E-Paper
Advertisement

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా
Advertisement

Comedy Series OTT : ఒకే అపార్ట్‌మెంట్‌ లో ఉండే వాళ్ల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంటుంది ? పక్కింట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుంటారా ? లేక ఒకరి ఇంట్లో మొదలైన చిన్న సమస్య కాస్తా కాలనీ మొత్తం సమస్యగా మారుతుందా ? ఇలాంటి పొరుగువారి కబుర్లు, కుటుంబ గొడవలు, సంబంధాల మధ్య వచ్చే సరదా సంఘటనలను నవ్వులు పూయించేలా చూపించే సిరీసే ‘Chumbak’. Sarabhai vs Sarabhai, Khichdi వంటి కల్ట్ కామెడీ షోలకు పని చేసిన ఆతిష్ కపాడియా, జమ్నాదాస్ మజేథియా ఈ సిరీస్‌ను రూపొందించారు. మరి ఈ కాలనీలో అసలు ఏం జరుగుతుంది ? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ముంబైలోని చుంబక్ కాలనీలో ఐదు కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తుంటాయి. ఇళ్ల మధ్య గోడలు వేర్వేరుగా ఉన్నా… వాళ్ల జీవితాలు మాత్రం ఒకదానితో ఒకటి గట్టిగానే ముడిపడి ఉంటాయి. ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందంటే చాలు… ఆ విషయం మరుసటి నిమిషానికే పక్కింటికి చేరిపోతుంది. అక్కడి నుంచి మొత్తం కాలనీకి పాకుతుంది. ఈ గాసిప్ పాయింటే ఈ సిరీస్‌ లోని కామెడీకి ప్రధాన బలం. ఈ కాలనీలోని సీనియర్ జంట రజనీ మర్చంట్, కుకూ మర్చంట్ పాత్రలు కథలో కీలకంగా కనిపిస్తాయి. మరోవైపు ప్రియాంక, ఆది వంటి పాత్రలు తమ తమ సమస్యలు, ఆలోచనా విధానాలతో కథకు మరింత వినోదాన్ని తీసుకొస్తాయి. ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సమస్య ఉంటుంది. కానీ ఆ సమస్య ఎప్పుడూ వాళ్ల ఇంటి గడప దాటకుండా ఉండదు.

Advertisement

కుకూ ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారతాయి. అతడి కోసం రజనీతో పాటు కాలనీ వాళ్లు కూడా వెతకడం మొదలుపెడతారు. ఆ తర్వాత రజనీ, కుకూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. లేడీస్ నైట్ గొడవలు, పిల్లల స్కూల్ విషయాలు, పొరుగింటి గాసిప్స్ ఇలా రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న విషయాలే కామెడీకి కారణమవుతాయి. అయితే నవ్వుల మధ్య సిరీస్ అసలు చెప్పాలనుకునే విషయం మాత్రం బంధాల గురించే. మొదట ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకునే ఆ పొరుగు వాళ్ళు చివరికి కథను ఎలాంటి మలుపు తిప్పారు ? క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది ? అన్నది తెలియాలంటే సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

Also Read : పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

‘చుంబక్’ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్ ఆడియో కూడా అందుబాటులో ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా సులభంగా చూడొచ్చు. నీనా గుప్తా, దేవన్ భోజానీ, మానసి పరేఖ్, సుమీత్ వ్యాస్ వంటి నటులు ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూడాలనుకునే వారికి ఈ సిరీస్ మంచి ఆప్షన్. మన చుట్టూ కనిపించే పొరుగు వారి సంబంధాలను కామెడీగా చూపించడంతో ఈ సిరీస్ అందరికీ కనెక్ట్ అవుతుంది.

Tags

Related News

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

Big Stories

Advertisement
×