E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కిడ్నాప్‌ వీడియో చూసిన ధాన్యం

Brahmamudi Serial Today February 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కిడ్నాప్‌ వీడియో చూసిన ధాన్యం
Advertisement

Brahmamudi serial today Episode: 

కళ్యాణ్‌ పేరు మీద సగం ఆస్థి రాసి డాక్యుమెంట్స్‌ ఇచ్చినా ధాన్యలక్ష్మీ గొడవ ఆపదు. దీంతో అందరూ కలిసి ధాన్యలక్ష్మీని తిడతారు. ధాన్యలక్ష్మీ మాత్రం తన పంథాను మార్చుకోదు. దీంతో కావ్య కోపంగా.. ట్రస్ట్ అన్నది తాతగారి కల, ఈ ఇంటి వారసుడిగా నా భర్త, ఈ ఇంటి కోడలిగా నేను ఉన్నందుకు ఆ పెద్దమనిషి కోరిక తీర్చనివ్వండి అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. ఈ ట్రస్ట్ ఆగిపోకూడదు, భవిష్యత్‌లో మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా.. దుగ్గిరాల ఇంటిపేరు శాశ్వతంగా నిలిచిపోవాలని మా తాపత్రయం అంటుంది. ఇన్నేళ్లుగా మనమంటూ పెద్దగా ఎవరికీ ఏం చేయలేదు, అందుకే ఎంత కష్టపడైనా సరే ఈ ట్రస్ట్ పెట్టాలని అనుకుంటున్నాం.. ఉమ్మడి ఆస్తిని దానం చేయాలనో, మా ఆస్తిని కాపాడుకోవాలనో, కళ్యాణ్‌కు అన్యాయం చేయాలనో అనుకోవడం లేదు అంటూ కావ్య చెప్పగానే..

ధాన్యలక్ష్మీ కోపంగా ఇక మీ నాటకాలు ఆపండి.. నటించడం మీ ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. అందుకే ట్రస్ట్ అన్నారు, పేరు అన్నారు.. ఇప్పుడు నా కొడుకు మీద ఆస్తి రాసిచ్చినట్లు నటించి నా కడుపు మీద తన్నారు అంటూ తిడుతుంది. దీంతో రాజ్‌ ఏం మాట్లాడుతున్నావు పిన్ని.. నువ్వు కోరుకున్నట్లే చేశాం కదా ఎందుకు మమ్మల్ని తిడుతున్నావు అని అడగ్గానే.. ధాన్యలక్ష్మీ కోపంగా మీరు ఆస్తి ఇవ్వడం ఇష్టం లేక.. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలేక ఇక్కడ ఆస్తి కాగితాలు నా చేతిలో పెడుతూ.. అక్కడ నా కొడుకు, కోడలి జీవితాలు నాశనం చేయాలని అనుకుంటున్నారా..? అంటుంది. ధాన్యలక్ష్మీ మాటలకు అందరూ షాక్‌ అవుతారు.. ధాన్యలక్ష్మీ ఏం మాట్లాడుతున్నావు.. అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా..? అంటూ కోప్పడుతుంది ఇంద్రాదేవి.

Advertisement

దీంతో ధాన్యలక్ష్మీ నేను మతి ఉండే మాట్లాడుతున్నాను అత్తయ్యా.. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే మతి పోతుంది. అక్కా నీ కొడుకు కోడలు ఎంత ఘనకార్యం చేశారో మీరూ చూసి తరించండి అంటూ ఫోన్‌ లో రుద్రాణి తనకు సెండ్‌ చేసిన కిడ్నాప్‌ వీడియో చూపిస్తుంది. అందులో రౌడీలు అప్పు, కళ్యాణ్‌ లను కిడ్నాప్‌ చేసి బంధించి ఉంటారు. అది చూడగానే అందరూ షాక్‌ అవుతారు. అప్పుడే వీడియో రౌడీలు మాట్లాడుకుంటుంటారు. అప్పు, కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని.. రాజ్‌ సార్‌ వార్నింగ్ ఇచ్చారు.. ఒకవేళ వీళ్లు తప్పించుకుంటే మాత్రం రాజ్‌ సార్‌ మనల్ని చంపేస్తాడని  రౌడీలు మాట్లాడుకోవడం అందరూ వింటారు.. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటే.. ధాన్యలక్ష్మీ కోపంగా చూస్తుంది. ఆస్తిని ఎక్కడ పంచి ఇవ్వాల్సి వస్తుందోనని నా కొడుకు, కోడల్ని మీరిద్దరూ కిడ్నాప్ చేశారు. మీరు అనుకున్నది సాధించడానికి నేను అడ్డుపడుతున్నానని.. ఎవరి భవిష్యత్ కోసమైతే నేను పోరాడుతున్నానో వాళ్లనే లేకుండా చేస్తే మీకు ఏ సమస్య లేకుండా ఉంటుందని ఇంతకి తెగించారు అంటూ తిడుతుంది.

దీంతో కావ్య, రాజ్‌ స్టక్ అయిపోతారు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూండిపోతారు. కొంత సేపటి తర్వాత షాక్‌ నుంచి తేరుకుంటారు.. ఇదంతా అబద్దం మేము కిడ్నాప్‌ చేయడం ఏంటి పిన్ని అంటాడు రాజ్.. కావ్య బాధపడుతూ.. అప్పూ నా చెల్లెలు, కళ్యాణ్ నా భర్తకు తమ్ముడు.. అలాంటిది మేం వాళ్లని కిడ్నాప్ చేస్తామా? అని ప్రశ్నిస్తుంది. రాజ్‌ కావ్య ఎంత చెప్పినా ధాన్యలక్ష్మీ అసుల వినదు.. ఇదంతా మీరు పథకం ప్రకారమే చేశారు.. అందుకే ఆస్తి పేపర్లు చేతిలో పెట్టే టైంకి ఈ వీడియో పంపించేలా చేశారు అంటుంది.. దీంతో  దేవుడు మీద ప్రమాణం చేసి చెబుతున్నాం దీనికి మాకు ఏ సంబంధం లేదు అని రాజ్‌ చెప్పగానే.. మీకు, ఈ కిడ్నాప్‌కు ఏ సంబంధం లేకపోతే.. ఆ వీడియోలో రౌడీలు మీ పేరు ఎందుకు చెబుతారు? ఈ వీడియో ఎవరో తీశారు? ఇంకెవరో కిడ్నాప్ చేశారు? అనుకుంటే? మాకు కానీ, కళ్యాణ్‌కి కానీ శత్రువులు లేరు. ఎవరికి ఇంతటి అవసరం లేదు.. పోనీ డబ్బు కోసమే కిడ్నాప్ చేశారనుకుంటే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయకుండా వీడియో ఎందుకు పంపిస్తారని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది.

Advertisement

దీంతో అపర్ణ కల్పించుకుని నీ ఆవేశంతో, అవివేకంతో నా కొడుకు వ్యక్తిత్వాన్ని చంపాలని చూడొద్దు, ఇన్నాళ్లుగా చూస్తున్నావు.. నా కొడుకు, నా కోడలు ఎలాంటి వారో తెలిసి కూడా వాళ్ల మీద నిందలు వేస్తున్నావు ధాన్యలక్ష్మీ అంటూ  సీరియస్ అవుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా  ఈ సాక్ష్యాలు చూసి కూడా ఇంకా ఎందుకు గొంతెత్తున్నావు.. ఆస్తి కోసం నీ కొడుకు ఎంతకు తెగించాడో చూడు నన్ను భయపెట్టడానికి ఇంతలా దిగజారారు అనగానే.. కావ్య కోపంగా ధాన్యలక్ష్మీ గారు ఈ పని ఎవరు చేశారో మాకు తెలియదు.. కానీ మీరు మా మీద నింద వేశారు కాబట్టి.. కళ్యాణ్ – అప్పూ ఎక్కడున్నా, ఎవరి దగ్గరున్నా క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది అంటుంది కావ్య. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×