E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ ప్లాన్ సక్సెస్ 

Brahmamudi Serial Today December 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ ప్లాన్ సక్సెస్ 
Advertisement

Brahmamudi serial today Episode:

రాహుల్‌ పంపిన గోల్డ్‌ స్మగ్లర్‌ను రాజ్‌ కోపంగా తిడతాడు. రాజ్‌ ఎప్పుడూ లాభాల కోసం బిజినెస్‌ చేయలేదురా..? జనం కంపెనీ మీద పెంచుకున్న అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి బిజినెస్‌ చేశాడు. అలాంటిది నా కంపెనీకే వచ్చి నా ముందుకే వచ్చి స్మగుల్ గోల్డ్ కొనమనడానికి ఎంత ధైర్యంరా నీకు ఇంకొక సెకండ్‌ ఇక్కడు ఉన్నావంటే నెక్ట్స్‌ సెకన్‌ జైళ్లో ఉంటావు..  అంటూ తిట్టగానే.. సార్‌ ఇదే మీ ఆఖరి నిర్ణయమా..? అనగానే పోరా బయటికి అంటాడు రాజ్‌. అతను వెళ్లిపోతాడు.

రాహుల్‌ రెడీ అవుతుంటే.. స్వప్న వస్తుంది. ఏం చేస్తున్నావు రాహుల్‌ అని అడుగుతుంది. కనిపించడం లేదా రెడీ అవుతున్నాను అంటాడు రాహుల్‌. దీంతో స్పప్న షాక్‌ అవుతుంది. ఏంటి రాహుల్‌ ఏం మాట్లాడుతున్నావు అని అడగ్గానే.. అదే స్వప్న రెడీ అవుతున్నాను అని చెప్తున్నాను.. అనగానే.. నువ్వు ఆఫీసుకు వెళ్తున్నావా..? రాహుల్‌ అని స్వప్న అడగ్గానే.. లేదు ఎందుకు అలా అడుగుతున్నావు అని రాహుల్‌ అడుగుతాడు. ఏం లేదు పాపను కాస్త రెడీ చేయ్‌ నేను ఇప్పుడే వస్తాను అంటూ పాపను రాహుల్‌కు ఇచ్చి వెళ్లిపోతుంది స్వప్న. దీంతో రాహుల్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతూ.. ఏంటే ఇప్పుడు నేను నిన్ను రెడీ చేయాలా..? అంటుంటే.. గోల్డ్‌ స్మగ్లర్‌ ఫోన్‌ చేస్తాడు. రాహల్‌ పాపను కాసేను నువ్వు బెడ్డు మీద కూర్చో అని కూర్చోబెట్టి ఫోన ‌లిప్ట్‌ చేస్తాడు. హలో శాండీ ఏమైంది అని అడుగుతాడు. రాహుల్‌ నువ్వు చెప్పినట్టే రాహుల్‌ దగ్గరకు వెళ్లాను. ప్రపోజల్‌ పెట్టాను అని చెప్పగానే.. మరి ఏమన్నాడు రాజ్‌ అని రాహుల్ అడగ్గానే.. ఏమంటాడు తిట్టిన తిట్టు తిట్టకుండా రిజెక్ట్‌ చేశాడు. అని చెప్పగానే..

Advertisement

ఎక్స్‌ఫెక్టేడే కదా శుభం అంటాడు రాహుల్‌. దీంతో అన్ని తెలిసి కూడా నన్ను ఎందుకు రాజ్‌ దగ్గరకు పంపించావు అని శాండీ అడగ్గానే.. నేను నీ దగ్గర దొంగ బంగారం కొనాలి కదా..? నేను నీకు కోటి రూపాయల బిజినెస్‌ ఇవ్వాలి కదా శాండి అని చెప్పగానే.. బిజినెస్‌ ఇస్తున్నావు.. బాగుంది. కానీ ఇలా ఎందుకు రాజ్‌ దగ్గరకు పంపించడం అని శాండి అడగ్గానే.. ఇలా అడిగావు బాగుంది. స్మగుల్‌ గోల్డ్‌ కొనమని నువ్వు రాజ్‌ దగ్గరకు వెళ్లావు.. అదంతా సీసీటీవీలో రికార్డు అయింది. అది నాకు కావాలి. టైం వచ్చినప్పుడు నువ్వు రాజ్‌కు బంగారం అమ్మినట్టుగా సాక్ష్యం చెప్పాలి అని రాహుల్‌ చెప్పగానే.. నేను నాలుగు రోజులు జైళ్లో రెస్ట్‌ తీసుకోవాలి అంతేగా అంటాడు శాండీ.. బయటకు తీసుకురావడానికి నేను ఉన్నాను కదా శాండీ అంటాడు రాహుల్‌. ఇంత బిజినెస్‌ ఇస్తున్నావు.. నీ కోసం ఆ మాత్రం చేయలేనా..? అయిన ఇది మనకు కామనే కదా రాహుల్‌ అంటాడు శాండీ.. ఓకే అంటూ కాల్‌ కట్‌ చేసిన రాహుల్‌ తిరిగి చూసే సరికి స్వప్న వచ్చి కోపంగా చూస్తుంది. రాహుల్‌ షాక్‌ అవుతాడు. ఇది మొత్తం విందాం ఏంటి అని మనసులో అనుకుంటూ ఏంటి స్వప్న అలా చూస్తున్నావు.. అని అడగ్గానే.. పాపను రెడీ చేయమన్నాను.. కానీ ఇంకా చేయలేదు.. ఫోన్‌లో లీనమైపోయావు అంటుంది. దీంతో రాహుల్‌ హమ్మయ్య ఇది వినలేదు.. అని ఊపిరిపీల్చుకుంటాడు.

అపర్ణ, ఇంద్రాదేవి, కావ్య గుడిలో పంతులు దగ్గర ఉంటారు. ఇంట్లో జరిగిన అశుభాలు మొత్తం చెప్తారు. అంతా విన్న తర్వాత శాస్త్రంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కానీ అమ్మాయి ఇప్పుడు గర్భిణీ తన చేతుల మీదుగా ఏ పరిహారం చేసే వీలులేదు అంటాడు. మరి ఎలా పంతులు గారు సమస్య ఉందని తెలిసి ఇలా మౌనంగా భరించాల్సిందేనా..? అని ఇంద్రాదేవి అడుగుతుంది. ఏ పరిహారం చేయకుండా పరిస్థితులను తట్టుకునేది ఎలా పంతులు గారు అని అపర్ణ అడుగుతుంది. దీంతో హోమాలు, యాగాలు సాధ్యం కాదు కానీ ప్రతి నిత్యం ఇంట్లో దేవుడికి దీపాలు వెలిగించండి.. ఈ కుంకుమ పెట్టుకోండి.. ప్రతినిత్యం స్వామివారి అష్టోత్తరం పారాయణ చేయండి.. అంతా దైవేశ్చ అంటూ పంతులు చెప్పి వెళ్లిపోతాడు.

Advertisement

రుద్రాణి కూతురు రేఖ ఫారిన్‌ నుంచి వస్తుంది. ఇంట్లోకి వస్తున్న రేఖను చూసిన రుద్రాణి భయంతో ఎదురు వెళ్లి ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చావేంటి అని అడుగుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. రుద్రాణిని తిట్టి రేఖ లోపలికి వెళ్లిపోతుంది. మరోవైపు రూంలో రాహుల్‌ పాపను రెడీ చేస్తాడు. స్వప్న వచ్చి మెచ్చుకుంటుంది. ఇందాకేంటి ఫోన్‌ మాట్లాడుతూ కంగారు పడుతున్నావేంటి..? అని అడుగుతుంది. దీంతో రాహుల్‌ షాక్‌ అవుతాడు. వెంటనే తేరుకుని మన పాప గురించి అని చెప్తాడు. తర్వాత ఆఫీసు  నుంచి వచ్చిన రాజ్‌కు గుడిలో పంతులు చెప్పిన విషయాలు చెప్పి ఇక నుంచి కావ్య ఆఫీసుకు రాదని చెప్తారు. దీంతో కళావతి ఇంట్లో ఉంటే నేను ఆఫీసులో ఎలా ఉంటాను . నేను తనను దగ్గరుండి చూసుకోవాలి కదా అంటాడు రాజ్‌. దీంతో ప్రకాష్‌ మరి ఆఫీసుకు ఎవరు వెళ్తారు అని అడగ్గానే.. సుభాష్ కూడా ఆఫీసు పనులు ఎవరు చూసుకుంటారు అని అడగ్గానే.. అపర్ణ ఇంకెవరు వెళ్తారు మీ ఇద్దరే వెళ్లాలి అని చెప్తుంది. దీంతో ఇద్దరూ షాక్‌ అవుతారు.

తర్వాత రేఖ, రుద్రాణి ఇద్దరూ గొడవ పడతారు. అప్పుడే ఏదో ఒకటి చేసి రాజ్‌ బావకు నన్ను ఇచ్చి పెళ్లి చేసుంటే నా లైఫ్‌ ఇలా ఉండేదా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో రుద్రాణి తల పట్టుకుని కూర్చుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×