E-Paper
Advertisement

Brahmamudi Serial Today July 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: జూనియర్‌తో ఆడుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ – ఎమోషనల్‌ అయిన రేవతి

Brahmamudi Serial Today July 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: జూనియర్‌తో ఆడుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ – ఎమోషనల్‌ అయిన రేవతి
Advertisement

Brahmamudi serial today Episode: ఇంటికి వచ్చిన రేవతి కొడుకు జూనియర్‌ స్వరాజ్‌ను చూసిన అందరూ షాక్‌ అవుతారు. ఆ పిల్లాడు ఎవరు మమ్మీ అని రాహుల్‌ రుద్రాణిని అడిగితే నాకు అదే అర్థం కావడం లేదురా..? కొంపదీసి గతంలో అన్నయ్య ట్విస్ట్‌ ఇచ్చినట్టు వదిన కూడా ఏదైనా ట్విస్ట్‌ ఇస్తుందా ఏంటి అని రుద్రాణి అనుమానిస్తుంది. దీంతో రాహుల్‌  నువ్వు ఊరుకో మమ్మీ పెద్దత్తయ్యా అలాంటిది కాదు అంటాడు. ఇంతలో లోపలికి వచ్చిన అపర్ణతో జూనియర్‌ రాజ్‌ ఫ్రెండ్‌ మీ ఇల్లు బయటే కాదు.. లోపల కూడా చాలా బాగా ఉంది అంటాడు. ఇంతలో సుభాష్‌ కల్పించుకుని అపర్ణ ఎవరీ పిల్లాడు..? అని అడుగుతాడు. మొన్న మీకు చెప్పాను కదండి నేను కారు డోరు తీస్తుంటే ఒక పిల్లాడు కిందపడిపోయాడు. వాడు నాకు చాలా బాగా నచ్చాడు అని వాడే వీడు అని చెప్తుంది అపర్ణ.

నచ్చితే ఓ చాక్లెటో..బిస్కెట్టో కొనిస్తే సరిపోతుంది కదా వదిన ఇలా ఇంటి దాకా తీసుకురావడం ఏంటి అని అడుగుతుది రుద్రాణి. రుద్రాణి మాటలకు అపర్ణ కోపంగా ఏం తీసుకొస్తే ఏమైంది రుద్రాణి వీడికి నా మనసులోనే స్థానం ఇచ్చాను.. ఇక ఇంటిలో స్థానం ఇవ్వలేనా..? అంటుంది అపర్ణ. ఇంతకీ ఈ బాబు ఎవరి పిల్లాడు అక్కా అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. అది తెలియకే ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది ధాన్యం అని అపర్ణ చెప్పగానే.. అదేంటి వదిన పిల్లాడి పేరెంట్స్‌ తెలియకపోతే ఇంటికి తీసుకురావడం ఏంటి..? అని ప్రకాష్‌ అడుగుతాడు. దీంతో వీడు ఇందాక గుడిలో తప్పిపోయి అటూ ఇటూ తిరుగుతుంటే నేనే ఇంటికి తీసుకొచ్చాను ప్రకాషం అని చెప్పగానే.. ప్రకాష్‌ ఆశ్చర్యంగా తప్పిపోయాడా అని అడుగుతాడు.

Advertisement

ఇంతలో స్వప్న ఈ బాబును ఎక్కడో చూసినట్టు ఉంది అంటుంది. అప్పు కూడా అవును అక్కా నాక్కూడా ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది అంటుంది. దీంతో అపర్ణ వీడు ఎవరి కొడుకో నీకు తెలుసా..? స్వప్న అని అపర్ణ అడగ్గానే.. తెలుసు ఆంటీ.. అంటూ స్వప్న నిజం చెప్పబోతుంటే.. కావ్య కల్పించుకుని అక్కా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వీడు మన అత్తయ్య ఫ్రెండ్‌ అంటూ చెప్పొద్దు అంటూ సైగ చేస్తుంది కావ్య. అప్పు, స్వప్న అర్థం చేసుకుని ఓ అంటారు. ఇంతలో రాజ్‌ కూడా అవును పైగా అమ్మ వెళ్లిన గుడిలోనే పాపం తప్పిపోయాడు. వాళ్ల అమ్మ కోసం టెన్షన్‌ పడుతుంది. చూసి తట్టుకోలేకపోయింది అమ్మ. మా అమ్మకు వీడు ఇది వరకే పరిచయం కాబట్టి ఇంటికి తీసుకొచ్చింది అని చెప్తుండగానే కావ్య కూడా అవును అక్కా మీరు చూసిన అబ్బాయి వేరు ఈ అబ్బాయి వేరు.. కావాలంటే ఒకసారి బాగా చూడండి అని చెప్పగానే.. స్వప్న ఆ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది కావ్య.. అనగానే.. అనిపించడం ఏంటి అక్కా హండ్రెడ్‌ పర్సెంట్‌ వీడు వేరు వాడు వేరు అంటుంది అప్పు.

అంతా గమనిస్తున్న రుద్రాణి వీళ్లేంటి..? ఏదో ప్రిపేర్‌ చేసి పెట్టిన ఆర్టిస్టుల్లా..ఇప్పుడే తెలుసు అని చెప్పి అప్పుడే మాట మారుస్తున్నారు ఇంతలో ఏం జరిగి ఉంటుంది అని మనుసులో డౌటు పడుతుంది. ఇంతలో రాజ్‌ హలో అప్పు పోలీస్‌ అనగానే.. అప్పు కోపంగా బావగారు నన్ను అప్పు అని పిలవండి లేకపోతే పోలీస్‌ అని పిలవండి అంతేకానీ అలా రెండు కలిపి పిలిస్తే నేను ఏదో అప్పు చేసిన పోలీస్‌ లా అనిపిస్తుంది అనగానే.. రాజ్‌ సరే అయితే కానీ నువ్వు ఈరోజంతా బాగా ఆలోచించి వీడి పేరెంట్స్‌ ఎవరో కనుక్కో రేపు పొద్దున వీడిని వాళ్ల పేరెంట్స్‌కు అప్పగిద్దాం అంటాడు రాజ్‌. ఇంతలో బెడ్‌ రూంలోకించి వచ్చిన ఇంద్రాదేవి అక్కడ జూనియర్‌ రాజ్‌ను చూసి షాక్‌ అవుతుంది. తర్వాత ఎమోషనల్‌ అవుతూ ఈ విషయం బావకు చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళ్లి పరంధామయ్యకు విషయం చెప్తుంది.

Advertisement

ఇద్దరూ బయటక వచ్చి ఎవరు ఈ బాబు అని అడుగుతారు. జరిగిన విషయం అపర్ణ చెప్తుంది. తర్వాత రాజ్‌కు అన్నం తినిపిస్తుంది. రాజ్‌ వెళ్లి అమ్మా నీకు వీడి మీద ప్రేమ లేదు అంటాడు. ఎందుకని అపర్ణ అడగ్గానే.. అంత ప్రేమ ఉంటే వాడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని తినిపించాలి అంటాడు. తర్వాత అపర్ణ, సుభాష్‌, ప్రకాష్‌ ముగ్గురూ కలిసి సొంత మనవడితో ఆడుకున్నట్టు ఆడుకుంటూ.. అన్నం తినిపిస్తుంటారు. కావ్య వెంటనే రేవతికి వీడియో కాల్‌ చేసి చూపిస్తుంది. ఆ వీడియో చూసిన రేవతి, జగదీష్‌ ఎమోషనల్‌గా ఫీలవుతారు. రేవతి ఆనందతో ఏడుస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×