E-Paper
Advertisement

Brahmamudi Serial Today June 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: యామినికి షాక్‌ ఇచ్చిన రాజ్ – మండపంలోంచి వెళ్లిపోయిన రాజ్‌

Brahmamudi Serial Today June 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: యామినికి షాక్‌ ఇచ్చిన రాజ్ – మండపంలోంచి వెళ్లిపోయిన రాజ్‌
Advertisement

Brahmamudi serial today Episode: అప్పు తన ఫోన్‌లో వీడియో డిలీట్‌ అయిందని చెప్పగానే.. రాజ్‌ కోపంగా ఏంటి అప్పు అసలు నువ్వు ఏం ప్రూవ్‌ చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దీంతో వైదేహి కోపంగా మీకు ఇంకా అర్థం కాలేదా అల్లుడుగారు. చేయని తప్పుకు నా కూతురుని ఇరికించి తనని అరెస్ట్ చేయించి ఈ పెళ్లి ఆపాలని చూసింది ఈ అప్పు అంటుంది. దీంతో కానిస్టేబుల్‌ శేషు మేడం మీరు అనవసరంగా అప్పు గారి మీద నిందలు వేయకండి అంటాడు. అప్పు కూడా శేషు గారు పూర్తి సాక్ష్యాలు లేకుండా ఇతన్ని తీసుకుని ఇంతదూరం తీసుకురావడం మన తప్పు అతన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లండి అని చెప్తుంది అప్పు. కానిస్టేబుల్‌ రఘును తీసుకుని వెళ్లిపోతాడు.

ఇంతలో వైదేహి వావ్‌ చాలా బాగా నటిస్తున్నావు అప్పు. అసలు నాకు మీ ఫ్యామిలీ మీదే అనుమానంగా ఉంది. పెళ్లి పనులు మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని ఆటంకాలే వస్తుంటే.. ఎందుకిలా జరగుతుంది అనుకున్నాను. ఇప్పుడు నువ్వు చేసింది చూస్తుంటే.. అవి కూడా మీ వాళ్లే చేసి ఉంటారని అనిపిస్తుంది అంటుంది. యామిని ఎమోషనల్‌ అవుతున్నట్టు నటిస్తూ అసలు నేను మీకేం ద్రోహం చేశాను.. ఇలా అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టి ఈ పెళ్లిని ఆపాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి మా బావే నా ప్రాణం అని బతుకుతూ తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. అది తప్పా.. మాకు నిశ్చితార్థం అయ్యాక బావ యాక్సిడెంట్‌లో కోమాలోకి వెళితే ఆరు నెలలు తన దగ్గరే ఉంటూ సేవ చేస్తూ తన కోసం ఎదురుచూశాను అది నా తప్పా..? నా ప్రేమనంతా తనకు ఇవ్వాలనుకున్నాను అది నా తప్పా..? అంటూ ప్రశ్నిస్తుంది.

Advertisement

రుద్రాణి మాత్రం ఫర్మామెన్స్‌ ఇరగదీస్తుంది కదా..? దీంతో రాజ్‌ పెళ్లి చేసుకోవడం ఖాయం అంటుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా మమ్మీ అంటాడు రాహుల్‌. యామిని ఇంకా నేను చేసిన తప్పేంటి నా మీద ఎందుకు ఇంత కక్ష్య కట్టారు అని అడుగుతుంది. దీంతో కనకం కోపంగా చాలు ఆపవే నువ్వేంటో మీ ఫ్యామిలీ ఏంటో మీరు ఆడుతున్న నాటకాలేంటో నాకు తెలియదు అనుకుంటున్నారా..? మా అల్లుడు గారి గురించి ఆలోచిస్తున్నాను కానీ లేకపోతే ఈ పాటికి మీకు ఇత్తడి అయిపోయేది అంటుంది. దీంతో కావ్య భయంతో ఆవేశంలో అమ్మ అన్ని నిజాలు చెప్పేసేలా ఉంది. ఆయనకు గతం గుర్తు చేస్తే ఇంకేమైనా ఉందా..? అని భయపడుతుంది. వెంటనే కనకాన్ని అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు ఇంకొక్క మాట నువ్వు మాట్లాడినా నా మీద ఒట్టు అంటూ కావ్య కనకం చేయిని తన తల మీద పెట్టుకోగానే.. కనకం కామ్‌ అయిపోతుంది. వెంటనే కావ్య.. అప్పు అమ్మను ఇక్కడి నుంచి తీసుకెళ్లు అని చెప్తుంది. దీంతో అప్పు, కనకాన్ని తీసుకుని బయలకు వెళ్లిపోతుంది.

దీంతో వైదేహి తెలివిగా నీ తల్లిని నీ చెల్లితో బయటకు పంపించేశావు. మరి ఆవిడ వేసిన నిందల సంగతి ఏంటి..? అని అడుఉతుంది. దీంతో కావ్య వైదేహి గారు మీకు కావాల్సింది మీ కూతురు జీవితం నిలబడటమా..? లేక నా చెల్లి చెప్పు సమాధానాలా..? రామ్‌ గారు మీరు యామిని ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా..? అని అడుగుతుంది. రాజ్‌ నమ్ముతున్నాను అని చెప్తాడు. దీంతో విన్నావు కదా యామిని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు సంతోషంగా పెళ్లి చేసుకో అని చెప్తుంది. ఇంతలో ఇంద్రాదేవి ఓసేయ్‌ ఏం మాట్లాడుతున్నావే అని అడుగుతుంది. దీంతో అమ్మమ్మ గారు ఇప్పటి వరకు మీరందరూ చేసింది చాలు దయచేసి ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడకండి.. కూర్చో యామిని పెళ్లి పీటల మీద కూర్చో అని చెప్తుంది. యామిని వెంటనే కావ్య దగ్గరకు వెల్లి హగ్‌ చేసుకుంటూ థాంక్యూ కళావతి గారు మీరైనా నా బావ మీద నాకున్న ప్రేమను అర్థం చేసుకున్నారు అంటూ మెల్లగా చెవి దగ్గర చెప్పాను కదే జీవితంలో మొదటిసారి నువ్వు నా చేతిలో ఓడిపోతున్నావు అంటుంది.

Advertisement

నేను అదే చెప్తున్నాను యామిని ఈ పెళ్లి జరగదు అని చెప్తుంది. దీంతో యామిని భయంతో ఇంత జరిగినా ఈ కావ్య ఎందుకు ఇంత కాన్ఫిడెంట్‌గా ఉంది అని మనసులో అనుకుంటూ వెళ్లి పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. ఇంతలో పంతులు తాళి తీసి రాజ్‌కు ఇస్తాడు. తాళఙ కట్టడానికి రెడీ అయిన రాజ్‌ కావ్యను చూస్తూ ఎమోషనల్‌ అవుతాడు. తాళి కట్టబోతూ రాజ్‌ తాళిని వదిలేస్తాడు. సారీ యామిని అంటాడు. అందరూ షాక్‌ అవుతారు. ఎందుకు బావ ఏమైంది అని యామిని అడుగుతుంది. దీంతో ఈ పెళ్లి ఇక్కడితో ఆపేయడం మంచిది. నన్ను క్షమించు యామిని అంటూ మండపంలోంచి వెళ్లిపోతాడు రాజ్‌. యామిని  కోపంగా కావ్యను చూస్తుంది. తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికి వెళ్లి హ్యపీగా పార్టీ చేసుకుంటారు. మరోవైపు యామిని కోపంగా రూంలోకి వెళ్లి లాక్‌ చేసుకుంటుంది. వైదేహి కోపంగా రాజ్‌ను తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×