BigTV English

Brahmamudi Serial Today January 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్:   చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న నంద – సావిత్రికి చుక్కలు చూపించిన రాజ్‌  

Brahmamudi Serial Today January 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్:   చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న నంద – సావిత్రికి చుక్కలు చూపించిన రాజ్‌  

Brahmamudi serial today Episode:  తాము కిడ్నాపర్లమని.. నేను ప్లాన్‌ చేసి కిడ్నాప్‌ చేస్తే మా మేడం డబ్బులు డిమాండ్‌ చేస్తుందని రాజ్‌ చెప్పగానే.. సావిత్రి షాక్‌ అవుతాడు. కిడ్నాపర్లను సినిమాల్లో తప్పా ఎక్కడా చూడలేదని దయచేసి నన్ను వదిలేయండి అంటూ భయపడుతుంటాడు. కారు ఆపండి ప్లీజ్‌ అంటూ అడగ్గానే.. నేను ఆపను కనీసం కోర్టులో గెలిచిన మీ తాత ఇల్లునైనా మాకు రాసివ్వాలిగా అంటాడు రాజ్‌. సావిత్రి కారు ఆపకపోతే దూకేస్తానని బెదిరించడంతో రాజ్‌ కారు పక్కన ఆపేస్తాడు. సావిత్రి కారు దిగి పారిపోతాడు. ఆ నంద గాడి లోకేషన్‌ దొరికింది వెళ్దాం పద అని ఇద్దరూ వెళ్తారు.


నంద ఉన్న గెస్ట్‌ హౌస్‌ దగ్గరకు రాజ్‌, కావ్య వెళ్తారు. సెక్యూరిటీ ఆగండి లోపలికి ఎందుకు వెళ్తున్నారు అంటాడు. అదేంటి నువ్వు నన్ను గుర్తు పట్టలేదా..? మీ ఎండీ సార్‌ ఫ్రెండును చాలా సార్లు వచ్చాను కదా అని రాజ్‌ చెప్పగానే అంటే నేను లేకుండా మీరు చాలా సార్లు వచ్చారా..? ఎవరితో వచ్చారు.. ఎన్ని సార్లు వచ్చారు అంటూ నిలదీస్తుంది. దీంతో రాజ్ కళావతి నేను అంత గొప్ప కళాకారుడిని కానే.. నువ్వేం అనుమానపడకు, బయట పడకు అంటాడు రాజ్‌.

ఇద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటుంటే.. సెక్యూరిటీ ఏంటి సార్‌ ఇక్కడకు వచ్చి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. అదేనయ్యా నువ్వు మమ్మల్ని గుర్తు పట్టలేదని మేడం ఫీలవుతున్నారు. నేనేదో ఓదారుస్తున్నారు. నువ్వు గుర్తు పట్టకపోయినా పర్వాలేదు కానీ మీ సారు చెప్పలేదా..? ఇద్దరు వస్తారు డబ్బులు ఇవ్వాలి అని చెప్పలేదా..? అసలే మీ సారుకు డబ్బుల అవసరం చాలా ఉంది. మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఫీలవుతాడు. అని రాజ్‌ చెప్పగానే.. సరే సార్‌ మీరు లోపలికి వెళ్లి కూర్చోండి సార్‌ అని ఇద్దరిని లోపలికి పంపిస్తాడు సెక్యూరిటీ.


హాల్లో కూర్చుని రుద్రాణి, ధాన్యలక్ష్మీ గుసగుసలాడుకుంటుంటే.. ఇంతలో అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. వాళ్లను చూసిన రుద్రాణి వాళ్లు మాట్లాడుకోవడం ఆపేస్తారు. అది గమనించిన ప్రకాష్‌ మా అమ్మ వదిన వస్తే.. మీరు మాట్లాడుకోవడం మానేశారేంటి అని అడుగుతాడు. వాళ్లను చూసి మేము మాట్లాడుకోవడం ఎందుకు ఆపేస్తాము అంటుంది ధాన్యలక్ష్మీ.. ఇంతకీ అత్తా కోడలు ఎక్కడికో బయలుదేరారు అంటూ రుద్రాణి అడుగుతుంది.

ఇంకెక్కడికి వెళ్తాము హాస్పిటల్‌కు వెళ్తున్నాము.. మీకెలాగూ ఆ ధ్యాసే లేదు కదా..? అంటుంది ఇందిరాదేవి. ఇంట్లో కార్లే లేవు ఎలా వెళ్తారు అని రుద్రాణి అడగ్గానే.. సుభాష్‌కు ఫోన్‌ చేశాము వస్తున్నాడు అని ఇందిరాదేవి చెప్పగానే సుభాష్‌ వచ్చి కారు బ్రేక్‌ డౌన్‌ అయిందని.. నేనే క్యాబ్‌లో వచ్చానని చెప్పడంతో రుద్రాణి మళ్లీ కావ్యను తిడుతుంది. ఇంట్లో ఉన్న ఒక్క కారు తీసుకుని కోడలు కోడలు కొత్త కారు వేసుకుని షికార్లకు వెళ్లారు అంటుంది. సుభాస్‌ కూడా మిగతా కార్లన్నీ రిటర్న్‌ పంపించారట ఎందుకు అని అడుగుతాడు.

దీంతో ధాన్యలక్ష్మీ అత్తమామాలకు కూడా చెప్పకుండా కావ్య ఎంత పని చేసిందో చూశారా..? ఇంటి పెద్ద కొడుకైన మీకే చెప్పలేదు. ఇప్పుడు హాస్పిటల్‌ కు ఎలా వెళ్తారు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. నీ కోడలు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఇప్పటికైనా అర్థం అయిందా అక్కా అంటుంది ధాన్యలక్ష్మీ.. ఏంటమ్మా ఈ సంసారం ఇలా అయిపోయింది. ఇప్పుడు నాన్నను చూడ్డానికి మీరు ఆటోలోనో, క్యాబులోనో వెళితే మన గౌరవం ఏముంటుంది అంటుంది. ఎవరేమనుకున్నా.. నేను వెళ్లే తీరుతాను అంటూ ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.

నంద గెస్ట్‌హౌస్ లోకి వెళ్లిన రాజ్‌, కావ్య అక్కడి వెదర్‌ చూసి షాక్‌ అవుతారు. ఆ ఇల్లంతా బాగా డెకరేట్‌ ఉండటం చూసి కావ్య మీరు కావాలనే ప్లాన్‌ చేశారు కదా అంటుంది. అప్పుడు బూత్‌ బంగ్లా.. ఇప్పుడు ఈ గెస్ట్‌హౌసా.. ఇది ఆ ఎండీ గాడి గెస్ట్‌ హౌస్‌ కాదు.. మీరు ప్లాన్‌ చేసిన బూత్‌ బంగ్లాలా ఉంది అంటూ అసలు మిమ్మల్ని అంటూ రాజ్‌ను కొట్టబోతూ కాలు జారి రాజ్‌ మీద పడుతుంది.

ఇద్దరు బెడ్‌ మీద పడిపోతారు. ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్‌ జనరేట్‌ అవుతుంది. ఇంతలో కారు సౌండ ‌విని ఉలిక్కి పడతారు. వాడు వచ్చినట్టు ఉన్నాడు అని దాక్కుంటారు. తన లవర్ తో లోపలికి వచ్చిన నందను కొట్టి పట్టుకోవాలనుకుంటాడు రాజ్‌. నంద వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Brahmamudi Serial Today October 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తనది నాటకం కాదని అపర్ణ, ఇంద్రాదేవికి చెప్పిన కావ్య

Intinti Ramayanam Today Episode: నిజం చెప్పిన పల్లవి.. ఇంట్లోంచి గెంటేసిన కమల్.. అవనికి అక్షయ్ క్షమాపణలు..

GudiGantalu Today episode: రచ్చ చేసిన బాలు.. సత్యం షాకింగ్ నిర్ణయం..? కామాక్షి దెబ్బకు ఫ్యూజులు అవుట్..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు..

Serial Actress : సీరియల్స్ లో నటిస్తూనే బిజినెస్ లు చేస్తున్న యాక్టర్స్ ఎవరో తెలుసా..?

Illu Illaalu Pillalu Narmada: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నర్మద అలాంటి పని చేస్తుందా..? లక్షల్లో ఆదాయం..

Nindu Noorella Saavasam Serial Today october 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును హెచ్చిరించిన గుప్త

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్..ఇంట్లోంచి గేంటేసిన కమల్.. ఒక్కటైన అవని, అక్షయ్..

Big Stories

×