E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: గుణతో మీనా ఫైట్..రెచ్చిపోయిన బాలు.. గుణకు షాకిచ్చిన శివ..

Gundeninda GudiGantalu Today episode: గుణతో మీనా ఫైట్..రెచ్చిపోయిన బాలు.. గుణకు షాకిచ్చిన శివ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. పూలు ఇవ్వడానికి అని బయటకు వెళ్లిన మీనా తన పుట్టింటికి వెళ్తుంది.. ఏంటమ్మా అందరు బాగానే ఉన్నారా అని అడగగానే పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైందమ్మా నువ్వు అలా ఏడుస్తున్నావ్ ఎందుకు ఏం జరిగింది అని నేను అడుగుతుంది. ఏం చెప్పమంటావులేమా నాకు చెప్పుకోలేని బాధలు ఎదురవుతున్నాయి అని పార్వతి అంటుంది. సుమతికి ఏమైనా అయిందా? శివ కి ఏమైనా అయిందా? అని మీనా అడుగుతుంది. సుమతి వల్ల నాకు ఎటువంటి బాధలు లేవే నా బాధంతా శివ వల్లే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది..

ఏం జరిగిందమ్మా వాడు ఏం చేసాడు మళ్ళీ అని అనగానే ఇలా రాత్రి పార్టీ అని చెప్పి తాగేసి వచ్చాడు.ఎందుకు తాగావురా అంటే మీ అల్లుడు లాగా నేను ఏమి తాగలేదు కదా అని ఎదురు సమాధానం చెప్తున్నాడు.. నేను ఎంత చెప్పినా కూడా వాడు మా మాట వినడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మా చేజారి పోయాడు అని పార్వతి చెప్పగానే మీనా కంగారు పడిపోతుంది. అసలు వీడికి చెప్తే బుద్ధి రాదు నేనేంటో అక్కడే తేల్చుకుంటాను అని మీనా వెళ్తుంది. అక్కడితో ఎప్పుడు అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా ఎలాగైనా సరే శివకు బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. తన తల్లికి వాడి సంగతి నేను చూసుకుంటాను అని గుణ దగ్గరికి వెళ్తుంది.. పార్వతి వద్దు మీనా వాడు ఒక రౌడీ గాడు దుర్మార్గుడు వాడి దగ్గరికి నువ్వు వెళ్లి వాడితో గొడవ పడతావా ఏంటి అల్లుడు గారికి ఈ విషయం తెలిస్తే నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వడు అని పార్వతి అంటుంది.. నాకేం పర్వాలేదు అమ్మ నేను చూసుకుంటాను ముందు వాడు సంగతి ఏదో తెలుస్తానని మీనా వెళ్తుంది. మీనా నువ్వు అసలు మారవా నా తమ్ముడిని ఎందుకురా ఇలా మార్చేస్తున్నావు అని నేను అంటుంది. మొదట చాలా మర్యాదగా మాట్లాడిన గుణ ఆ తర్వాత మీనా మాటలకి రెచ్చిపోతాడు. అక్కని మర్యాదగా మాట్లాడుతున్న సరే మీదా మాత్రం నా తమ్ముడు జోలికి వస్తే మర్యాదగా ఉండదు. ఎవర్రా నీకు అక్క అని ఇంకాస్త గట్టిగా అరుస్తుంది..

నీకు దమ్ముంటే నీ తమ్ముని ఆపుకో.. వాడిని నా దగ్గరికి రాకుండా చేసుకో.. అంతే కానీ ఇలా నా దగ్గరికి వస్తే అరుస్తావ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావే అని గుణ అనడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీకు ఇలా కాదురా నీకు బుద్ధి చెప్పాల్సిందే అని మీనా గుణాన్ని కొడుతుంది. గుణ నన్నే కొడతావే నువ్వు నీకెంత ధైర్యం ఉంది అని అంటాడు. నన్నే ఏ అంటావా రా అని మీనా వాడిని ఇంకా కొట్టడానికి ముందుకు వస్తుంది కానీ వాడు మాత్రం మీనాని ఒక్కసారిగా తోసేయడంతో మీనా వెళ్లి అక్కడున్న రాక్ కి గుద్దుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు నా పెళ్ళాన్ని కొడతావ్ రా నీ అంత చూస్తాను రా.. అని గుణ చేతులు విరగ్గొడతాడు.

Advertisement

నా పెళ్ళాన్ని కొట్టి నీ చెయ్యే కదరా అని బాలు మీనాకు దెబ్బ తగిలింది అన్న ఆవేశంతో గుణ రెండు చేతులు విరిచేసి.. ఇంకొకసారి నీ చేతులు చూసుకున్నప్పుడల్లా నేనే గుర్తుకు రావాలి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇక మీనా నీ హాస్పిటల్ కి తీసుకెళ్లగానే అక్కడ డాక్టర్ కి ఎలా ఉంది అని మీనా అని అడుగుతున్న సరే బాలు చెప్పడంతో ఆమె కాస్త కోపంగా ఉంటుంది. పేషంట్ ఎవరైతే వాళ్లే చెప్పాలి మీరు చెప్పకూడదని ఎన్నిసార్లు చెప్పినా సరే బాలు మాత్రం ప్రతి దాంట్లో దూరేసి చెప్తూ ఉంటాడు. అది చూసిన డాక్టర్ మీరు కాసేపు కామ్ గా ఉంటే నేను ఆవిడని ఎలా ఉందో కనుక్కుంటాను అని అంటుంది. ఈమెకి చెవుల్లో ముక్కుల్లో అయితే బ్లడ్ రాలేదు కాబట్టి ఒకసారి స్కానింగ్ తీస్తే సరిపోతుంది అని డాక్టర్ అంటుంది.

కాస్త కింద పడిపోవడంతో నాకు తల దిమ్ముగా ఉంది అంతే డాక్టర్ ఇంకేమీ సమస్యలు లేవు అని ఎంత చెప్తున్నా సరే.. మీరు ఒకసారి స్కానింగ్ తీయించుకొని రావాల్సిందే అని డాక్టర్ చెప్తుంది. ఇప్పుడు ఈ స్కానింగ్ అవన్నీ ఎందుకండీ డబ్బులు దండగ నాకు బాగానే ఉంది అని మీనా అంటుంది..

అయినా పర్వాలేదు నీకు ఏమి కాకుండా చూసుకోవాలి ముందు అదేదో తెప్పిస్తే మనకు ఎటువంటి అనుమానం లేకుండా పోతుంది కదా అని బాలు అంటాడు. ఇక తర్వాత బాలు మీనా న్యూస్ స్కానింగ్ పంపిస్తాడు. అప్పుడే పార్వతి ఫోన్ చేసి ఏమైంది అల్లుడుగారు అని అడుగుతుంది. మీరు నాకు టైం కి ఫోన్ చేశాడు. వాడు మీనా నీ తోయడంతో మీనా కి దెబ్బ తగిలింది. హాస్పిటల్ లో ఉన్నాము నేను సుమతికి లొకేషన్ పంపిస్తాను మీరు రండి అని చెప్తాడు. మీనా తలకి దెబ్బ తగిలిందా అని బాధపడిపోతూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇంటికి వచ్చిన శివ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు తాగొచ్చావని మీనాతో చెప్పడంతో ఆ గుణ దగ్గరికి వెళ్లింది. వాడు మీ అక్కని తోయడంతో కింద పడిపోయి తలకి దెబ్బ తగిలింది అంట. హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తుంది.. ఇదంతా నీ వల్లే నువ్వు నా కడుపుని పుట్టకపోయినా బాగుండేది కదరా అని శివని కొడుతుంది పార్వతి.. అక్కకి ఏమైందో తెలుసుకోవాలి అని అంటాడు.

గుణ దగ్గరికి వెళ్లిన శివ మా అక్కని ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. మా అక్క ఇప్పుడు హాస్పిటల్ లో ఉంది తెలుసా? నీకు అని అనగానే గుణ మనిషి ఆ బాలు కొట్టడం వల్లే అన్నయ్య రెండు చేతులు పైకి ఎత్తలేకపోతున్నాడు అని అంటాడు. మా బావ కాబట్టి చేతులించేసాడు. ఇంకొకసారి మా అక్క జోలికి వెళ్తే ప్రాణం కూడా తీస్తాడు అది గుర్తుపెట్టుకొని శివ అనడంతో గుణ షాక్ అవుతాడు. నువ్వేంటి శివ ఇలా మాట్లాడుతున్నావు అని అంటే మా అక్కంటే నాకు ప్రాణం మా అక్క జోలికి ఎవరైనా వస్తే ఇంతే. ముందు మా అక్కకి క్షమాపణ చెప్తేనే నేను నీతో మాట్లాడతాను.. లేకపోతే అసలు మాట్లాడను అని అతనికి వెళ్ళిపోతాడు. హాస్పిటల్ కి వెళ్లిన వాళ్ళందరూ కలిసి మీనా తో మాట్లాడతారు. కానీ మీద మాత్రం శివ తో మాట్లాడడానికి ఇష్టపడదు.

Also Read :సాగర్ డబ్బుల మ్యాటర్ బయటపడుతుందా..? ప్రేమకు సపోర్ట్ గా వేదవతి.. ట్విస్ట్ ఇదే..

నువ్వంటే నాకు ఇష్టం అక్క నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే ఆ గుణకి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. ఇకమీదట నేను వాడి దగ్గరికి వెళ్ళను బాగా చదువుకుంటాను అని మాటిస్తాడు. అది చూసిన బాలు వీడు ఇక మారతాడు అన్న నమ్మకం నాకు లేదు ఏమైనా చేసుకోని నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కట్టుతో ఇంటికి వచ్చిన మీనాన్ని చూసిన సత్యం కంగారు పడిపోతాడు. బాలు వల్లే ఇదంతా జరిగింది అని మొదట అపార్థం చేసుకున్న సరే ఆ తర్వాత మీనా చెప్పిన నిజాన్ని విని బాధపడతాడు.. ఇక మీనా కట్టుతో వచ్చిందని చూసిన ప్రభావతి ఏమైంది అని అడుగుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ప్రభావతి మీనాన్ని రెస్ట్ తీసుకోమని చెప్తుంది.. వంట నేను చేస్తానని వెళ్తుంది అది చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×