Apple iPhone Duo: యాపిల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. టెక్ ప్రపంచంలో అంచనాలు తలకిందులు చేస్తూ యాపిల్ తమ మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duoను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు శాంసంగ్ లాంటి కంపెనీలదే ఈ ఫోల్డబుల్ మార్కెట్లో హవా ఉండేది. కానీ ఇప్పుడు యాపిల్ ఎంట్రీ ఇవ్వడంతో ఫోన్ ప్రియుల్లో పూనకాలు వచ్చేసాయి. బుక్‌స్టైల్ డిజైన్‌తో వచ్చిన ఈ అద్భుతమైన ఫోన్ టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో ఈ ఐఫోన్ డ్యూయో విశేషాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.
ఈ iPhone Duo చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియంగా ఉంది. దీనికి బయటివైపు 5.4 అంచుల డిస్‌ప్లే ఇచ్చారు. ఫోన్ విప్పితే లోపల ఏకంగా 7.6 అంచుల పెద్ద సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ ఫోల్డింగ్ స్క్రీన్ కనిపిస్తుంది. నానో టెక్చర్ ఫినిష్, ప్రో-మోషన్ టెక్నాలజీ వల్ల వీడియోలు చూసేటప్పుడు, గేమ్‌లు ఆడేటప్పుడు అనుభూతి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. దీనికి వాడిన టైటానియం ఫ్రేమ్ ఫోన్‌కు మరింత అందాన్ని, గట్టితనాన్ని ఇస్తోంది.
పనితీరు విషయంలో యాపిల్ ఎప్పుడూ రాజీపడదు. ఈ iPhone Duoలో లేటెస్ట్ ఏ20 ప్రో ప్రాసెసర్‌ను వాడారు. ఇది ఆరు కోర్ల సీపీయూ, ఏడు కోర్ల జీపీయూతో వస్తుంది. దీనికి తోడు డ్యూయల్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉండటం వల్ల ఫోన్ సూపర్ స్పీడ్‌గా పనిచేస్తుంది. ఎంత పెద్ద యాప్స్ అయినా, గేమ్‌లు అయినా చిటికెలో ఓపెన్ అయిపోతాయి.
Also Read: లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!
ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కెమెరాను చాలా సింపుల్‌గా కానీ పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. వెనుకవైపు 48 మెగాపిక్సెల్స్ గల రెండు కెమెరాలు ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనికి తోడు యాపిల్ ఇంటెలిజెన్స్, సిరి ఏఐ ఫీచర్లు ఈ ఫోన్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. మన రోజూవారీ పనులను ఇది చాలా సులువు చేస్తుంది.
ఫోల్డబుల్ ఫోన్ అంటే బ్యాటరీ త్వరగా అయిపోతుందనే టెన్షన్ ఉంటుంది. కానీ దీని బ్యాటరీ పెర్ఫార్మెన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. బయటి స్క్రీన్‌తో అయితే ఏకంగా 44 గంటల పాటు, లోపలి స్క్రీన్‌తో 31 గంటల పాటు నిరంతరం వీడియో ప్లేబ్యాక్ పొందవచ్చు. అంటే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా వాడేయొచ్చు.
ఇక ధర విషయానికి వస్తే.. ఇది అందరికీ అందుబాటులో ఉండే ఫోన్ కాదనే చెప్పాలి. 256GB బేసిక్ మోడల్ ధర రూ.2,99,900 ఉండగా.. టాప్ మోడల్ 2TB ధర రూ.4,49,900 వరకు ఉంది. స్టార్ వైట్, నైట్ స్కై కలర్స్‌లో ఇది లభిస్తుంది. అక్టోబర్ 16 నుంచి ప్రీ ఆర్డర్లు మొదలవుతుండగా.. అక్టోబర్ 23 నుంచి అధికారికంగా సేల్ ప్రారంభం కానుంది.
Also Read: ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!