Sabarimala Bus Accident: హైదరాబాద్‌కు చెందిన అయ్యప్పస్వాముల బస్సు శబరికి వెళ్తుండగా ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఘాట్ రోడ్డులో టర్న్ చేస్తుండగా బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి చెట్లల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజు మృతి చెందగా, మరో 22 మందికి గాయాలయ్యాయి. డెడ్‌బాడీని కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ మద్దన్నపేట నుంచి.. శబరిమల యాత్రకు బయల్దేరిన అయ్యప్ప స్వాముల బస్సు.. గురువారం రాత్రి ప్రమాదానికి గురయ్యింది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొని.. బస్సు చెట్లపై పడడంతో పెనుప్రమాదమే తప్పింది.. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అందులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలు అయ్యాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బస్సును క్రైన్ సహాయంతో పక్కకు తీశారు. ప్రతి ఏడాదిలాగానే.. మద్దన్నపేట నుంచి మొత్తం 22 మంది గ్రూపు సభ్యులు.. ప్రైవేటు ట్రావెల్ బస్సు మాట్లాడుకుని బయల్దేరారు. మరొక 15 మీటర్ల దూరంలో శబరిమల యాత్రకి దగ్గరిదాకా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పంపానది వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read: కేటీఆర్ డైరెక్షన్‌లో.. ఎస్కేప్ ఫార్ములా..!
ఇదిలా ఉంటే.. చెన్నైలోని కోయంబత్తూర్‌లో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. అవినాశిలోని ఫ్లైఓవర్‌పై అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ట్యాంకర్ నుంచి లిక్విడ్ గ్యాస్ లీక్ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ పరిధిలో స్కూల్స్ బంద్ చేశారు. కొచ్చి నుంచి బీలమేడుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.