E-Paper
Advertisement

Varalakshmi sarath kumar: సాయి మాధవ్ కు వరలక్ష్మి కౌంటర్.. రే** చేశారనడం సరికాదంటూ!

Varalakshmi sarath kumar: సాయి మాధవ్ కు వరలక్ష్మి కౌంటర్.. రే** చేశారనడం సరికాదంటూ!
Advertisement

Varalakshmi sarath kumar: ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల దర్శకురాలిగా మారి ఎస్.సరస్వతి అనే సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి ఆరవ తేదీ ఈ సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది .అయితే ఈ సినిమా విషయంపై ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్ బుర్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కథతో మొదలయ్యి వేరే కథతో పూర్తి అవుతుంది. కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్నారు. నా కథను మానభంగం చేశారు. నాది రివేంజ్ డ్రామా కాదు..నా సోల్ వేరు అసలా కథ వేరు అంటూ సాయి మాధవ్ సోషల్ మీడియా వేదికగా సినిమా పేరు ప్రస్తావించకుండా పోస్ట్ చేశారు.

సాయిగారు అంటే మాకు చాలా గౌరవం..

ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన కచ్చితంగా వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతీ సినిమా గురించి మాట్లాడారని స్పష్టమవుతుంది.. ఇక ఇదే విషయంపై తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మీడియా వారి నుంచి వరలక్ష్మికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు వరలక్ష్మి శరత్ కుమార్ సమాధానం చెబుతూ.. సాయి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. మేము ఆయనకు ఈ సినిమా విషయంలో డబ్బులు కూడా ఇచ్చామని తెలిపారు. ఈ సినిమా విషయంలో అసలేం జరిగిందనే విషయాల గురించి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..

రే** అనే పదం వాడటం సరైంది కాదు..

Advertisement

ఈ సినిమా కథ మాకు సారు పూర్తిగా చెప్పలేదు ఆయన మొదట్లో కాస్త వినిపించారు తర్వాత ఆయనకు పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయని చెప్పేసి ఆ సినిమా పనుల కోసం వెళ్లారు. మేము కథ సిద్ధం చేసేటప్పుడు ఒక్క సిట్టింగ్ కు రాలేదు. ఆయనకు పెద్ద సినిమాలు వస్తున్నాయని చెబితే మేము కూడా సైలెంట్ అయ్యాము కానీ ఈ సినిమా విషయంలో రే** అనే పదం వాడటం సరైనది కాదని వరలక్ష్మి తెలిపారు. రే** అనే పదం వాడి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ పై మాట్లాడటం సరికాదని వరలక్ష్మి శరత్ కుమార్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

నేను ఎవరి కథ దొంగలించలేదు..

Advertisement

ఇక నేను ఎవరి కథను కూడా దొంగలించలేదని, కాంట్రాక్టు వేసి డబ్బులు ఇచ్చి ఈ కథను తీసుకున్నానని తెలిపారు. ప్రేక్షకులకు ఉన్నది ఉన్నట్టు తీస్తే నచ్చదు.ఆయన కథ చాలా ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్ బాగాలేదు అని చాలా మంది చెప్పారు. ఈ సినిమా కోసం మేము డబ్బులు ఇచ్చి కథ వాడుకున్నప్పటికీ స్క్రీన్ పైన రైటర్ గా ఆయన పేరు వేసా…అది ఆయనకి నేను ఇచ్చే గౌరవం అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ వివాదంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా దోస డైరీస్ బ్యానర్ పై వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు ఆమె సోదరి నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ద్వారా వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు.

Also Read: Divvala Madhuri: తిరుమల వివాదం స్పందించిన  దివ్వెల మాధురి..నేనేం తప్పు చేయలేదంటూ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×