ నరేష్. ఇతడికి వారానికి దాదాపు రూ.2.60 లక్షల వరకు ముడుతుందట.ఇక చైత్ర రాయ్‌కు కూడా దాదాపు జబర్దస్త్ నరేష్ లాగే రూ.2.60 లక్షల వరకు వారానికి అందుతుందని టాక్ వినిపిస్తుంది.
ఇక వినాయకుడు కృష్ణుడు ,టెంపర్ వంశీలు వారానికి రూ.2.10 వరకి తీసుకుంటున్నారని, యాంకర్ సుధీర్ రెడ్డికి సుమారు రూ.1.50వరకు ఇస్తున్నారని వినిపిస్తుంది. ఇక కామనర్స్ కి గత సీజన్ లో ఇచ్చినట్టే ఈ సీజన్ లో కూడా వారానికి దాదాపు వారానికి రూ.80 వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం .ఇక వీరికే కాకుండా అగ్నిపరీక్షలో పాల్గొన్న వారిలో 15 మందికి దాదాపు 60 వేల వరకు ముట్టజెప్పినట్టు తెలుస్తుంది.
అయితే ఈ పారితోషికాలు వారి వారి క్రేజ్ ని ఫేమ్ ని బట్టి డిసైడ్ చేసినట్టు సమాచారం. చూడాలి వీరిలో ముందు ముందు ఎవరు దూసుకెళ్ళి టైటిల్ కొట్టేస్తారో !