E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ మోసం చేశాడన్న విషయం తెలుసుకున్న సుభాష్ 

Brahmamudi Serial Today December 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ మోసం చేశాడన్న విషయం తెలుసుకున్న సుభాష్ 
Advertisement

Brahmamudi serial today Episode:

రౌడీల నుంచి తప్పించుకుని వెళ్లిపోయిన రాజ్‌, కావ్య తర్వాత ఆశ్రమానికి వెళ్లి వారం రోజుల నుంచి మీ దగ్గర ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాము ఇప్పుడు ఎలా ఉంది మా కళావతికి అని అడుగుతాడు రాజ్‌. 99శాతం క్యూర్‌ అయింది.. ఇక మీరు ఇంటికి వెళ్లవచ్చు.. కానీ ఇంకో నెల రోజులు క్రమం తప్పకుండా నేను ఇచ్చే కషాయాలు, గుళికలు తీసుకోవాలి. నూనెతో మర్దన చేయాలి. ఒక్క రోజు కూడా గ్యాప్‌ రానీయకూడదు.. అప్పుడే పూర్తి ఫలితం వస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి అని చెప్తాడు గురువు.

సరే అంటూ హ్యపీగా ఫీలవుతారు రాజ్‌, కావ్య.. లేదు గురువు గారు కలలో కూడా నిర్లక్ష్యం చేయము.. ఇన్ని రోజులు మేము చాలా కంగారు పడ్డాం. నా భార్యకు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలో తెలియక.. ఎక్కడ ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలో తెలియక చాలా బాధపడ్డాం.. దిన దినం ఒక గండంలా గడపాల్సి వచ్చింది. కానీ మీ దగ్గరకు వచ్చాక నా భార్యకు ఇక ఏమీ కాదన్న ధీమా కలిగింది. ఇప్పుడు మీ మాటలు విన్నాక ఆ దేవుడే మీ రూపంలో ఇదంతా చేశాడు అనిపిస్తుంది మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము చాలా థాంక్స్‌ గురువు గారు అని చెప్పగానే.. వైద్యుడిగా ప్రాణాలు నిలబెట్టడం మా బాధ్యత ఆ అమ్మవారు మీ వైపు ఉన్నారు అందుకే అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఇక మీరు బయలుదేరవచ్చు అని చెప్తాడు గురువు.

Advertisement

మరోవైపు సుభాష్‌ ఆవేశపడుతుంటే.. అపర్ణ వచ్చి ఏవండి ఎప్పుడు మీలో ఇంత ఆవేశం చూడలేదు.. ఎందుకు రాహుల్‌ మీద చేయి చేసుకున్నారు అని అడుగుతుంది. దీంతో సుభాష్‌ కోపంగా ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా రాహుల్ వల్ల మన కంపెనీకి పది కోట్లు లాస్‌ వచ్చింది కాబట్టి. అది కూడా రాజ్‌ లేని టైంలో నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్న టైంలో జరిగింది కాబట్టి.. అంటూ చెప్పగానే.. రాహుల్‌ మీద మనకు నమ్మకం లేకపోవచ్చు అండి కానీ స్వప్న చెప్పిన మాటలు చూస్తుంటే.. రాహుల్ తప్పు చేయలేదోమో అనిపిస్తుంది అని అపర్ణ చెప్పగానే.. నిజంగా వాడు తప్పు చేయకపోతే  మన కంపెనీ క్లయింట్స్‌ తో వెళ్లి ఎందుకు మాట్లాడాలి.. వాడి దగ్గర డిజైన్స్‌ ఉన్నాయని ఎందుకు చెప్పాలి. వాడికి నిజంగా బిజినెస్‌ చేయాలని ఉంటే వెళ్లి కొత్త క్లయింట్స్‌ ను చూసుకోవచ్చు కదా..? మన క్లయింట్స్‌తో ఎందుకు మాట్లాడాలి. వాడేమో మనకు బిజినెస్‌ కాంపిటీటర్‌ అయినట్టు అని సుభాష్ ఆవేశపడుతుంటే.. మరి ఈ విషయం వెళ్లి రాహుల్‌ నే అడగొచ్చు కదా అని అపర్ణ చెప్పగానే..

ఎలా అడగమంటావు అసలు కావ్య వేసిన డిజైన్స్‌ దొంగిలించలేదు.. అంటున్నాడు పైగా వాడికి స్వప్న మద్దతుగా నిలబడింది. మొదటి తప్పునే మనం ప్రూవ్‌ చేయలేకపోయాము అలాంటిది ఇప్పుడు క్లయింట్స్‌ను ఎందుకు లాక్కున్నావు అని అడిగితే వాళ్లే వచ్చారు అంటాడు. దానికి మళ్లీ రుద్రాణి గొడవ చేస్తుంది. అప్పుడేం సమాధానం చెప్పాలి అని చెప్పగానే.. మరి ఇప్పుడేం చేస్తారు అని అపర్ణ అడగ్గానే.. లైఫ్‌లో ఫస్ట్‌ టైం ఓటమి చూశాను అపర్ణ అది కూడా నా ప్రమేయం లేకుండా… వదిలిపెట్టను దీని వెనక అసలు ఏం  జరిగింది.. ఎవరెవరు ఉన్నారో తెలుసుకోకుండా వదిలిపెట్టను అని చెప్తుంటే.. పోనీ రాజ్‌ కు ఏమైనా చెబుదామా అంటుంది అపర్ణ.. వద్దులే అనవసరంగా వాళ్లను ఎందుకు డిస్టర్బ్‌ చేయడం తప్పు ఎక్కడ జరిగిందో నేనే కనుక్కుంటాను అని చెప్తాడు సుభాష్‌. సరేలే ఫ్రెష్ అయి రండి టిఫిన్‌ చేద్దురు అంటూ చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత అప్పు.. రేణుక గురించి అంజలి గురించి బాధపడుతుంటే.. కళ్యాణ్‌ వచ్చి ఓదారుస్తాడు. మరోవైపు కావ్య రూం పనిమనిషి క్లీన్‌ చేస్తుంటే.. డాక్టర్‌ రిపోర్ట్‌ కనిపిస్తాయి. అవి రుద్రాణి చూసి తీసుకుని వెళ్తుంది. అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే.. రాహుల్‌ వస్తాడు. సుభాష్‌.. రాహుల్‌ను గుర్రుగా చూస్తుంటాడు. ఇంతలో రిపోర్ట్‌ తీసుకుని వచ్చిన రుద్రాణి అందరికీ చూపిస్తుంది. అవి చూసి అందరూ షాక్‌ అవుతారు. కావ్య బిడ్డను కంటే బిడ్డ మాత్రమే బతుకుతుంది. కావ్య బతకదు తనకు ఇంకా ప్రాబ్లమ్‌ అలాగే ఉంది. వాళ్లు ఈ విషయం మీ దగ్గర దాచారు అని చెప్తుంది. దీంతో అందరూ బాధపడుతుంటారు. ఇంతలో రాజ్‌, కావ్య వస్తారు. అందరూ నిజం అడగ్గానే.. రాజ్‌, కావ్య అదంతా నిజమేనని మీ బాధను తను చూడలేకపోయింది. అందుకే ఇంత నాటకం ఆడామని చెప్తారు. కేరళ వెళ్లి కళావతి జబ్బు నయం చేసుకుని వచ్చామని చెప్తాడు రాజ్‌. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×