E-Paper
Advertisement

పగలు కోడింగ్.. రాత్రి దోపిడీ! ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పార్ట్‌టైమ్ జాబ్ తెలిస్తే షాకవుతారు!

పగలు కోడింగ్.. రాత్రి దోపిడీ! ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పార్ట్‌టైమ్ జాబ్ తెలిస్తే షాకవుతారు!
Advertisement

Loan Scam: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే సమాజంలో ఒక మంచి గౌరవం, నెలకు చేతినిండా జీతం. కానీ, కొందరికి ఎంత సంపాదించినా ఆశ తీరడం లేదు. ఈజీ మనీ కోసం అలవాటు పడి, పక్కదారి పడుతున్నారు. పగలు సిస్టమ్ ముందు కూర్చుని సాఫ్ట్‌వేర్ కోడింగ్ రాసే ఓ టెక్కీ.. రాత్రి వేళల్లో సైబర్ నేరగాడిగా అవతారమెత్తాడు. ఆన్‌లైన్ లోన్ల పేరుతో అమాయకులను ముంచేస్తూ చివరకు పోలీసుల చిక్కాడు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ.. వలలో పడి!

Advertisement

ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకోలి గ్రామానికి చెందిన మెస్రం ప్రవీణ్ అనే యువకుడు సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండేవాడు. ఈ క్రమంలోనే అతనికి ‘తక్కువ వడ్డీకే ఆన్‌లైన్ లోన్’ అంటూ ఒక ఆకర్షణీయమైన అడ్వర్టైజ్‌మెంట్ కనిపించింది. అత్యవసరంగా డబ్బులు అవసరముండటంతో, నిజమేనని నమ్మి ప్రవీణ్ ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. అంతే.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు.

ఫీజుల పేరుతో దోపిడీ

Advertisement

లింక్ క్లిక్ చేసిన కొద్దిసేపటికే ప్రవీణ్‌కు ఒక గుర్తుతెలియని నంబర్ నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. లోన్ మంజూరు చేస్తామని నమ్మబలికిన నేరగాళ్లు.. ప్రాసెసింగ్ ఫీజు, లోన్ అప్రూవల్ ఫీజు, ముందస్తు ఈఎంఐ, సర్వీస్ చార్జీలు అంటూ రకరకాల పేర్లతో ప్రవీణ్ నుండి విడతల వారీగా రూ. 17,951 ఆన్‌లైన్‌లో గుంజేశారు. ఆ తర్వాత ఎంతకీ లోన్ అమౌంట్ అకౌంట్‌లో పడకపోవడంతో పాటు, అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ప్రవీణ్ తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

Also Read: హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే ‘బుల్లెట్ రైల్’ హబ్‌గా భాగ్యనగరం- రాంచందర్ రావు

రంగంలోకి దిగిన పోలీసులు.. షాకింగ్ నిజాలు!

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఆదిలాబాద్ పోలీసులు టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి. ఈ మోసానికి పాల్పడింది హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన తలారి ఆకాష్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని తేలింది. ఆకాష్‌తో పాటు మరో నలుగురు కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి ఈ దందా నడుపుతున్నట్లు గుర్తించారు. వీరు ఒక్క ప్రవీణ్‌నే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మరో 30 మందిని ఇదే తరహాలో బురిడీ కొట్టించినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు ఆకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×