BigTV English

Brahmamudi Serial Today June 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను చంపేయమన్న యామిని – రిసార్ట్‌ నుంచి కావ్యతో ఎస్కేప్ అయిన రాజ్‌

Brahmamudi Serial Today June 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను చంపేయమన్న యామిని – రిసార్ట్‌ నుంచి కావ్యతో ఎస్కేప్ అయిన రాజ్‌

Brahmamudi serial today Episode: రిసార్ట్‌లో కావ్య రూమ్‌ కు వచ్చిన బాయ్‌ రాజ్‌ను అదేంటి మీరు ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు. దీంతో రాజ్‌ కంగారు పడతాడు. బాయ్‌ని తిడతాడు. కావ్య ఏంటని అడుగుతుంది. ఇందాక వంద రూపాయలు టిప్పు ఇచ్చాను. ఇంకా కావాలని అడుగుతున్నాడు అని చెప్తాడు రాజ్‌. కావ్య వాడిని తిడుతుంది. దీంతో వాడు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు బాయ్‌. రాజ్‌ కోసం వెతుకుతున్న యామిని బాయ్‌కు ఎదురుపడుతుంది. వెళ్లి యామినిని పలిచి మీరు సార్‌ను అంత గుడ్డిగా నమ్మకు అని చెప్తాడు. ఇంతలో రాజ్‌ వచ్చి అరేయ్‌ ఏం చెప్తున్నావురా..? అని అడ్డుపడతాడు. బాయ్‌ని తిట్టి అక్కడి నుంచి వెళ్లగొడతాడు. అక్కడి నుంచి నేరుగా కావ్య దగ్గరకు వెళ్తాడు బాయ్‌. మేడం నేను మీతో ఒక సీక్రెట్‌ చెప్పాలి అంటాడు. ఏంటో చెప్పు అని అడుగుతుంది కావ్య.


ఇందాక మీ దగ్గర ఉన్నారు ఆయన మరో రూంలో వేరే అమ్మాయితో ఉన్నారు మేడం అని చెప్తాడు. దీంతో కావ్య తెలుసు అని చెప్తుంది. దీంతో ఆ బాయ్‌ జుట్టు పీక్కుంటాడు. మేడం ఆయన ఇంతకీ మీకు ఏమవుతారు మేడం అని అడగ్గానే.. కావ్య ఆయన మా శ్రీవారు అని చెప్తుంది. కన్పీజ్‌లో బాయ్‌ మీకు శ్రీవారు అయితే యామిని మేడం ఆయనకు ఏమవుతుంది మేడం అని అడుగుతాడు. ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. బాయ్‌ షాక్‌ తింటాడు. మరోవైపు యామినిని తీసుకుని రూంలోకి వెళ్లిన రాజ్‌ను యామిని రొమాంటిక్‌గా టచ్‌ చేస్తుంది. రాజ్‌ యామిని ఏంటిది..? అంటాడు. యామిని తప్పేం ఉంది బావ మనం కాబోయే భార్యభర్తలం అంటుంది. మరోవైపు రిసెప్షన్‌లోకి వచ్చిన కావ్య అదేంటి ఆయన ఇంకా రాలేదు కొంపదీసి యామిని ఏమైనా చేస్తుందా..? అని మనసులో అనుకుని కాల్ చేస్తుంది.

కాల్‌ లిఫ్ట్‌ చేసిన రాజ్‌ ఏరా వచ్చావా…అంటాడు. ఇదేంటి నన్ను పట్టుకుని మగాడితో మాట్లాడినట్టు ఏరా అంటున్నాడు.. ఓహో పక్కన యామిని ఉందనా..? చెప్తా.. అని మనసులో అనుకుని ఏంటండి ఎవరో మగాడితో మాట్లాడినట్టు నన్ను పట్టుకుని ఏరా అంటున్నారు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ అవునురా చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను అని చెప్తాడు. దీంతో కావ్య సరేలేండి మీరు నాతో ఆఫీసుకు వస్తాను అన్నారు కదా..? నాకు టైం అవుతుంది. మీరు బిజీగా ఉంటే నేను వెళ్లిపోతాను లేండి.. అని చెప్తుంది. దీంతో రాజ్‌ అరే అలా అలిగి వెళ్లిపోతే ఎలారా…? మన ఫ్రెండిషిప్‌కు మీరిచ్చే వ్యాల్యూ ఇదేనా..? నేను వస్తున్నాను ఉండు అంటూ కాల్ కట్‌ చేసి యామిని నేను వెళ్లాలి అని చెప్తాడు. యామిని ఇరిటేటింగ్‌గా మళ్లీ ఎక్కడికి బావ అని అడుగుతుంది.


కిరణ్‌ అని నాఫ్రెండ్‌ వెళ్లిపోతా అంటున్నాడు.. వెళ్లి సెండాప్‌ ఇచ్చి వస్తాను. నా కోసం వెయిట్‌ చేస్తూ ఉండు వస్తాను అంటూ రాజ్‌, కావ్య దగ్గరకు వెళ్తాడు నేను వచ్చేశా అంటాడు. ఇక నేను వెళ్లిపోదామని డిసైడ్‌ అయ్యాను అంటుంది. అదేంటండి నా మాటంటే మాటే..  ఇక వెళ్దాం పదండి అంటూ కావ్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో యామిని వచ్చి రాజ్‌, కావ్య వెళ్లడం చూసి షాక్‌ అవుతుంది. కోపంగా నన్ను ఇంత చీట్‌ చేస్తావా..? బావ ప్రెండ్‌ను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి దానితో వెళ్లిపోతావా..? కావ్య నేను వేసిన ప్లాన్‌ ను చెడగొట్టావు కదా..? నీవు చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకుంటావు. అని రౌడీకి ఫోన్‌ చేసి కావ్యను చంపమని చెప్తుంది. రౌడీ సరేనంటాడు.

మరోవైపు కిచెన్‌లో ఉన్న అప్పు దగ్గరకు వెళ్లిన కళ్యాణ్‌ వెనక నుంచి వెళ్లి హగ్‌ చేసుకోబోతుంటే అప్పు గరిటేతొ కొడుతుంది. దీంతో కళ్యాణ్‌ కవితల రూపంలో అప్పును తిడుతుంటే.. స్వప్న వస్తుంది. ఏంటి మీరు ఇక్కడ కవితలు చెప్తున్నారు అని అడుగుతుంది. ఇంతలో రాహుల్ వచ్చి ఇవన్నీ ఎందుకురా ఎక్కడైనా మంచిగా హనీమూన్‌ ప్లాన్‌ చేసుకోక అంటూ చెప్తూ.. స్వప్న దగ్గర ఉన్న లాకర్‌ కీస్‌ కొట్టేస్తాడు. వెంటనే వెళ్లి లాకర్‌ ఓపెన్‌ చేసి నగలు మారుస్తుంటే.. స్వప్న వచ్చి చూసి కోపంగా రాహుల్‌ అని అరుస్తుంది. దగ్గరకు వెళ్లి రెండు రోజుల నుంచి నువ్వు ఇలా తచ్చాడుతుంటేనే నాకు డౌటు వచ్చింది అంటూ కోప్పడుతుంది. రాహుల్ అది కాదు స్వప్న నేను చెప్పేది విను అంటాడు. భర్తవు అయి ఉండి భార్య నగలు దొంగిలించాలని చూస్తావా..? అంటుంది స్వప్న. ఓహో నేను దీని నగలు దొంగిలిస్తున్నాను అనుకుందా..? నేను ఇంకా గిల్ట్‌ నగలు పెడుతున్నానేమో అనుకుందేమో అనుకున్నా..? అని మనసులో అనుకుంటుంటే..

స్వప్న కోపంగా నగలు తీసుకుని కిందకు వెళ్తుంది. హాల్లో నగలు అందరి ముందు విసిరి కొడుతుంది. దీంతో రుద్రాణి కోపంగా స్వప్నను తిడుతుంది. నగలు నీకు ఎక్కువైతే నాకివ్వు నేను దాచుకుంటాను అంటుంది. దీంతో రాహుల్‌ నగలు దొంగిలించాలనుకున్నాడు అని చెప్తుంది. అందరూ రాహుల్ ను తిడతారు. రుద్రాణి రాహుల్‌ను వెనకేసుకొస్తుంది. సుభాష్‌ కోపంగా నిజం చెప్తావా..? లేదా అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే స్వప్న చెప్పింది నిజమే మామయ్య అని చెప్తాడు రాహుల్‌. అందరూ షాక్‌ అవుతారు. దొంగే దొంగిలించానని ఒప్పుకున్నాడు ఇక ఫినిష్‌. అత్తయ్యా ఇప్పుడు చెప్పు నీ కొడుకు నీతిమంతుడు అంటూ వెనకేసుకొచ్చావు కదా అంటూ ఎమోషనల్‌ అవుతుంది స్వప్న. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×