E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ను కలిసిన అవని.. దిమ్మతిరిగే షాక్..రాజేశ్వరిని రెచ్చగొట్టిన పల్లవి..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ను కలిసిన అవని.. దిమ్మతిరిగే షాక్..రాజేశ్వరిని రెచ్చగొట్టిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode December 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ పార్వతి ఇద్దరూ కూడా రాజేశ్వరి చెప్పిన విషయాన్ని ఆలోచించాలని అనుకుంటారు.. నా ఒక్కరి అభిప్రాయం మాత్రమే కాదు కదా ఇంట్లోని వాళ్ళ అందరి అభిప్రాయాన్ని కనుక్కోవాలి కదా అని రాజేంద్రప్రసాద్ అందరినీ అడగాలని అనుకుంటాడు.. అందరూ కూడా చక్రధర్ ను బయటకు తీసుకురావడానికి ఒప్పుకోరు.. వాడిలాంటి దుర్మార్గుడు మళ్లీ బయటకు వస్తే మళ్లీ మనం సమస్యల్లో పడాలి అని అనుకుంటారు.. ముందుగా శ్రీకర్ని అడిగితే శ్రీకర్ అదే సమాధానం చెప్తాడు. అలాగే కమల్ కూడా చక్రధర్ పేరు వినగానే ఆవేశంతో రగిలిపోతాడు.. వాడి లాంటి దుర్మార్గుడ్ని  బయటికి తీసుకొస్తే మనల్ని చంపేస్తాడు అని కమల్ అంటాడు. ఇక ఆ తర్వాత అవన్నీ కూడా అదే సమాధానం చెప్పడంతో భానుమతి అవని పై సీరియస్ అవుతుంది. రాజేశ్వరి ఎంతగా చెప్పిన చక్రధర్ ను విడిపించడానికి ఎవ్వరు ముందుకు రారు..అక్షయ్ మాత్రం నేను రాను అత్తయ్య అని అంటాడు.. అదేంట్రా అలా మాట్లాడుతున్నావ్.. నాకు పతి బిక్ష పెట్టమని అడిగాను వేడుకున్నాను మా ఆయనను తీసుకొని వద్దాం పదండి.. అని ఎంత బ్రతిమిలాడినా సరే అక్షయ్ మాత్రం అస్సలు ఒప్పుకోడు.. దాంతో రాజేశ్వరి నా ఉసురు పోసుకొని ఈ కుటుంబమంతా నాశనం అయిపోతారని శాపాలు పెట్టి వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… రాజేశ్వరి ఎంత చెప్పినా సరే అక్షయ్ వినడు. దాంతో నేను నీకు తల్లిలాగా అడుగుతున్న సరే నువ్వు మాత్రం నీ మనసు మార్చుకోవడం లేదు అని రాజేశ్వరి బాధపడుతుంది. ఎంతగా రాజేశ్వరి నా భర్తను విడిపించండి అని వేడుకున్న సరే అక్షయ్ మాత్రం కరగడు.. అక్షయ్ బాటలోనే కమల్ కూడా నడుస్తాడు.. ఆ దుర్మార్గున్ని బయటకి తీసుకువచ్చే ఫసక్తే లేదు అని అంటాడు.. రాజేశ్వరి మీరందరూ నా ఉసురు పోసుకుంటారు.. ఆడబిడ్డ ఉసురు పోసుకునోళ్ళు ఏ ఒక్కరు బాగు పడినట్లు లేదు.. మీరందరూ నాశనం అయిపోతారు అని శాపాలు పెడుతుంది..

Advertisement

అవని చక్రధర్ని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.. అక్కడ చక్రధర్ ఏంటి ఇలా వచ్చావు నాతో మాట్లాడాలని వచ్చావా నేను ఎలా ఉన్నానో చూడాలని వచ్చావా అని అడుగుతాడు. నువ్వు మారిపోయావని పిన్ని చెప్తుంటే నువ్వు మారవో లేదో తెలుసుకుందామని నేను వచ్చాను అని అవని అంటుంది. ఈ పిన్ని దృష్టిలో నేను మారిపోయాను కానీ నేను మారను.. నేనింతే అని చక్రధర్ అనగానే అవని షాక్ అవుతుంది. అవును నువ్వు మారవని నాకు తెలుసు కానీ పిన్ని మారిపోయావు అని చెప్తే నేను చూద్దామని వచ్చాను అని అవని అంటుంది. పట్టిన మగాడిన మర్చిపోతాడు కానీ పగబట్టిన ఆడది మాత్రం అస్సలు మర్చిపోదు అందుకే మీ పిన్ని దగ్గర మంచివాడిగా నటించి రెచ్చగొట్టాను అని చక్రధరంటాడు..

నువ్వు ఈ జన్మకు మారవా భార్యని మోసం చేస్తున్నావని అవని అంటుంది.. నేను మారలేదన్న విషయం నువ్వు మీ పిన్ని దగ్గరికి వెళ్లి చెప్పిన సరే ఆమెను నమ్మదు. ఎంతో అభిమానం గా చూసుకునే మీ పిన్ని కూడా నీపై ద్వేషం పెంచుకుంటుంది అని చక్రధర్ అంటాడు. అక్షయ్ రాజేశ్వరి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అక్షయ దగ్గరకొచ్చిన అవని ఏమండీ అని అంటుంది.. నేను రాజేశ్వరి అత్తయ్య విషయంలో చేసింది తప్పేనా అవని అని అక్షయ్ అడుగుతాడు. మీరు ఏ తప్పు చేయలేదండి. పిన్ని చెప్పిన విషయం నిజమో కాదో తెలుసుకోవాలని నేను జైలుకు వెళ్లొచ్చాను.. ఆ దుర్మార్గుడు ఏమాత్రం మారలేదు. మారినట్లు నమ్మించినట్లు చెప్పాడు. వాడు మారడు అని నాకు అర్థం అయిపోయింది ఇడియట్ అని సీరియస్ అవుతాడు అక్షయ్.

Advertisement

భానుమతి ఇంట్లోంచి బయటికి వెళ్లాలని అనుకుంటుంది. రాజేంద్రప్రసాద్ ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మా అని అడుగుతాడు. నా కూతురు దగ్గరికి నేను వెళ్తాను రా ఇక్కడ నా కూతురు కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేరు కదా అని బాధపడుతుంది. ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు. శ్రీకర్ శ్రీయ కమల్ పల్లవిలు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్లే ఉంటున్నారు. అవని అక్షయ్ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు.. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి నీ ఇష్టప్రకారమే వెళ్ళిపోతావా అని రాజేంద్ర అడుగుతారు.. అక్షయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నప్పుడు అత్తయ్య నిర్ణయం గురించి మీరు మాట్లాడే అధికారం లేదు అని పార్వతి అంటుంది. కానీ భానుమతి మాత్రం రాజేంద్రప్రసాద్ మాట వినేసి ఆగిపోతుంది.

Also Read:మీనా కోరికను తీర్చిన బాలు.. సుశీల ఎంట్రీతో ప్రభావతికి షాక్.. సత్యం ఎమోషనల్..

పల్లవి రాజేశ్వర్ కి ఫోన్ చేసి అక్షయ్ బావ అలా మాట్లాడడానికి, కమల్ బావా అలా మాట్లాడడానికి కారణం ఆ అవనినే మామ్.. నువ్వు మంచిది అనుకుంటున్నా అవని ఎంత క్రిమినల్ బ్రెనో అర్థమవుతుందా మామ్ అని రాజేశ్వరిని పల్లవీర్ రెచ్చగొడుతుంది. రాజేశ్వరి నిజంగానే అవని అలాంటిదే అని అనుకుంటుంది. ఇక అవని భోజనం వడ్డించి అందరినీ భోజనానికి రమ్మని పిలుస్తుంది. కానీ ఎవరు కూడా భోజనం చేయడానికి రారు. శ్రీకర్ శ్రీయ ఇద్దరు మాత్రమే భోజనానికి వస్తారు. పల్లవి నీ భోజనానికి పిలిస్తే నేను రాను అని చెప్పేస్తుంది. అక్షయ్ రాజేంద్రప్రసాద్ వాళ్ళ దగ్గరికి వెళ్లి భోజనానికి రమ్మని పిలిస్తే వాళ్ళు రారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×