E-Paper
Advertisement

R.J.Suriya wedding: పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్ జె సూర్య.. ఫోటోలు వైరల్!

R.J.Suriya wedding: పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్ జె సూర్య.. ఫోటోలు వైరల్!
Advertisement

R.J.Suriya wedding: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్ల హడావిడి కొనసాగుతుంది . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది హీరో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే బుల్లితెర నటీనటులు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహం పూర్తి అయ్యింది. తాజాగా అల్లు శిరీష్ నైనిక రెడ్డిల వివాహం కూడా ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అల్లు శిరీష్ నైనికల వివాహం మార్చి ఆరో తేదీ అతిథులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రియురాలు శౌర్యతో పెళ్లి పీటలెక్కిన సూర్య..

ఇకపోతే మార్చ్ ఆరో తేదీ బిగ్ బాస్ కంటెస్టెంట్, ఆర్. జే  సూర్య (R.J.Suriya)వివాహం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ పెళ్లి ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా పలువురు బుల్లితెర నటీనటులు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన నేహా చౌదరి బాలాదిత్య వంటి తదితరులు పాల్గొన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆర్జె సూర్య పెళ్లి చేసుకుంది మరెవరినో కాదు తన స్నేహితురాలు ఆర్జే సౌర్య(R.J. Sourya)నే అనే సంగతి అందరికీ తెలిసిందే.

మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు..

Advertisement

గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ జంట కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక మార్చి 6 వ వీరిద్దరూ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ఇక ఆర్జె శౌర్య ప్రముఖ బుల్లితెర నటి సుధీర చెల్లి అనే సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉంటూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఆర్ జె సూర్య విషయానికి వస్తే ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన అబ్బాయి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు అయితే ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు పొందారు. ప్రముఖ హీరోల గొంతును మిమిక్రీ చేస్తూ మంచి గుర్తింపు పొందారు. అనంతరం ఆర్జేగా అవకాశం రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

బీబీ జోడి విజేతలుగా…

Advertisement

ఇలా ఆర్జేగా కొనసాగుతున్న సూర్య బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం అందుకొని 8 వారాలపాటు హౌస్ లో కొనసాగారు. ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్య అనంతరం బీబీ జోడి కార్యక్రమంలో జబర్దస్త్ ఫైమాతో కలిసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఆర్జేగా కొనసాగుతూనే ఆర్ జె శౌర్యతో ప్రేమలో పడిన ఈయన గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

Also Read: Varalakshmi sarath kumar: సాయి మాధవ్ కు వరలక్ష్మి కౌంటర్.. రే** చేశారనడం సరికాదంటూ!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×