E-Paper
Advertisement

GHMC: ట్రాఫిక్ సిగ్నల్స్, బస్టాపులపై బల్దియా కీలక నిర్ణయం

GHMC: ట్రాఫిక్ సిగ్నల్స్, బస్టాపులపై బల్దియా కీలక నిర్ణయం
Advertisement

GHMC: గ్రేటర్ వాసులకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ ఇటీవలి కాలంలో దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఎదిగినట్టే ఎదిగి, మూడు కార్పొరేషన్లుగా విభజించటంతో అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీలో మళ్లీ ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. దీంతో జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను అన్వేషించటంతో పాటు బల్దియా విధులతో సంబంధం లేని నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. ముఖ్యంగా నవంబర్ 25కు ముందు దాదాపు 650 కిలోమీటర్ల విస్తీర్ణంతో 30 సర్కిల్స్, ఆరు జోన్లు, 150 మున్సిపల్ వార్డులుగా ఉన్న జీహెచ్ఎంసీలోకి కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో ఏకంగా విస్తీర్ణం 2 వేల 53 చదరపు కిలోమీటర్లకు పెరిగినట్టే పెరిగి, గత నెల 11వ తేదీన మూడు కార్పొరేషన్లుగా పునర్విభజించటంతో జీహెచ్ఎంసీకి ఆదాయంతో పాటు ఆదాయ వనరులు కూడా పరిమితమైపోయాయి.

రూ.4786 కోట్ల అప్పులు

దీంతో ప్రస్తుతం జీహెచ్ఎంసీకి ఉన్న రూ.4786 కోట్ల అప్పులకు అసలు మిత్తీలు, జీతభత్యాలు, పెన్షన్లు, వివిధ రకాల పనులకు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులతో పాటు రొటీన్ మెయింటనెన్స్ కూడా గగనంగా మారింది. దీంతో వచ్చే ఆదాయం, సమకూరే నిధులతో జీహెచ్ఎంసీ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ తమ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేకుండా నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ మెయింటనెన్స్, ఆర్టీసి బస్సు బస్టాపులు వంటి నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 404 ట్రాఫిక్ సిగ్నల్స్ కు జీహెచ్ఎంసీ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. దీంతో జీహెచ్ఎంసీపై నెలకు రూ. 50 లక్షల వరకు వ్యయ భారం పడుతూ, ఏటా జీహెచ్ఎంసీపై రూ. 6 కోట్ల ఆర్థిక భారం పడుతున్నందున, ఈ బాధ్యతల నుంచి తప్పించుకునే విషయంపై ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలను పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

Also Read: BRS Rivalry: సోషల్ మీడియాలో.. బావ బామ్మర్దుల పోటాపోటీ ట్వీట్లు!

14 ఏళ్ల పంచాయతీ..

జీహెచ్ఎంసీ పరిధిలోని ట్రాఫిక్ సిగ్నల్ ను బల్దియా నిర్వహిస్తూ ఏటా రూ. కోట్లాది రూపాయలను వెచ్చింది. దీనికి తోడు పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుకూలంగా ఎప్పటికపుడు రద్దీ జంక్షన్లు, ట్రాఫిక్ ఐలాండ్లను విస్తరిస్తూ, ఆధునీకరిస్తూ వస్తుంది. కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా ఛలానాల రూపంలో వచ్చే ఆదాయం మొత్తం పోలీసు శాఖకు వెళ్తుండటంతో, సిగ్నల్ మెయింటనెన్స్ బాధ్యతలను తామే నిర్వహిస్తున్నందున, ఛలానాల్లో తమకు వాటా కేటాయించాలని దాదాపు 14 ఏళ్ల క్రితం అప్పటి కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడినా, ఏ సర్కారు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గ్రేటర్ పరిధిలో వసూలు చేస్తున్న ప్రొఫెషనల్ ట్యాక్స్, మోటారు వెహికల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వసూళ్లలో ఇస్తున్న వాటా తరహాలోనే ట్రాఫిక్ ఛలానాల వసూళ్లలో జీహెచ్ఎంసీ వాటా ఫిక్స్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సమైక్యాంధ్రతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రమేర్పడిన తర్వాత పాలకులను కోరుతూనే వస్తుంది. జీహెచ్ఎంసీలో పుష్కలంగా నిధులున్నపుడు సిగ్నల్ నిర్వహణ చేపడుతూ వచ్చిన జీహెచ్ఎంసీకి మూడు కార్పొరేషన్లుగా ఏర్పడిన తర్వాత ఆదాయం పరిమితం కావటంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లేకపోవటంతో ట్రాఫిక్ సిగ్నల్స్, బస్టాపుల నిర్వహణల బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైనట్లు తెలిసింది.

Advertisement

Also Read: Tollywood: సినీ ప్రేమికులకు శుభవార్త.. థియేటర్లలో ఫ్రీ పార్కింగ్.. హైకోర్టు ఉత్తర్వులు!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×