E-Paper
Advertisement

OTT Movie : కుక్క పిల్ల మిస్సింగ్… కసాయి ముఠాకి చుక్కలు… ఓటీటీలోకి బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : కుక్క పిల్ల మిస్సింగ్… కసాయి ముఠాకి చుక్కలు… ఓటీటీలోకి బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : గత ఏడాది వీధి కుక్కల నేపథ్యంలో తెరకెక్కిన ఒక బెంగాలీ మూవీ, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పెంచుకుంటున్న ఒక వీధి కుక్క పిల్ల మిస్సింగ్ అవ్వడంతో స్టోరీ యాక్షన్ మోడ్ లోకి వెళ్తుంది. జంతువులపై జరిగే క్రూరత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇందులో బ్లడ్ బాత్ ఎక్కువగానే ఉంటుంది. ‘యానిమల్’, ‘మార్కో’ లను ఈ మూవీ గుర్తు చేస్తుంది. ఇందులో యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. జంతు ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు ? ఏ ఓటిటీలో స్ట్రీమింగ్ కాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

తథాగత ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘పరియా’ (Pariah). ఇందులో విక్రమ్ ఛటర్జీ, అంగనా రాయ్, శ్రీలేఖ మిత్ర, అంబరీష్ భట్టాచార్య లీడ్ రోల్స్ లో నటించారు. 2025 డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా ZEE5, OTTplay ప్రీమియంలో విడుదల కానుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ధాకాలో అమిత్ అనే కోపిష్టి మనుషి ఒంటరిగా జీవిస్తుంటాడు. అతనికి స్ట్రీట్ స్ట్రీట్ డాగ్స్ అంటే ఇష్టం. అతని ఇంటి ముందు ఒక బ్లాక్ పారియా డాగ్ రోజూ వచ్చి ఫుడ్ తింటుంది. అమిత్ ఆ డాగ్‌ ఇన్నోసెంట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. కానీ ఒక రోజు ఆ డాగ్ ఒక్కసారిగా మిస్సింగ్ అవుతుంది. అమిత్ భయంతో ఊరంతా తిరిగి చూస్తాడు. కానీ ఎక్కడా కనిపించదు. అప్పుడు అతనికి ఇది ఒక శక్తివంతమైన కుక్కల అక్రమ రవాణా ముఠా పనిగా తెలుస్తుంది. ఆ ఊరి లోకల్ క్లబ్ మెంబర్స్ స్ట్రీట్ డాగ్స్‌ని క్యాచ్ చేసి, కుక్క మాంసం తయారు చేసి అమ్ముతున్నారని షాక్ అవుతాడు. ఇది మన దేశంలో జరుగుతుందా? డాగ్స్‌కి విలువ లేదా? అని బాధపడతాడు. అతను ఒక్కడిగా పోరాడటం మొదలుపెడతాడు.

Read Also :  తాగిన మత్తులో భర్తకి షాకిచ్చే భార్య … ప్రియుడితోనే బాగుందంటూ … మొత్తం అలాంటి సీన్లే

Advertisement

పోలీస్ స్టేషన్‌కి వెళ్తే న్యాయం జరగదు. అమిత్ క్లబ్ మెంబర్స్ ఎవరు ? వాళ్లు ఎక్కడ డాగ్స్ క్యాచ్ చేస్తారు ? మీట్ ఎక్కడ అమ్ముతారు ?అని ట్రాక్ చేస్తాడు. అక్కడ కుక్కలను వేలాడదీసిన దృశ్యాలు చూసి చలించిపోతాడు. దీంతో కోపం కట్టలుతెంచుకుని, అమిత్ ఒక్కొక్కరిని వేటాడి చంపుతాడు. క్లైమాక్స్ లో బ్లడ్ బాత్ ఎక్కువగానే ఉంటుంది. చివరికి అమిత్ వీధి కుక్కలకు న్యాయం చేస్తాడా ? తను పెంచుకుంటున్న కుక్క పిల్లను కనిపెడతాడా ? అనే విషయాలను, ఈ బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×