E-Paper
Advertisement

Smartphone Comparison: రియల్‌మీ నార్జో 90 vs రెడ్‌మి 15 vs ఇన్‌ఫినిక్స్ నోట్ 50s 5G+.. రూ.18000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: రియల్‌మీ నార్జో 90 vs రెడ్‌మి 15 vs ఇన్‌ఫినిక్స్ నోట్ 50s 5G+.. రూ.18000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?
Advertisement

Realme Narzo 90 5G vs Redmi 15 5G vs Infinix Note 50s 5G+ Comparison| రియల్‌మీ బ్రాండ్ ఇటీవల ఇండియాలో రియల్‌మీ నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెడ్‌మీ 15 5G, ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+తో నేరుగా పోటీ పడుతోంది. మూడు ఫోన్లు మిడ్-రేంజ్ కొనుగోలుదారులను లక్ష్యంగా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. ఆధునిక డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీలు ఇస్తున్నాయి. ప్రతి ఫోన్ వేర్వేరు రకాల యూజర్లకు అనువుగా ఉంది.

ధర

రియల్‌మీ నార్జో 90 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.16,499. 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ.18,499.
రెడ్‌మీ 15 5G కూడా రెండు వేరియంట్లలో వస్తుంది. 6GB + 128GB ధర రూ.15,999. 8GB + 128GB వేరియంట్ ధర రూ.16,999.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+లో 6GB + 128GB ధర రూ.16,999. 8GB + 128GB ధర రూ.17,999.
ధర వేరియంట్స్ పరంగా రెడ్‌మీ ముందుంది.

డిస్‌ప్లే ఫీచర్లు పోలిక

Advertisement

రియల్‌మీ నార్జో 90 5Gలో 6.57 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+, 120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
రెడ్‌మీ 15 5Gలో పెద్ద 6.9 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+లో 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+, 144Hz రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
రెడ్‌మీ డిస్‌ప్లే పెద్దది, రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువ.

బ్యాటరీ, చార్జింగ్ పోలిక

రియల్‌మీ నార్జో 90 5Gలో భారీ 7,000mAh బ్యాటరీ ఉంది. 60W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
రెడ్‌మీ 15 5Gలో కూడా 7,000mAh బ్యాటరీ ఉంది. 33W చార్జింగ్, 18W రివర్స్ చార్జింగ్ ఇస్తుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+లో 5,500mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
బ్యాటరీ రంగంలో రియల్ మీ క్లియర్ విన్నర్.

సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

రియల్‌మీ నార్జో 90 5G ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0పై రన్ అవుతుంది. కస్టమైజేషన్, స్మూత్ యానిమేషన్స్ ఫోకస్ చేస్తుంది.
రెడ్‌మీ 15 5G ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 ఉంది. పనితీరు, ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్ మీద దృష్టి పెడుతుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 ఉంది. ఎక్కువ కస్టమైజేషన్, యుటిలిటీ ఫీచర్లు ఇస్తుంది.

ప్రాసెసర్ పనితీరు

రియల్‌మీ నార్జో 90 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మాక్స్ ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులు, మోడరేట్ గేమింగ్ బాగా హ్యాండిల్ చేస్తుంది.
రెడ్‌మీ 15 5Gలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ఉంది. స్టేబుల్ పనితీరు, మంచి పవర్ ఎఫిషియెన్సీ ఇస్తుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ఉంది. మూడింటిలో బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇన్ఫినిక్స్ దే.

కెమెరా సెటప్

రియల్‌మీ నార్జో 90 5Gలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. 2MP మోనోక్రోమ్ సెన్సార్, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
రెడ్‌మీ 15 5Gలో 50MP రియర్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+లో 64MP రియర్ కెమెరా ఉంది. డెప్త్ ఎఫెక్ట్ సెన్సార్, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీలో మోసం.. కొత్త ల్యాప్‌టాప్‌కు బదులు ఏం వచ్చిందంటే

కనెక్టివిటీ ఆప్షన్లు

రియల్‌మీ నార్జో 90 5Gలో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, USB టైప్-C, GPS ఉన్నాయి.
రెడ్‌మీ 15 5Gలో 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, USB టైప్-C ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+లో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C ఉన్నాయి. ఇన్ఫినిక్స్ లో అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.

ఫైనల్ విన్నర్ ఎవరు?

రియల్‌మీ నార్జో 90 5G బలమైన బ్యాటరీ లైఫ్ కావాల్సిన వాళ్లకు బెస్ట్. రెడ్‌మీ 15 5G.. ధర, బ్యాలెన్స్‌డ్ పనితీరు, వాల్యూ కావాల్సిన వాళ్లకు సూట్ అవుతుంది. ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ బెటర్ పనితీరు, డిస్‌ప్లే కావాల్సిన వాళ్లకు అనువుగా ఉంటుంది. మీ ఉపయోగం ఆధారంగా ఎంచుకోండి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×