Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలోని చంచల్‌గూడ ప్రధాన రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ ను అదుపు చేయలేక రోడ్డుకు పక్కనున్న డివైడర్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటన తర్వాత కారులో ఉన్న నలుగురు యువకులు అక్కడి నుంచి పరారు అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించారు పోలీసులు.
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పదే పదే పోలీసులు హెచ్చరిక చేస్తున్నారు. వాహనదారులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాత్రయితే చాలా కొన్ని ప్రాంతాల్లో కొందరు యువకులు వేగంగా వాహనాలు నడుపుతున్నారు. ఫలితంగా ప్రమాదాలకు గురవుతున్నారు. లేటెస్టుగా హైదరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రధాన రహదారిపై అదే జరిగింది.
నలుగురు యువకులు వేగంగా కారు నడుపుతూ రోడ్డుపై నానాహంగామా చేశారు. స్పీడ్‌ను కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కనేవున్న డివైడర్‌ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. డ్యామేజ్ అయిన కారు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే క్రేన్ సాయంతో కారుని అక్కడి నుంచి తొలిగించారు. ఆ రూట్లో ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ALSO READ: వర్షాలపై సీఎం రేవంత్ కీలక సూచనలు.. ఎమర్జెన్సీ బృందాలు కచ్చితంగా ఉండాల్సిందే
డివైడర్‌ని కారు ఢీ కొట్టిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. ఘటన తర్వాత ఆ నలుగురు అక్కడి నుంచి పరారు అయ్యారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహనం ఎవరికి? డ్రైవింగ్ చేసిన యువకులు ఎవరు? అనేదానిపై లోతుగా విచారణ మొదలుపెట్టారు. యువకులు తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి ఘటనలు జరిగితే డ్రైవింగ్ లైసెన్సు సైతం కోల్పోతారు.