E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నందుతో ఇంటికి రాలేనన్న ఇందు

Brahmamudi Serial Today Episode April 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నందుతో ఇంటికి రాలేనన్న ఇందు
Advertisement

Brahmamudi serial today Episode: చక్రి వచ్చి రేఖను డబ్బులు అడిగితే నగలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇస్తానని చెప్తుంది. దీంతో మీరు నగలు తాకట్టు పెట్టడానికి వెళితే మీ కంపెనీ దివాలా తీసిందని అనుకుంటారు అని చెప్పగానే.. బాగా ఆలోచించుకోండి అని చెప్పగానే.. రేఖ సరే నువ్వు అడిగింది ఇస్తాము వదిన వెళ్లి అందరూ మీ దగ్గర ఉన్న నగలు తీసుకురండి అని చెప్పగానే.. భ్రమరాంబ బాధగా మనసులో ఏంటో ఈ కర్మ ఆ ఇందు దగ్గర కోట్లు కొట్టేద్దామనుకుంటే ఇలా అయిపోయింది అనుకుంటూ నగలు తీసుకురావడానికి వెళ్తుంది.

మరోవైపు రాజు, లక్కీ, ఇందు ముగ్గురు కలిసి భోజనం చేశాక.. ఇందును రూంలో వేసి లాక్‌ చేస్తారు. బయట హాల్లో రాజు, లక్కీ పడుకుంటారు. ఇందు ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. అప్పుడే నందు వెనక డోర్‌లోంచి ఇంట్లోకి వెళ్తుంది. రూంలో కూర్చుని ఉన్న ఇందును చూసి అక్కా అని పిలుస్తుంది. ఇందు తిరిగి నందును చూసి షాక్‌ అవుతుంది. నువ్వా..? నువ్వెలా లోపలికి వచ్చావు. కొంపదీసి నిన్ను కూడా కిడ్నాప్‌ చేశారా..? అని అడగ్గానే.. నందు నన్ను కిడ్నాప్‌ చేసే వ్యక్తి ఇంకా పుట్టలేదులే అక్కా అని చెప్తుంది. దీంతో ఇందు మరి లోపలికి ఎలా వచ్చావు.. బయట తాళం వేశారు. కదా అని అడగ్గానే.. నందు నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు.. కదా.. నా చేతుల కన్నా గట్టిగా ఆ తాళాలేం లేవు కానీ అసలు ఈ వెధవలు ఎవరు..? నిన్ను ఎందుకు కిడ్నాప్‌ చేశారు అని అడగ్గానే..

Advertisement

ఇందు ఎవరినైనా కిడ్నాప్‌ ఎందుకు చేస్తారు. డబ్బుల కోసమే.. అని చెప్పగానే.. నందు ఏంటక్కా అంతా కన్పీజ్‌గా ఉంది. ఫస్ట్ నువ్వే కిడ్నాప్‌ చేసుకోవాలని అనుకున్నావంట మధ్యలో ఎవరో కిడ్నాప్‌ చేశారని స్వాతి చెప్పింది. అసలు ఏం జరిగింది అంటూ అడగ్గానే.. జరిగిన విషయం మొత్తం నందుకు ఇందు చెప్పగానే.. నందు అక్కా ముందు మనం ఇక్కడి నుంచి వెళ్లాలి అంటూ చెప్పగానే.. ఇందు నేను రాను అని చెప్పగానే.. నందు షాక్‌ అవుతుంది. ఎందుకు అక్కా ఏమైంది అని అడగ్గానే.. ఇందు మళ్లీ నేను ఆ ఇంటికి వెళితే నేను అనుకున్నది ఏదీ చేయలేను.. నన్ను నమ్ముకున్న వాళ్లకు ఏమీ చేయలేను అని చెప్పగానే..

అప్పటి న నుంచి నువ్వు మాట్లాడుతున్నది ఆ సంతకం గురించే కదా..? నాన్నమ్మ నీ గురించి చాల టెన్షన్‌ పడుతుంది. నిన్ను తీసుకొస్తానని తనకు మాటిచ్చాను అక్కా అని నందు చెప్పగానే.. ఆ రేఖ ఆంటీకి ఆస్తి వెళ్లనివ్వని నేను నాన్నమ్మకు మాటిచ్చాను. అంతవరకు నేను ఇంటికి రాలేను అని చెప్పగానే.. వీళ్లతో వదిలేసి నేను ఎలా వెళ్లను అక్కా అని నందు అడగ్గానే.. వీళ్లు వెధవల్లా కనిపించినా నాతో బాగానే ఉంటున్నారు.. నన్ను బాగానే చూసుకుంటున్నారు.. అవునా ఎందుకు నాకోసం ఇంత చేస్తున్నావు.. అని అడగ్గానే.. నన్ను దేవుడిచ్చిన చెల్లి అన్నావు.. అప్పుడు నువ్వు నాకు అక్కవి కదా అక్క కోసం ఇది చేయలేనా..? అంటూ నందు అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

మరోవైపు చక్రికి ఇచ్చిన నగలు తక్కువ అయ్యాయని చక్రి చెప్పగానే.. రేఖ, అపర్ణ దగ్గరకు వెళ్లి తన చేతులకు ఉన్న బంగారు గాజులు ఇవ్వమని బలవంతం చేస్తుంటుంది. ఇవ్వనని అపర్ణ చెప్పగానే.. భ్రమరాంబ వెళ్లి బలవతంగా లాక్కుంటుంది. అపర్ణ తిడుతుంది. ఇంతలో నందు వెళ్లి హలో మేడం మీ ఇంట్లో ఎప్పుడూ ఇలాగే ఉంటాయా పరిస్థితులు అని అడగ్గానే.. భ్రమరాంబ ఇవన్నీ నీకెందుకు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకు అంటూ చెప్పగానే.. గాజుల కోసమే ఇంత చేస్తున్నారంటే ఇందు ఆస్థి కోసం కిడ్నాప్‌ మీరే చేయించారేమోనని డౌటుగా ఉంది అంటుంది. దీంతో రేఖ, భ్రమరాంబ షాక్‌ అవుతారు. తర్వాత అక్కడి నుంచి హాల్లోకి వెళ్లిన రేఖ ఈ నగల గురించి పక్కన పెట్టు ఇందు రావాలంటే మాకు కోటి రూపాయలు కావాలి ఇందు వచ్చాక వన్‌ వీక్‌లో నీ డబ్బులు నీకు ఇస్తాను అని రేఖ చెప్పగానే.. చక్రి ఆఫీసుకు వెళ్లి డబ్బు పంపిస్తానని చెప్పి గోల్డ్‌ తీసుకుని వెళ్లిపోతాడు. ఇంతలో నందు బయటకు వచ్చి ఇంత ఆస్తి ఉన్నా ఎందుఉక సుభాష్‌కు ఆపరేషన్‌ చేయించలేదు అని అడగ్గానే..రేఖ, భ్రమరాంబ మళ్లీ షాక్‌ అవుతారు. ఇంతలో భ్రమరాంబ డాక్టర్లు ఆపరేషన్‌ చేస్తే ప్రమాదమని డాక్టర్లే చెప్పారని కవర్‌ చేస్తుంది.

మరోవైపు ఇందు సోఫోలో కూర్చుని రాజు రాగానే వెళ్లి తనకు కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. రాజు కోపంగా నేను కాఫీ తీసుకురావడం ఏంటి..? అనగానే.. నా వల్ల నీకు కోట్లు వస్తున్నాయి.. కాఫీ ఇవ్వలేవా..? అనగానే.. కోట్లు కాదమ్మా కోటి మాత్రమే.. అయినా మహరాణిగారు కదా తీసుకొస్తానులే అంటూ రాజు లోపలికి వెళ్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?

Sunday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. ఆ నాలుగు డోంట్ మిస్…

Nindu Noorella Saavasam Serial Today Episode September 6th ‘నిండు నూరేళ్ల సావాసం’  సీరియల్‌: బుజ్జమ్మ కోసం బయలుదేరిన ప్రచండ

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

Big Stories

Advertisement
×