E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అంజలిని సేవ్ చేసిన అప్పు  

Brahmamudi Serial Today December 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అంజలిని సేవ్ చేసిన అప్పు  
Advertisement

Brahmamudi serial today Episode:  

ఒకావిడను రౌడీలు తరుముకుంటూ వస్తారు. పరుగెత్తుకుంటూ ఆమె అప్పు దగ్గరకు వెళ్లుంది. అప్పు పోలీసులతో మాట్లాడుతూ ఉంటుంది. పోలీసులను చూసిన రౌడీలు పారిపోతారు. ఏమైందని అప్పు ఆమెను అడిగితే తన మెడలో చైన్‌ కొట్టేయడానికి ప్రయత్నించారు మేడం. నేను తప్పించుకుని పరుగెత్తుకుంటూ ఇక్కడకు వచ్చాను అని చెప్తుంది. ఎక్కడ  ఉంటారు మీరు అని అప్పు అడగ్గానే.. పక్కనే ఉన్న సుభాష్‌ నగర్‌లో ఉంటాను మేడం అని చెప్తుంది ఆవిడ. అయితే వాళ్లు ఇంకేం రారు మీరు వెళ్లండి అని అప్పు చెప్పగానే.. ఆవిడ భయపడుతుంది. దీంతో అప్పు సరే మేము నిన్ను డ్రాప్‌ చేసి వెళ్తాం పద అని తన కారులో తీసుకెళ్లి డ్రాప్‌ చేస్తుంది అప్పు.

దీంతో ఇంత దూరం వచ్చారు మాఇంట్లోకి వచ్చి ఓ కాపీ తాగి వెళ్లండి మేడం అని అడుగుతుంది ఆవిడ. అయ్యో టైం లేదండి.. వెళ్లాలి.. అంటుంది అప్పు.. దీంతో ఆవిడ ఫ్లీజ్‌ మేడం.. మీరు లేకపోతే వాళ్లు నా మెడలో ఉన్న బంగారం లాక్కెళ్లేవారు. మీకు ఉట్టి థాంక్స్‌ చెప్తే సరిపోదు మేడం రండి ప్లీజ్‌ అని రిక్వెస్ట్‌ చేయగానే.. అప్పు సరే పదండి అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. ఆవిడ కాఫీ పెడుతుంటే.. అప్పు కూర్చుని అక్కడ గోడకు ఉన్న ఫోటోలు చూసి షాక్‌ అవుతుంది. అక్కడ ఫోటోలలో రేణుక భర్త అశోక్‌ ఉంటాడు. ఇంతలో ఆవిడ కాఫీ తీసుకుని రాగానే.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతుంది అప్పు.. ఆయన నా భర్త అశోక్‌ మేడం.. మా ఆయన మీకు ముందే తెలుసా..? మేడం అని అడుగుతుంది ఆవిడ.. లేదు కానీ మీకు పెళ్లి అయి ఎంత కాలం అయింది అని అప్పు అడగ్గానే.. సిక్స్‌ మంత్స్‌ అయింది మేడం అని చెప్తుంది. దీంతో పూర్తి వివరాలు తెలుసుకుంటుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లి అశోక్‌ ను వెంటనే స్టేషన్‌కు తీసుకురండి అని చెప్తుంది అప్పు. సరే అంటూ వెళ్లిపోతారు కానిస్టేబుల్స్‌..

Advertisement

మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ కలిసి రాజ్‌ చేసిన యాడ్‌ ఫిల్మ్‌ చూస్తారు. అందరూ మౌనంగా ఉంటారు. దీంతో రాజ్‌ అనుమానంగా ఏమైంది అందరూ అలా ఉన్నారు అని అడుగుతాడు. కావ్య కూడా యాడ్‌ బాగాలేదా..? అని అడుగుతుంది. దీంతో అందరూ ఒకేసారి గట్టిగా అరుస్తూ… చప్పట్లు కొడతారు. ఇంద్రాదేవి సూపర్‌ అంటుంది. అపర్ణ నాన్న యాడ్‌ సూపర్‌ గా ఉంది అంటుంది. సుభాష్‌ కూడా ఒరేయ్‌ రాజ్‌ నీ యాడ్‌ అద్బుతంగా ఉందిరా..? అంటాడు. ఇక ధాన్యలక్ష్మీ కూడా ఇంటి నిండా నగలు ఉన్నాయి కాబట్టి ఏం చేయలేకపోతున్నాను. లేదంటే ఈ డిజైన్స్‌ అన్ని నేనే కొనేసేదాన్ని రాజ్‌. అంత అద్బుతంగా ఉంది ఈ యాడ్‌ అని చెప్తుంది.

ఇక ప్రకాష్‌ కూడా రాజ్‌ ఈ యాడ్‌కు మన బిజినెస్‌కు తిరుగే లేదురా..? అంటాడు. కళ్యాణ్‌ కూడా అన్నయ్య యాడ్‌ చాలా బాగుంది. అసలు ఎంతో ఎక్స్‌ఫీరియెన్స్‌ ఉన్న డైరెక్టర్‌ లా చేసేశావు అనుకో అంటాడు. ఇక సుభాష్‌ ఈ యాడ్‌ మన గోల్డ్‌ మార్కెట్‌ నే షేక్‌ చేస్తుందిరా అంటాడు. అందరూ రాజ్‌ను ఆభినందిస్తుంటే.. రాహుల్‌, రుద్రాణి ఇరిటేటింగ్‌గా ఫీలవుతారు. ఇంతలో రాజ్‌ ఏంటి నాన్నమ్మ నీకేం అనిపించింది అని అడగ్గానే.. అంతంతమాత్రంగా ఉన్న అమ్మాయినే అంతలా చూపించావు అంటే ఇక యాడ్‌ మొత్తం నన్నే చూపించి ఉంటే ఇంకెంత బాగా తీసేవాడివోరా అంటుంది. దీంతో కావ్య అమ్మమ్మ అంటుంది. అపర్ణ కల్పించుకుని ఆపండి పొగడ్తలన్నీ నా కొడుక్కేనా..? నా కొడలికి కూడా ఇవ్వండి అంటుంది. దీంతో అందరూ సంతోషంగా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ హ్యాపీగా ఉంటారు.

Advertisement

మరోవైపు అశోక్‌ను స్టేషన్‌కు పిలిచి ఇంటరాగేషన్‌ చేస్తుంది అప్పు. అంజలిని తీసుకొచ్చి రేణుకకు అప్పగిస్తుంది ప్రెస్‌ మీట్‌ పెట్టి అశోక్‌ చేస్తున్న దందా గురించి చెప్తుంది. అప్పు ప్రెస్‌మీట్‌ టీవీలో రావడం రుద్రాణి చూసి అందరిని పిలిచి చూపిస్తుంది. అది చూసిన అందరూ షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ కోపంగా చూస్తుంది. పక్కనే ఉన్న కళ్యాణ్‌ను తిడుతుంది. దీంతో కళ్యాణ్‌, రాజ్ తమకు ముందే నిజం తెలుసని తామే పంపించామని చెప్తారు. దీంతో ధాన్యలక్ష్మీ అందరినీ తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×