E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్, రేఖను కలిపేందుకు రాహుల్ ప్లాన్ 

Brahmamudi Serial Today December 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్, రేఖను కలిపేందుకు రాహుల్ ప్లాన్ 
Advertisement

Brahmamudi serial today Episode:

రాజ్‌, రేఖను హగ్‌ చేసుకున్నాడని కావ్య వెళ్లి ఇంద్రాదేవితో ఫిర్యాదు చేస్తుంది. దీంతో ఇంద్రాదేవి అదేదో పిజ్జానో బర్గరో అడిగితే తీసుకొచ్చి ఇచ్చాడు. దానికి అడి కౌగిలించుకుంటే దానికే నువ్విలా అనుమానపడాలా..? వాడితో అంతలా ఆడుకోవాలా..? అని ప్రశ్నిస్తుంది. దీంతో కావ్య ఏం మీ మనవడు ఫీల్‌ అయిపోయాడని మీకు పొడుచుకువచ్చిందా..? అని కావ్య అడగ్గానే.. కాదా మరి నా మనవడు శ్రీరామచంద్రుడు అని నీకు తెలియదా..? నిజం చెప్పు అని అడుగుతుంది ఇంద్రాదేవి. అయ్యో అమ్మమ్మ నా మొగుడు గురించి నాకు తెలియదా చెప్పండి.. ఆయన కళ్లల్లో కావ్య.. మనసులో కావ్య, ఒళ్లంతా కావ్య జపమే కదా అంటుంది.

దీంతో ఇంద్రాదేవి అమ్మదొంగా మరి ఎందుకు వాడిని అలా బాధపెడుతున్నావు.. అని అడుగుతుంది. అమ్మమ్మ ఇన్ని రోజుల నుంచి మీ మనవడిని ఏడిపించే అవకాశమే రాలేదు. ఇప్పుడు దొరికింది మరి వదిలిపెడితే ఎలా..? అని కావ్య అడగ్గానే.. అమ్మ నీ కడుపు బంగారం కాను.. నిద్ర లేచిన దగ్గరి నుంచి నీ కొంగు పట్టుకుని తిరిగుతూ నీకు సేవలు చేస్తున్నాడు కదే  సరిపోవడం లేదా..? అంటుంది ఇంద్రాదేవి. ఎలా సరిపోతుంది అమ్మమ్మ నాకు సేవలు చేస్తుంటే.. ఆయనకు టైం పాస్‌.. కానీ నాకు టైం పాస్‌ కావాలి కదా..? అందుకే కాస్త ఏడిపించే పని పెట్టుకున్నాను.. అమ్మమ్మ నాకు రేపు డెలివరీ అయ్యాక పుట్టిన బిడ్డ వాడి పెంపకం.. అంటూ బిజిగా ఉంటాను.. ఇక మీ మనవడితో ఆడుకునేది ఎప్పుడు..? అవకాశం వచ్చినప్పుడే వాడుకోవాలి. ఈ మగవాళ్లను టైం వచ్చినప్పుడే ఆడుకోవాలి. మళ్లీ టైం దొరకదు.. అని చెప్పగానే.. ఇంద్రాదేవి నవ్వుతూ ఎంతటి కిలాడివే నువ్వు.. అంటుంది. అమ్మమ్మ గారు ఈ మాటలు అప్పుడే లీక్ చేయకండి.. సార్‌కు ముందు ముందు డోస్‌ పెంచేది ఉంది సరేనా అంటూ కావ్య వెళ్లిపోతుంది. అమ్మ నా మనవరాలు నువ్వు మామూలు దానివి కాదే అనుకుంటుంది.

Advertisement

రాహుల్, శాండీ దగ్గరకు వెళ్లి దొంగ బంగారం తీసుకుంటాడు. ఆ గోల్డ్‌ను రాజ్‌ కారులో పెట్టాలని అనుకుంటాడు. మరోవైపు రాజ్‌, భోజనం తీసుకెళ్లి బతిమాలి కావ్యకు తినిపిస్తుంటాడు. చాటు నుంచి రేఖ చూసి ఇరిటేట్‌ అవుతుంది. ఇక రాత్రికి ఇంటికి వచ్చిన రాహుల్‌ దొంగ బంగారం ఉన్న బ్రీప్‌కేస్‌ పట్టుకుని రాజ్‌ కారు దగ్గరకు వెళ్లి ఎలాగైనా ఈ రోజు రాత్రికి ఎవ్వరూ చూడకుండా ఈ గోల్డ్ రాజ్‌ కారులో పెట్టాలి అని అనుకుంటుంటే అప్పు వచ్చి రాహుల్‌ అని పిలుస్తుంది. అప్పును చూసిన రాహుల్‌ షాక్‌ అవుతాడు. ఏంటి ఇక్కడ నిలబడ్డావు అని అప్పు అడిగితే ఏం లేదు ఇప్పుడే బయటి నుంచి వచ్చాను అందుకే ఇలా నిలబడిపోయాను అని చెప్తాడు. అది సరే ఎందుకని ఇందాకటి నుంచి ఎందుకలా  రాజ్‌ బావ కారు చూస్తున్నావు అని అడుగుతుంది అప్పు. దీంతో షాక్‌ అయిన రాహుల్‌ తడబడుతూ.. నేనా రాజ్‌ కారు వైపు చూస్తున్నానా..? అని అడగ్గానే..

అవును ఎందుకలా చూస్తున్నావు అని అప్పు అడుగుతుంది. దీంతో రాహుల్‌ రాజ్‌ కారు బాగుంది కదా తొందరలో ఇలాంటి కారు కొందామని.. అందుకే చూస్తున్నాను అప్పు.. ఏదైనా కొనే ముందే బాగా చూసి కొనాలి అంటాడు. దీంతో అప్పు రాజ్‌ బావ ఈ కారు కొని చాలా రోజులైంది. ఇప్పుడు కొనడమేంటి..? అంటుంది. దీంతో రాహుల్‌ అంటే ఇన్ని రోజులు దృష్టి పెట్టలేదు.. అందుకని.. అని చెప్తుంటే.. ఓకే మరి ఎందుకని అంతలా కంగారుపడుతున్నావు.. అని అడుగుతుంది.. దీంతో కంగారా..? నేనా..? అదేం లేదే అంటాడు రాహుల్‌. నువ్వు కంగారు పడకపోతే ముఖం నిండా ఆ చెమటలు ఏంటి..? అని అడగ్గానే.. రాహుల్‌ భయంగా వామ్మో ఈ బుడ్డది ఏంటి నన్ను పట్టుకుంది. అయినా ఇది నా ఫోకస్‌ చేసిందేంటి..? దీన్నుంచి ఎలా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ ముఖం మీద చెమట కాదు జిడ్డు అని చెప్తాడు. చేతిలో ఆ బ్రీప్‌ కేస్‌ ఏంటి..? అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు.. అని అడుగుతుంటే.. ఇంతలో అక్కడకు స్వప్న వచ్చి అడగవే ఇంకా అడుగు అయిపోయాయా నీ ప్రశ్నలు ఇంకా ఉన్నాయా..? అంటుంది.

Advertisement

రాహుల్‌ మాత్రం హమ్మయ్య ఇది టైంకు వచ్చింది అని మనసులో అనుకుంటాడు. అప్పు అది కాదు అక్క నేను అంటూ ఏదో చెప్పబోతుంటే.. ఏది కాదే నువ్వు పోలీస్‌.. కానీ మా ఆయన క్రిమినల్‌ కాదు.. అని చెప్పగానే.. అది కాదు అక్కా ఇందాక రాహుల్‌ అని ఏదో చెప్పబోతుంటే.. రాహుల్‌ కాదు బావ.. ఇప్పటి నుంచి బావ అని పిలువు అంటుంది స్వప్న. దీంతో అప్పు సరే సారీ బావ టెన్షన్‌ పడుతుంటే.. అనగానే.. దొంగలా కనిపించాడా..? అందుకే ప్రశ్నిస్తున్నావా..? అని స్వప్న తిడుతుంటే.. కరెక్టుగా అడిగావు స్వప్న.. అమ్మో ఎన్ని ప్రశ్నలో.. నీ చెల్లి లాయర్‌ అవ్వాల్సింది. పోలీస్‌ అయింది అంటుంటే.. అప్పు అసలు నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు అంటుంది. దీంతో స్వప్న కోపంగా ఏంటే నీకు సమాధానం చెప్పేది. నువ్ఉవ అందరినీ దొంగల్లా చూస్తుంటే.. నీకు అందరూ సమాధానం చెప్తారా..? అంటుంటే.

రాహుల్‌ చెప్తానులే స్వప్న అంటూ తన ఫ్రెండ్‌ ఊరెలుతూ.. నాకు ఇచ్చి వెళ్లాడు అని చెప్తాడు. వచ్చిందా సమాధానం అంటూ రాహుల్‌, స్వప్న లోపలికి వెళ్లిపోతారు. తర్వాత రేఖ బాధపడుతుంటే.. రాజ్‌ వెళ్లి ఓదారుస్తాడు. నీకో స్నేహితుడిగా ఎప్పటికీ తోడుంటాను అని ప్రామిస్‌ చేస్తాడు.  ఇక అప్పు, కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి రాహుల్‌ గురించి చెప్తుంది. తనకు ఎందుకో అనుమానంగా ఉందంటుంది. నువ్వు పోలీస్‌లా ఆలోచిస్తున్నావు కాబట్టే నీకు అలా అనిపిస్తుంది అంటాడు కళ్యాణ్‌. తర్వాత రుద్రాణి, రేఖ, రాహుల్‌ ముగ్గురు కలిసి రేఖను రాజ్‌కు దగ్గరయ్యేలా చేయాలనుకుంటారు. అందుకోసం ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×