OTT Movie : వ్యవసాయం, ఆధ్యాత్మికత, సాంప్రదాయ విలువల గొప్పదనాన్ని చూపించే ఒక తమిళ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చుస్తే కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం. ఈ స్టోరీ అంత గొప్పగా ఉంటుంది. ఇందులో నల్లంది అనే వృద్ధుడి అద్భుతమైన నటన, విజయ్ సేతుపతి సపోర్టింగ్ రోల్, మణికందన్ రియలిస్టిక్ దర్శకత్వం ఈ సినిమాకు హైలెట్ గానిలిచాయి. ఇది 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపికైంది. నల్లంది నటనకు స్పెషల్ మెన్షన్ అవార్డును కూడా అందుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
సోనీలివ్ లో స్ట్రీమింగ్
(Kadaisi Vivasayi) 2022లో విడుదలైన తమిళ డ్రామా సినిమా. ఇది ఎం. మణికందన్ దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో నల్లంది (మాయాంది), విజయ్ సేతుపతి (రామయ్య), యోగి బాబు (ఒక గ్రామస్థుడు), రాయిచెల్ రెబెక్కా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళనాడులోని ఉసిలంపట్టి సమీపంలోని ఒక గ్రామంలో వ్యవసాయం గురించి జరిగే కథ. 2022 ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా SonyLIV, Amazon Prime అందుబాటులో ఉంది. 2 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు IMDbలో 8.7/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
మాయాంది (నల్లంది)అనే 80 ఏళ్ల వృద్ధ రైతు, తమిళనాడులో నీటి వసతి సరిగ్గా లేని గ్రామంలో చివరి వ్యవసాయదారుడిగా ఉంటాడు. ఈ గ్రామంలోని ఇతర రైతులందరూ తమ భూములను రియల్ ఎస్టేట్ డెవలపర్‌లకు అమ్మేసారు. కానీ మాయాంది తన భూమిని అమ్మడానికి నిరాకరిస్తాడు. అతను ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ, తన పొలం, పశువులు, సాంప్రదాయ జీవనశైలితో సంతృప్తిగా ఉంటాడు. ఒకసారి ఈ గ్రామంలో జరిగే ఆచారం కోసం, మాయాంది తన పొలంలో పండించిన ధాన్యాన్ని అందించాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రామంలో ఏకైక రైతు అతనే. అయితే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. మాయాందిని పై మూడు నెమళ్లను చంపి, తన భూమిలో పాతిపెట్టాడని తప్పుడు ఆరోపణలు వస్తాయి. ఈ కేసు అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అతన్ని అరెస్టు చేసి, జైలుకు పంపిస్తారు. అతని భూమిని డెవలపర్‌లు లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో రామయ్య (విజయ్ సేతుపతి) అనే వ్యక్తితో పాటు ఇతర గ్రామస్థులు మాయాంది కోసం పోరాడతారు.
Read Also : బుర్రపాడు సీన్లురా బాబూ… పెళ్లి చేసుకుని, లవర్స్ ను అన్నాచెల్లెళ్లు చేసే పేరెంట్స్… తేడా యవ్వారమే
ఈ కథలో మాయాంది నిశ్శబ్ద స్వభావం, అతని ఆధ్యాత్మిక నమ్మకాలు, గ్రామంలోని ఇతరులతో అతని సంబంధాలు హృదయాన్ని హత్తుకుంటాయి. ఈ సినిమా వ్యవసాయం, సాంప్రదాయ జీవనశైలి కనుమరుగవుతున్న నేపథ్యంలో ఒక ఎమోషనల్ టచ్ ఇస్తుంది. మాయాంది పోరాటం కేవలం భూమిని కాపాడుకోవడం గురించి మాత్రమే కాదు. అది అతని గుర్తింపు, ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవడం గురించి కూడా. క్లైమాక్స్‌లో ఈ కేసు వెనుక రహస్యం బయటపడుతుంది. సినిమా ఒక హార్ట్ టచింగ్ నోట్‌తో ముగుస్తుంది. ఇది ప్రేక్షకులకు వ్యవసాయం ప్రాముఖ్యత, సాంప్రదాయ జీవనశైలి గురించి ఆలోచింపజేస్తుంది. అయితే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేదు. కానీ దాని కథ, నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.