E-Paper
Advertisement

బెడ్‌రూమ్ వరకు చేరిన ఆఫీస్ పరిచయం… తప్పు అని తెలిసినా తప్పని తిప్పలు

బెడ్‌రూమ్ వరకు చేరిన ఆఫీస్ పరిచయం… తప్పు అని తెలిసినా తప్పని తిప్పలు
Advertisement

Romantic Thriller OTT : అక్రమ సంబంధాల నేపథ్యంలో హాలీవుడ్ సినిమాలు భలే ఉంటాయి. మసాలా సీన్లు కావాల్సినంత దట్టించి పెడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. సాధారణంగా సినిమాల్లో మగవారు బాస్‌లుగా ఉండి ఆడవారిని లోబర్చుకోవడం చూస్తుంటాం, కానీ ఇందులో సీన్ రివర్స్. ఒక పవర్‌ఫుల్ మహిళ తన ఇంటర్న్ కుర్రాడికి బానిసలా మారిపోవడం అనేది ఈ సినిమాలోని మెయిన్ పాయింట్. ఆఫీసులో మేడం అని పిలిపించుకునే ఆమె, బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి వాడి కండిషన్లకు లొంగిపోయి తన పరువును కూడా పక్కన పెట్టేస్తుంది. కామకోరికల కోసం ఒక మనిషి ఎంతకైనా తెగిస్తాడని, దానివల్ల జీవితాలు ఎలా అల్లకల్లోలం అవుతాయో చూపించే పచ్చి అడల్ట్ సినిమా ఇది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

హాలినా రేయిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ అమెరికన్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా పేరు “బేబీ గర్ల్” (Babygirl). ఇందులో నికోల్ కిడ్మాన్, హారిస్ డికిన్సన్, ఆంటోనియో బాండెరాస్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నికోల్ కిడ్మాన్ చాలా ఇబ్బంది పడిందట. కొన్ని సీన్లు చేస్తున్నప్పుడు విపరీతమైన కోరికలు, అలసట వల్ల ఇక నా వల్ల కాదు, షూటింగ్ ఆపేయండని కూడా దర్శకురాలితో చెప్పిందట. ముఖ్యంగా తన కంటే వయసులో చిన్నవాడైన హారిస్ డికిన్సన్‌తో ఆ బోల్డ్ సీన్స్ చేయడం ఆమెకు ఒక పెద్ద సవాలుగా మారింది. అయినా సరే పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించడంతో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో ‘వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. 2024 లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇందులో రోమీ ఒక పెద్ద కంపెనీకి బాస్. మంచి హోదా, ఇంట్లో మొగుడు, పిల్లలు.. ఇలా అంతా సెటిల్డ్ అనుకుంటున్న టైంలో ఆమె లైఫ్ లోకి సామ్యూల్ అనే ఒక కుర్రాడు ఇంటర్న్‌గా ఎంట్రీ ఇస్తాడు. అతను చూడటానికి కుర్రాడైనా, మాటలతోనూ చూపులతోనూ ఆమెను బుట్టలో వేసుకుంటాడు. రోజూ ఆఫీసు పనుల కంటే, వీళ్లిద్దరి మధ్య రొమాన్స్, గిల్లికజ్జాలే ఎక్కువైపోతాయి. రోమీకి తన మొగుడితో దొరకని ఏదో కొత్త ఫీలింగ్ ఈ కుర్రాడి దగ్గర దొరుకుతుంది. వాడు చెప్పిందే ఆట, వాడు గీసిందే గీత అన్నట్టుగా ఆమె తయారవుతుంది. ఇది ఎంతలా అంటే, బాస్ అన్న అహంకారం పక్కన పెట్టి వాడి ముందు లొంగిపోతుంది. అతను పెట్టే వింత వింత కండిషన్లకు ఒప్పుకుంటూ, తన పరువును, కుటుంబాన్ని, చివరికి తన కెరీర్‌ను కూడా ఫణంగా పెట్టేస్తుంది. చివరికి ఈ వ్యవహారం భర్తకి తెలుస్తుందా ? రోమీ లైఫ్ ఎటు వెళ్తుంది ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఆట మొదలు పెడితే ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే… ఓటీటీలో చూడాల్సిన తోపు సిరీస్

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×