E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు కోసం ధర్నాకు దిగిన ఇందు 

Brahmamudi Serial Today Episode July 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు కోసం ధర్నాకు దిగిన ఇందు 
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు ఎలాగైనా రాజును తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే.. రాజు మాత్రం రానని చెప్తాడు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అనగానే.. అయితే ఇక్కడే ఉండు మనిద్దరికి నిజంగానే పెళ్లి అయిందని ఫస్ట్‌ నైట్‌ చేశారనుకో నీ జీవితమే పోతుంది అనగానే.. అవునా అది చూస్తాను బావ అంటూ కాలు మర్దన చేస్తుంది.

భ్రమరాంబ కోపంగా నందును తిడుతూ.. రేఖ ఇంకా రాలేదు.. రేఖ రాగానే.. ఆ నందు మీద కంప్లైంట్‌ ఇవ్వాలి అనుకుంటుండగానే.. రేఖ కంగారుగా వస్తుంది. వదిన మనం అనుకున్నట్టు జరగలేదు. యాక్సిడెంట్‌ జరిగింది కానీ రాజు చావలేదు.. బతికే ఉన్నాడు.. ఏంటి వదిన ఏదో మౌనవ్రతం చేస్తున్నట్టు నోరు తెరచి చెప్పు అనగానే.. భ్రమరాంబ సైగలు చేస్తుంది. రేఖ కోపంగా అసలు ఏమైంది వదిన నీకు అని అడగ్గానే.. అప్పుడే శేషు వస్తూ.. నోరు అతుక్కుపోయింది చెల్లెమ్మ అని చెప్తాడు. అసలు నోరు అతుక్కుపోవడం ఏంటి అని రేఖ అడిగితే భ్రమరాంబ నందు ఉప్మాలో గమ్‌ కలిపింది అంటూ సైగలు చేస్తూ చెప్తుంది. రేఖ నీ సైగలు నాకు అర్థం కావడం లేదు వదిన అనగానే.. నేను చెప్తాను చెల్లెమ్మ.. చెప్పు భ్రమరం చెల్లెమ్మకు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది నేను చెప్తాను.. అనగానే..

Advertisement

భ్రమరాంబ సైగలు చేస్తుంటే.. శేషు చెల్లెమ్మ భ్రమరానికి ఉప్మా నచ్చలేదు.. భ్రమరాంబ కోపంగా సైగ చేస్తుంది. మరేంటి నోరు.. దాహంగా ఉందా..? ఆకలిగా ఉందా.? అంటూ ఆట పట్టిస్తుంటాడు శేషు. భ్రమరాంబ కోపంగా శేషు గొంతు నులిమి చంపేస్తాను అంటూ సైగ చేస్తుంది. శేషు మాత్రం ఏంటి భ్రమరం ఇంత చిన్న విషయానికే చంపేయాలా..? అంటాడు. రేఖ కోపంగా ఏంటి మీ గోల అన్నయ్య నన్ను విసిగించకు అంటూ రేఖ వెళ్లిపోతుంది. శేషు మాత్రం అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ నందు ఏ ముహూర్తంలో ఉప్మాలో గమ్ము కలిపిందో కానీ ఇన్నేళ్ల మన జీవితంలో ఇవాళ నీ నోరు మూసుకుంది. మనం ఇక డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి పదా అంటూ భ్రమరాంబను తీసుకుని వెళ్లిపోతాడు శేషు.

రాజు దగ్గరకు వెళ్లిన లక్కీ ఏంటి మావ ఇలా అయింది. సాయంత్రం వరకు మా అమ్మ ఎవరో తెలుస్తుంది అని చెప్పావు ఇలా అయిపోయావేంటి..? అసలు నీకు యాక్సిడెంట్‌ చేయించిది ఎవర్రా అని అడగ్గానే.. లైఫ్‌లో ఏదీ మనం అనుకున్నట్టు జరగదురా..? లైఫ్‌లో అందరి దూల తీరిపోతుంది అంటూ చెప్తుంటే.. లక్కీ అసలు మా అమ్మ ఎవరు..? అంటూ అడగ్గానే.. ఆరోజు తెలిసేదేరా..? కానీ యాక్సిడెంట్‌ కావడం వల్ల తెలుసుకోలేకపోయాను ఎక్కడున్నా సరే త్వరలోనే మీ అమ్మను తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది అంటూ లక్కీకి చెప్తాడు రాజు. రాజు మాటలకు లక్కీ ఎమోషనల్‌ అవుతాడు. రాజు ఓదారుస్తాడు. లక్కీ వెళ్లిపోయాక రాజు, రేఖ గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఇందు పాల గ్లాసుతో రాజు రూంలోకి వెళ్తుంది. ఇందును చూసిన రాజు ఏయ్‌ ఈ పూలేంటి..? ఆ గ్లాసేంటి..? ఆ చీరేంటి అసలు శోభనం గదిలోకి వచ్చినట్టు వచ్చావేంటి..? అని కంగారుపడుతూ అడుతుంటే..

Advertisement

నేను నీ భార్యను కదా బావ అందుకే ఇలా వచ్చాను అంటూ ఇందు రొమాంటిక్‌గా చెప్తుంటే.. రాజు కంగారుగా అమ్మో ఏంటి నీ చూపు మారింది. నీ పిలుపు మారింది. మరో ప్లాన్‌తో వచ్చినట్టు ఉన్నావు అసలు నన్నేం చేద్దాం అనుకుంటున్నావే.. అంటూ రాజు అడిగితే.. నిన్ను మా ఇంటికి తీసుకెళ్లడానికి మాత్రమే ఇలాంటి ప్రయాత్నాలు చేస్తున్నాను.. సరే ముందైతే ఈ పాలు తాగు అంటూ పాల గ్లాసు ఇస్తుంటే.. రాజు కంగారుగా ఏయ్‌ నేను తాగను నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఇందు ఎందుకు బావ అలా మాట్లాడతావు.. అనగానే.. అయితే సరే తప్పు అయిపోయింది అంటూ చెంపలు వేసుకో అనగానే.. ఇందు బావ తప్పై పోయింది అంటూ చెంపలు వేసుకుంటుంటే.. రాజు మనసులో నవ్వుకుంటూ.. నాతో ఎంత ఆడుకున్నావే.. నిన్ను ఇంకా ఆడుకుంటాను అంటూ నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నేను రాను.. నువ్వు ఇక్కడే ఉంటే నన్ను ఏదో చేసేలా ఉన్నావు.. నువ్వు బయటకు వెళ్లు.. అంటూ ఇందును బయటకు తోసేస్తాడు రాజు.

ఉదయం నిద్ర లేచిన రాజు ఇందు ఏం చేస్తుంది చూద్దాం అనుకుంటూ రూంలోంచి బయటకు వెళ్లి ఇందు అంటూ పిలుస్తాడు. ఇందు పలకదు. దీంతో ఇంట్లో ఉంటే పలకేది. లేదంటే ఈ పాటికే బావ అంటూ పిలుస్తూ వచ్చేది ఇందు వెళ్లిపోయినట్టు ఉంది అనుకుంటూ నవ్వుతూ బయటకు వచ్చి డోర్‌ ఓపెన్‌ చేయగానే.. డోర్ దగ్గర టెంట్‌ వేసుకుని కూర్చుని ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేస్తుంది ఇందు. ఇందును చూసి రాజు షాక్‌ అవుతాడు. ఇందుకు సపోర్టుగా లక్ష్మీ, చలపతి కూడా ధర్నాలో పాల్గొంటారు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

తాత గారితో పందెం సీక్రెట్ బయటపెట్టిన రామోజీరావు మనవడు..!

పెళ్లిపీటలెక్కిన ‘జగధాత్రి’ సీరియల్ నటి…ఫోటోలు వైరల్!

పోలీసులను ఆశ్రయించిన మాధురి రాథోడ్.. పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి!

“మాధురి రాథోడ్ నోరు విప్పితే అంతా జైలుకే”.. నిజాలు బయటపెట్టిన ఫోక్ ప్రొడ్యూసర్!

సనాతన ధర్మం.. ట్రోలర్స్ కి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్ !

సుధీర్ రాకతో స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ!

తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. ఎవరంటే?

Ninnu kori Serial Today Episode September 1st  ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ ఆపేందుకు చంద్ర కొత్త ప్లాన్      

Big Stories

Advertisement
×