E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ ను తిట్టిన సుభాష్ – రాజ్ ను జాగ్రత్తగా ఉండమన్న ప్రకాష్

Brahmamudi Serial Today December 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ ను తిట్టిన సుభాష్ – రాజ్ ను జాగ్రత్తగా ఉండమన్న ప్రకాష్
Advertisement

Brahmamudi serial today Episode:  

మేనేజర్‌ సతీష్‌ విషయంలో రాజ్‌ అడగకముందే రాహుల్‌ చెప్తాడు. తాను అక్కడ జాబ్‌ మానేసి వచ్చాడన్న విషయం తెలియకుండా తనకు జాబ్‌ ఇచ్చానని చెప్తాడు. దీంతో సుభాష్‌ కోపంగా రాజ్‌కు చెప్పకుండా రిజైన్‌ చేశాడని నీకు తెలిసినప్పుడు రాజ్‌ను అడిగి రాజ్‌కు విషయం చెప్పి కదా వాణ్ని అపాయింట్‌ చేసుకోవాలి అంటాడు. ప్రకాష్‌ కూడా అవును అలా ఎలా పెట్టుకుంటావురా నువ్వు అని అడగ్గానే.. మామయ్య నేను అంటూ రాహుల్‌ ఏదో చెప్పబోతుంటే.. నీకు అలా చేయడం తప్పు అనిపించలేదా..? అంటూ తిట్టబోతుంటే.. రాజ్ కల్పించుకుని ఇట్స్‌ ఓకే డాడ్‌ ఇప్పుడు ఏమైందని అడుగుతాడు. దీంతో సుభాష్‌ ఏమైంది అంటావేంటిరా..? అని చెప్పగానే.. డాడ్‌ రాహుల్‌ ది న్యూ కంపెనీ జస్ట్‌ ఇప్పుడే కదా స్టార్ట్‌ చేశాడు. రాహుల్‌కు ఎక్స్‌ఫీరియన్స్‌ తక్కువ. కంపెనీలో ఎక్స్‌ఫీరియన్స్‌ మేనేజర్‌ ఉండటం కలిసి వస్తుంది. వదిలేయండి.. నేను వేరే మేనేజర్‌ను అపాయింట్ చేసుకుంటాను అని చెప్పగానే..

రాజ్‌ నీకు అర్థం అవుతుందా..? ఇలా ప్రతి దాన్ని అలా ఈజీగా తీసుకుంటే ఎలా..? అనగానే.. రుద్రాణి కల్పించుకుని అన్నయ్య.. ఇప్పుడు ఏమైందని రాహుల్‌ ఏదో తప్పు చేసినట్టు పదే పదే పాయింట్‌ అవుట్‌ చేస్తున్నారు వాడెవడో అక్కడ రిజైన్‌ చేశాక రాహుల్ దగ్గరకు వచ్చాక పెట్టుకున్నాడు కదా..? దీనికి ఎందుకు అంత రాదాంతం చేస్తున్నారు అనగానే.. నీకు ఏం అర్థం అయిందో నాకు తెలియదు రుద్రాని.. కానీ నీ కొడుకు తప్పు చేశాడు. ఇలాంటి పద్దతి మంచిది కాదు.. ఇలాంటివి అన్ని నువ్వు ఈజీగా తీసుకోవడం వల్లనే.. ఈ మధ్య కాలంలో మన అపోనెంట్స్‌ అందరూ బిజినెస్‌లో ఎంతో వెనకాల ఉన్నవాళ్లు ఇప్పుడు మనకు చేరువలో ఉన్నారు.. అని సుభాస్‌ కోప్పడతాడు.. దీంతో ప్రకాష్‌.. నెంబర్‌వన్‌, నెంబర్‌ టూ, నెంబర్‌ త్రీ మనమే అలాంటిది మన సేల్స్‌  వీక్‌ అయిపోతూ మిగతా వాళ్లందరూ మన దగ్గరకు వచ్చేస్తున్నారు తెలుసా..? నీకు అనగానే..

Advertisement

లాస్ట్‌ ఇయర్‌ కాస్తైతే నెంబర్‌ ప్లేస్‌ను కోల్పోయేవాళ్లం అని సుభాష్‌ అంటాడు. దీంతో రాజ్ ఈ సారి అలా జరగదు డాడీ నేను కళావతి దాని గురించే ఆలోచిస్తున్నావు అని చెప్పగానే.. కావ్య కూడా అందుకే మామయ్య చాలా  కొత్త డిజైన్స్‌ వేస్తున్నాము ఓల్డ్‌ స్టాక్‌ అంతా ఇక ఏమీ ఉండదు.. అంతా రీప్లేస్‌ చేస్తున్నాము.. అని చెప్తుంది. ఈ న్యూఇయర్‌కు ఒకేసారి వంద న్యూ డిజైన్స్‌ మార్కెట్‌ లోకి  రిలీజ్‌ చేయాలనేది మా టార్గెట్‌ డాడీ అని రాజ్‌ చెప్పగానే.. ఇంత తక్కువ టైంలో  అన్ని న్యూ డిజైన్స్‌ ఎలా రాజ్‌ సాధ్యం అవుతుందా..? అసలు టైం సరిపోతుందా..? అని రాహుల్‌ అడగ్గానే.. కష్టపడాలి.. గోల్‌ రీచ్‌ కావాలి అని చెప్పగానే.. గ్రేట్‌ నేను కూడా నిన్ను ఫాలో అవుతాను.. అసలు రెస్ట్‌ అనేది తీసుకోను అని చెప్తాడు రాహుల్‌.. ఇంతలో అపర్ణ ఓరేయ్‌ భోజనం చేయండి తిండి దగ్గర కూడా బిజినెస్‌ ఏంట్రా అంటుంది .అందరూ భోజనం చేస్తుంటారు.

తర్వాత రాజ్‌, కావ్య తామే వేయాలనుకున్న కొత్త డిజైన్స్‌ గురించి ఆలోచిస్తుంటారు. ఎలాంటి డిజైన్స్‌ వేయాలో మాట్లాడుకుంటుంటే.. రాహుల్‌ వెనక నుంచి వచ్చి విని ఈరోజు అనుకుంటే ఈరోజే డిజైన్స్‌ మొదలు పెట్టారా..? అంటాడు. దీంతో రాజ్‌ ఏంట్రా ఈ టైంలో వచ్చావు.. అని అడగ్గానే.. మీ వర్క్‌ ను చూసి ఫాలో అవుదామని వచ్చాను అని చెప్పగానే.. రేయ్‌ సలహా అడిగితే ఇస్తాను కానీ కంపెనీకి చెందిన విషయాలు ఏవీ రివీల్‌ చేయను అంటాడు. దీంతో కావ్య నాకు డౌటుగా ఉంది. రాహుల్‌ మనం వేసిన డిజైన్స్‌ చూసి మనకన్న బెటర్‌గా వేద్దామని చూడ్డానికి వచ్చాడేమో అంటుంది. నాకు అంత సీన్‌ లేదు.. నేను ఒక నీటి బిందువును.. కానీ నా కొత్త కంపెనీ డెవప్‌మెంట్‌కు ఒక్క ఐడియా అయినా ఇవ్వండి అని అడగ్గానే.. అలాంటివేం ఉండవు ఇక్కడ వెళ్లిపో అని రాజ్‌ చెప్తాడు. రాహుల్‌ సరే అంటూ వెళ్లిపోతూ డోర్‌ దగ్గర నిలబడి ఇలా మీరు రాత్రింబవళ్లు కష్టపడి డిజైన్స్‌ వేయండి.. మీ ఐడియాలు నా కంపెనీ కోసం వాడుకుంటాను అనుకుంటూ వెళ్లిపోతాడు.

Advertisement

కానిస్టేబుల్‌ శేషు ఫోన్‌ చేసి మిస్సయిన పాప వాళ్ల డాడీ వచ్చారని చెప్పగానే.. అప్పు ఇంట్లోంచి ఎలా తప్పించుకుని వెళ్లాలి అని కళ్యాణ్‌ను అడుగుతుంది. హాస్పిటల్‌కు వెళ్తున్నామని చెప్పి వెళ్దాం అని అప్పును తీసుకుని వెళ్తాడు కళ్యాణ్‌. కింద హాల్లో కూర్చున్న అందరూ అప్పు, కళ్యాణ్‌ లను గమనిస్తారు. ఎక్కడికి వెళ్తున్నారని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. దీంతో హాస్పిటల్‌కు వెళ్తున్నామని చెప్తారు. పాత రిపోర్ట్స్‌ ఎక్కడ ఉన్నాయని ధాన్యలక్ష్మీ అడగ్గానే.. నేను ముందే కారులో పెట్టానని చెప్పి.. వెళ్లిపోతారు. కొత్త డిజైన్స్‌ తీసుకుని కావ్య, రాజ్‌ గుడికి వెళ్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×