Six face rudraksha : రుద్రాంశ సంభూతుడైన పరమేశ్వరుడి స్వరూపంగా భావించేవే రుద్రాక్షలు. రుద్రుడి కన్నీటి బిందువులే భూమి మీద పడి మొక్కలుగా మొలచి.. వృక్షాలుగా మారాయని.. ఆ వృక్షాలకు కాసిన కాయలే రుద్రాక్షలని నమ్ముతారు హిందువులు. అయితే ఈ రుద్రాక్షలను ఎవరైనా ధరించేవారని.. రాక్షసులు సైతం రుద్రాక్షలు ధరంచి పూజలు చేసేవారని.. హిందూ గ్రంధాలలో చెప్పబడింది. ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఆరోగ్యం, కీర్తి, ఐశ్వర్యం, ఆయుష్షు లభిస్తాయని హిందువులు నమ్ముతారు. అయితే రుద్రాక్షలు ధరించడానికి కొన్ని విధి విధానాలను హిందు గ్రంథాలలో పొందుపరిచారు.
రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న వారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు తీరిపోతాయి. రుద్రాక్షలను వాటి కున్న ముఖాల ఆధారంగా గుర్తిస్తారు. అయితే ఆరు ముఖాలు కలిగిన రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎలా చేయాలి. అందుకు పాటించవలసిన విధి విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరు ముఖాలు కలిగిన దాన్నే షణ్ముఖి రుద్రాక్ష అంటారు. ఈ రుద్రాక్ష సుబ్రమణ్యస్వామి స్వరూపంగా భావిస్తారు. ఇది స్త్రీలు ధరించడానికి ఎంతో మంచిది. స్త్రీలలో సంతాన దోషాన్ని ఈ రుద్రాక్ష అరికడుతుంది. ఇది మెడలో వేసుకున్నవారికి తెలివితేటలు మెండుగా వస్తాయి. మనిషిలోని కోప స్వభావాన్ని ఈ షణ్ముఖి తగ్గిస్తుందని.. అగ్ని ప్రమాదాలను అరికడుతుందట. వ్యవసాయ దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయట. ఇది ధరించినవారికి అధిక జ్ఞానాన్ని ఇస్తుందట. మరియు అన్ని రకాల మానసిక సమస్యలను దూరం చేస్తుందట. ఆరు ముఖాలున్న రుద్రాక్ష ధారణ వల్ల మనుషులలో ప్రేమ, దయ, ఆకర్షణ వంటి భావోద్వేగ లక్షణాలను పెంపొందిస్తుందట.
షణ్ముఖి రుద్రాక్ష చాలా శక్తివంతమైనది. ఇది ధరించిన వారికి బ్రహ్మహత్యా దోషం ఉన్నా ఆ దోషం నుంచి వారిని బయటపడేస్తుందట. కుజదోషం, సర్పదోషం ఉన్నవారు తప్పని సరిగా ఆరు ముఖాల రుద్రాక్ష ధారణ చేయాలట. కుమార స్వామి స్వరూపమైన ఈ రుద్రాక్ష ధారణ మనుషుల్లో ధైర్యసాహసాలను మెల్కోలపడమే కాకుండా.. మేథాశక్తిని, బుద్ది బలాన్ని కలిగిస్తుందట. విద్యావ్యాపారాలలో ముందుకు నడిపిస్తుందట. ఇది కళాత్మక లక్షణాలు, వ్యక్తీకరణ శక్తి మరియు వ్యక్తిత్వ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. ఇది ధరించడం వల్ల మనుషుల్లో వచ్చే డయాబెటిస్ మరియు థైరాయిడ్లను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మగవారిలో ప్రోస్టేట్ గ్రంధులను బలపరుస్తుంది. ఇది మహిళల్లో స్త్రీ జననేంద్రియ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నరాలు మరియు కండరాల పనితీరును బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఏ ఏ నక్షత్ర వ్యక్తులు షణ్ముఖి తప్పకుండా ధరించాలి:
భరణి నక్షత్రం లో పుట్టిన వ్యక్తులు తప్పనిసరిగా షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలంట. అందువల్ల ఆ వ్యక్తులకు శక్తి, శక్తి, జ్ఞానం ఆరోగ్యం సిద్ధిస్తుందగ. ఇక పుబ్బ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు కూడా ఆరు ముఖాల రుద్రాక్షను మెడలో వేసుకోవాలట. ఇది ధరించడం వల్ల పుబ్బా నక్షత్ర జాతకులకు అపారమైన జ్ఞానం, సకల సంపదలు, ఆరోగ్యం సిద్ధిస్తాయట. పుర్వాషాడ నక్షత్ర జాతకులు కూడా ఈ రుద్రాక్షను ధరించడం చాలా మంచిదట. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్లు షణ్ముఖి ధరించడం వల్ల జీవితంలో ఏ పనిలోనైనా విజయం వీరిని వరిస్తుందట. ఇంకా వీరికి జ్ఞానం, కీర్తి, అద్బుతమైన సంతానం సిద్ధిస్తాయట.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు:
రుద్రాక్షలు ధరించిన వారు తప్పనిసరిగా కొన్ని నియమ, నిబంధనలు పాటించాలి. రుద్రాక్షలు ధరించి తర్వాత మద్యం సేవించకూడదు. మాంసాహారాలు తినకూడదు. ప్రతి నిత్యం తప్పనిసరిగా శుచి శుభ్రతలు పాటించాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. నియమ నిష్ఠలను పాటించాలి. నిద్రపోయే సమయంలో రుద్రాక్షలు ధరించకూడదు. మరీ ముఖ్యంగా దంపతులు దాంపత్య సమయంలో రుద్రాక్షలు ధరించరాదు. అప్పుడే పుట్టిన శిశువులకు కూడా రుద్రాక్ష ధారన చేయకూడదు. రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి సత్ఫలితాలు కలుగుతాయి.